చిన్నారి తుపాకీ నొక్కడంతో తల్లి మృతి | gun that killed the mother of the infant strokes | Sakshi
Sakshi News home page

చిన్నారి తుపాకీ నొక్కడంతో తల్లి మృతి

Published Thu, Jan 1 2015 2:41 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

gun that killed the mother of the infant strokes

  • అమెరికాలో విషాద ఘటన
  • లాస్ ఏంజెలిస్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని రెండేళ్ల బాబు ప్రమాదవశాత్తు తుపాకీని నొక్కడంతో, అతడి తల్లి మరణించింది. ఈ ఘటన ఇదహో రాష్ట్రంలోని హేడెన్ నగరంలో జరిగింది. ఆమెను వెరోనికా రుట్లెడ్జ్ (29)గా గుర్తించారు. వెరోనికా మంగళవారం నలుగురు చిన్నారులతో కలిసి వాల్‌మార్ట్ దుకాణంలో షాపింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

    దుకాణంలో ట్రాలీలో కూర్చున్న ఆమె రెండేళ్ల కొడుకు తల్లి పర్సు నుంచి తుపాకీని తీసి నొక్కడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. చిన్నారులంతా 11 ఏళ్లలోపువారేనని తెలిపారు. ఆమె స్థానికురాలు కాదని, వేరే రాష్ట్రం నుంచి విహారం కోసం వచ్చారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే వాల్‌మార్ట్ దుకాణాన్ని మూసివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement