తొక్కిసలాట.. 50 మంది మృతి
తొక్కిసలాట.. 50 మంది మృతి
Published Mon, Oct 3 2016 10:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
అడిస్ అబాబా: ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాటలో సుమారు 50 మంది మృతిచెందిన ఘటన ఇథియోపియాలో చోటుచేసుకుంది. ఒరోమియా ప్రాంతంలో మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ.. తిరుగుబాటుదారులకు సంబంధించిన జండాను ఎగురవేశారు. దీంతో వారిని చదరగొట్టే క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ ఘటనలో 50 మంది పౌరులు మృతి చెందారని అక్కడి ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్యను ధృవీకరించనప్పటికీ.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది.
Advertisement
Advertisement