
భర్త చనిపోయాడనుకుని ఓ భార్య చాలా ఆవేదన చెందింది. ఒక పక్కా ఆమె అతడి కోసం కోర్టులో విడాకుల విషయమై పోరాడుతుంది. ఇంతలో సడెన్‌గా భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. అతడి చివరి చూపుకోసం తపించిన భర్త తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదు. ఆ ఆవేదన నుంచి బయటపడలేక పోయింది. తీరా కొన్ని నెలల తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన అనెస్సా రోస్సీ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తన భర్తతో పోరాడుతోంది. ఆమె విడాకులిచ్చేందకు సముఖంగా లేదు కూడా. అయితే అనూహ్యంగా తన భర్త చనిపోయాడన్న షాకింగ్ వార్త వచ్చింది. దీంతో ఆమె తన భర్త చనిపోయాడనుకుని చివరి చూపుకోసం అతడి ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ అతడి తల్లిదండ్రులు అందుకు అంగీకరించ లేదు.
దీంతో ఆమె చాలా పశ్చాత్తాపంతో ఆవేదన చెందింది. విడాకులు ఇచ్చేసినా.. బతికేవాడేమో అనుకుని విలపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో కొన్ని నెలల క్రితం తన భర్త బతికే ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది. అతను మెక్సికోలో మరో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఆఖరికి వేరో అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకుని కుంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. దీన్ని తెలుసుకున్న ఆమె భర్త తానేమి నాటకాలు ఆడలేదని ఆమె విడాకులు ఇవ్వకపోవడంతో మెక్సికోలో గడిపేందుకు వెళ్లినట్లు సమర్ధించుకునే యత్నం చేశాడు.
(చదవండి: రిషి సునాక్ విదేశీ పర్యటన ఖర్చు..కేవలం ఫ్లైట్ జెట్‌లకే రూ. 4 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment