తిరుపతి : తొక్కిసలాట (tirupati stampede) ఘటనలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల వారికి తోచినట్లు మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తలోమాట మాట్లాడారు. ఇక్కడ వేర్వేరు అధికారులను టార్గెట్ చేశారు.
అయితే ముందుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు. కానీ పవన్ మాత్రం ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఛైర్మన్ బీఆర్ నాయుడుల తప్పుందని తేల్చేశారు. వారిమధ్య సమన్వయలోపం వలనే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేశారు,
కానీ వేరే అధికారులదే తప్పంటూ చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్షవర్ధనరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను ట్రాన్సఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల తలో మాట్లాడటంపై చర్చ జరుగుతుంది.
పవన్ మాట్లాడుతూ..
ప్రమాద బాధితుల్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తిరుపతిలో తప్పు జరిగింది. టీటీడీలో ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు. శ్యామలరావు, వెంకయ్య చౌదరి,ఛైర్మన్ బీఆర్ నాయుడుల మధ్య సమన్వయ లోపం ఉంది. పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలి’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment