యువతిని, యువకుడిని కాల్చి తనూ కాల్చుకున్నాడు | A man killed young man and woman | Sakshi
Sakshi News home page

యువతి, యువకుడిని కాల్చి తనూ కాల్చుకున్నాడు

Published Sun, Jan 26 2014 6:12 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

A man killed young man and woman

కొలంబియా: బాల్టిమోరీ శివారులో రద్దీగా ఉండే షాపింగ్‌మాల్‌లో ఒక దుండగుడు తుపాకీతో ఇద్దరిని కాల్చి హత్య చేశాడు.  ఆ తరువాత తనూ కాల్చుకొని మృతి చెందాడు. దుండగుడు తుపాకీతో షాపింగ్ మాల్లోకి చొరబడి ఆ షాపుకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరూ 20 ఏళ్ల వయసు గల యువతీయువకులే. కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకోవడానికి ఇతర ఉద్యోగులు ప్రయత్నించారు. దాంతో అతను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనలో మరో అయిదుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకొని పోలీసులు రంగప్రవేశం చేశారు. దుండగుడు కాల్పులు జరిపిన ఉద్దేశం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement