husband dead
-
భర్త చనిపోయాడనుకుని విలవిలలాడింది..కట్ చేస్తే అతను..
భర్త చనిపోయాడనుకుని ఓ భార్య చాలా ఆవేదన చెందింది. ఒక పక్కా ఆమె అతడి కోసం కోర్టులో విడాకుల విషయమై పోరాడుతుంది. ఇంతలో సడెన్‌గా భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. అతడి చివరి చూపుకోసం తపించిన భర్త తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదు. ఆ ఆవేదన నుంచి బయటపడలేక పోయింది. తీరా కొన్ని నెలల తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన అనెస్సా రోస్సీ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తన భర్తతో పోరాడుతోంది. ఆమె విడాకులిచ్చేందకు సముఖంగా లేదు కూడా. అయితే అనూహ్యంగా తన భర్త చనిపోయాడన్న షాకింగ్ వార్త వచ్చింది. దీంతో ఆమె తన భర్త చనిపోయాడనుకుని చివరి చూపుకోసం అతడి ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ అతడి తల్లిదండ్రులు అందుకు అంగీకరించ లేదు. దీంతో ఆమె చాలా పశ్చాత్తాపంతో ఆవేదన చెందింది. విడాకులు ఇచ్చేసినా.. బతికేవాడేమో అనుకుని విలపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో కొన్ని నెలల క్రితం తన భర్త బతికే ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది. అతను మెక్సికోలో మరో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఆఖరికి వేరో అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకుని కుంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. దీన్ని తెలుసుకున్న ఆమె భర్త తానేమి నాటకాలు ఆడలేదని ఆమె విడాకులు ఇవ్వకపోవడంతో మెక్సికోలో గడిపేందుకు వెళ్లినట్లు సమర్ధించుకునే యత్నం చేశాడు. (చదవండి: రిషి సునాక్ విదేశీ పర్యటన ఖర్చు..కేవలం ఫ్లైట్ జెట్లకే రూ. 4 కోట్లు) -
అత్తింటివారి దాష్టీకం!...బాలింత అయిన కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా...
యశవంతపుర: భర్త మృతి చెందిన దుఃఖంలో ఉన్న కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు నిర్దయగా వ్యవహరించి ఆమెను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. 30 రోజుల బాలింత అయిన ఆమె తన చిన్నారితో కలిసి ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ఈ ఘటన ఉడిపిలో జరిగింది. బాదామికి చెందిన అయ్యప్ప(28) ఉడిపిలో మెకానిక్ పని చేసేవాడు. రెండేళ్ల క్రితం గంగావతికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో అయ్యప్ప పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల క్రితం ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. 20 రోజుల క్రితం అయ్యప్ప కింద పడగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు కోడలిని మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన చిన్నారితో కలిసి ఉడిపి సమాజ సేవక విశుశెట్టి అంబలపాడి నిట్టూరు సఖి ఆశ్రయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతోంది. (చదవండి: చైన్‌స్నాచింగ్ చేయకపోతే నిద్రపట్టదు) -
AGWA: నీ జీవితానికి నువ్వే కథానాయిక
జీవితంలో ఎదురయ్యే అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని మరోసారి పొరపాట్లు చేయకుండా సమస్యల సుడిగుండాల్ని అధిగమిస్తుంటారు చాలామంది. శుభాపాండియన్ కూడా సమస్యల నుంచి బయట పడేందుకు చాలానే కష్టపడింది. తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను మరికొందరి జీవితాలకు అన్వయించి వారి జీవితాలను సుఖమయం చేస్తోంది. తనతోపాటు వేలమంది మహిళలను చేర్చుకుని ఎంతో మందికి చేయూతనిస్తోంది. మధురైలో పుట్టిపెరిగిన శుభా పాండియన్ పెళ్లయ్యాక చెన్నై వచ్చింది. బీకామ్ చదివిన శుభా చెన్నై నగరంలో ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టింది. ఇంగ్లిష్ రాదు. ఎటువంటి ఉద్యోగానుభవం లేదు. కానీ ఎలాగైనా ఎదగాలన్న తపన ఉంది. చెన్నై వచ్చిన ఏడాదిలోపే భర్త మరణం శుభాను రోడ్డున పడేసింది. పసిగుడ్డును పోషించుకునే భారం తనమీదే పడడంతో కష్టం మీద చిన్న ఉద్యోగం వెతుక్కుంది. ఒంటరి తల్లిగా అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటోన్న శుభాకు తోటి మహిళా ఉద్యోగులు అండగా నిలబడి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. దీంతో కార్పొరేట్ సెక్టార్లో తనకంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకుని ఉద్యోగిగా నిలదొక్కుకుంది. ఆగ్వా... అనేక సమస్యలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న శుభకు తోటి మహిళలు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రేరణ ఇచ్చింది. ఈ ప్రేరణతోనే తనలాగా ఒంటరిగా బాధపడుతోన్న ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చేందుకు కొంతమంది మహిళల సాయంతో 2008లో ‘ఆగ్వా’ పేరిట నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. సాయంకోసం ఎదురు చూస్తున్న వారికి సాయమందిస్తూ, వారిని మానసికంగా దృఢపరిచి, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఇప్పించి నిస్సహాయ మహిళలకు అండగా నిలబడింది. గృహహింసా బాధితులను ఆదుకోవడం, ‘క్యాంపస్ టు కార్పొరేట్’ పేరిట ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించేందుకు మెళకువలు నేర్పించడం, అల్పాదాయ మహిళలను ఒకచోటకు చేర్చి వారితో చిన్నచిన్న వ్యాపారాలు చేయించడం, కుట్టుమిషన్లు, వెట్గ్రైండర్స్ ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడడం, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించడం, టైలరింగ్, పేపర్ బ్యాగ్‌ల తయారీ వంటి వాటిద్వారా ఆగ్వా ప్రారంభించిన ఐదేళ్లల్లో్లనే ఎనిమిదివేలకుపైగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు చేయూతనిచ్చింది. కేవలం పన్నెండు మందితో ప్రారంభమైన ఆగ్వా క్రమంగా పెరుగుతూ నేడు తొమ్మిదివేల మందికి పైగా మహిళలతో పెద్దనెట్వర్క్గా విస్తరించింది. మహిళాసాధికారత.. గిఫ్టింగ్ స్మైల్స్ ఆగ్వా నెట్వర్క్ 2016 నుంచి ఇప్పటిదాకా కష్టాలలో ఉన్న మహిళలకు మానసిక బలాన్నిచ్చి వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు 31 కాన్ఫరెన్స్‌లు, 270 ఉచిత వెబినార్లు నిర్వహించి ఇరవై ఏడు వేలమంది మహిళలకు పరోక్షంగా దారి చూపింది. ఇవేగాక ఫుడ్ బ్యాంక్‌లకు ఆహారం అందించడం, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల ఆటవస్తువులు, పుస్తకాలు, స్వీట్లు, కలర్ బాక్స్‌లు, షూస్, విరాళాలు సేకరించి చెన్నై వ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలకు అందించింది. ప్రారంభంలో మహిళాభ్యున్నతికోసం ఏర్పాటైన ఈ నెట్వర్క్ నేడు దేశవ్యాప్తంగా ఉన్న వందలమంది వలంటీర్లు, సామాజిక వేత్తలతో కలసి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కెరీర్లో ఎదుగుతూనే... శుభా తన కెరీర్లో ఎదుగుతూనే ఆగ్వాను సమర్థంగా నడిపించడం విశేషం. బహుళ జాతి కంపెనీలైన.. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్ఎస్, డియా సెల్యూలార్ వంటి పెద్ద కంపెనీలలో ఉన్నతస్థాయి పదవుల్లో పనిచేసింది. ఈ అనుభవంతో మరింత మందిని కార్పొరేట్ కెరీర్లో ఎదిగేందుకు ప్రొఫెషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌లు నిర్వహించి, ఎంతో మందిని కార్పొరేట్ వృత్తినిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో మహిళలేగాక, దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఏదైనా సాధించగలవు ఈ ప్రకృతిలో నీటికి చాలా శక్తి ఉంది. మహిళ కూడా నీరులాంటిది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుని తన శక్తిని పుంజుకుంటుంది. అందుకే స్పానిష్ పదం ఆగ్వా అనే పేరును నా నెట్వర్క్కి పెట్టాను. మా నెట్ వర్క్‌లో 25 నుంచి 73 ఏళ్ల వయసు మహిళలంతా కలిసి పనిచేస్తున్నాం. వివిధ వృత్తి వ్యాపారాల్లో రాణిస్తోన్న వీరంతా నెట్‌వర్క్‌లో పనిచేస్తూ ఎంతో మందికి సాయం అదిస్తున్నారు. ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, అగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మా నెట్‌వర్క్‌ను విస్తరించాం. మనకుంది ఒకటే జీవితం. దానిని పూర్తిగా జీవించాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనేది అనవసరం. నీ కథను నువ్వే రాసుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ జీవితానికి నువ్వే హీరోయి¯Œ వని ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పుడే ఏదైనా సాధించగలవు. – శుభా పాండియన్ -
చెన్నై.. భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే..
సాక్షి, చెన్నై: చెన్నై పురసైవాక్కంలో తాళం వేసి న ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న భర్త మృతదేహంతో భార్య రెండు రోజులు గడిపిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. చెన్నై పురసైవాక్కం వైకోకారన్ వీధికి చెందిన అశోక్‌బాబు (53). ఇతను ఆంబూరులోని లెదర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య పద్మిని (48), కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమై చెన్నై నుంగంబాక్కంలో ఉంటోంది. కుమారుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు. కాగా పద్మిని 2011 నుంచి మానసిక రుగ్మతకు చికిత్స పొందినట్లు తెలిసింది. భర్త అశోక్‌బాబు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అశోక్‌బాబు కుమారుడు ఈనెల 22న ఇంటికి ఫోన్ చేయగా ఎవరూతీలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూశాడు. లోపల తలుపు వేసి ఉండడంతో వేప్పేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అశోక్‌బాబు మృతి చెంది కుళ్లిన స్థితిలో పడి ఉన్నాడు. అతని పక్కనే పద్మిని కూర్చొని ఉంది. పోలీసులు అశోక్‌బాబు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. -
దంపతుల పరస్పర దాడి భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
పాలకోడేరు(ఉండి): దంపతుల మధ్య మాటామాటా పెరిగి పట్టరాని ఆవేశంతో ఒకరినొకరు కొట్టుకోవడంతో భర్త మృతి చెందగా.. భార్య ఆస్పత్రి పాలై మృత్యువుతో పోరాడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొల్లలకోడేరు సంజనా అపార్ట్మెంట్లోని సివికా ఫ్లాట్–311లో కనుమూరి విజయరామరాజు (80), సరళాదేవి (70) కాపురం ఉంటున్నారు. వీరిద్దరిదీ ద్వితీయ వివాహమే. తరచూ ప్రతి విషయానికీ కీచులాడుకునేవారు. సోమవారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బంధువుల ఇంటికి పెళ్లిళ్లకు వెళ్లి నెల రోజులు ఉండి వస్తానని భార్య అంటే.. తాను కుమారుడి ఇంటికి వెళ్తానని భర్త అన్నాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగింది. దీంతో పచ్చడి చేసుకునే పొత్రంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపటికి భర్త మృతి చెందగా, భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదే అపార్ట్మెంట్లోని 411 ఫ్లాట్‌లో ఉంటున్న సమీప బంధువు సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రాణాలతో ఉన్న సరళాదేవిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం: బకెట్‌తో భర్తను చంపిన భార్య
పద్మనాభం(భీమిలి): తాళికట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలే అతన్ని తిరిగిరాని లోకాలకు పంపించేశారు. పద్మనాభం మండలంలోని కృష్ణాపురం రెల్లికాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ విశ్వేశ్వరరావు తెలిపిన వివరాలివి. రెల్లి కాలనీకి చెందిన పల్లా కనకరాజు(40)కు విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన పైడమ్మతో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కృష్ణాపురంలోని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య పైడమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కనకరాజు గతంలో ఆమెను నిలదీశాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. కనకరాజు మామ సోమాదులు సోములు, అత్త పాపయ్యమ్మ, బావమరిది కంచయ్య, బావమరిది భార్య లక్ష్మి ఈ నెల ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కనకరాజు ఇంటికి వచ్చారు. భార్యతో సహా వీరందరూ కనకరాజు తలపై బకెట్‌తో దారుణంగా కొట్టారు. ఎవరికి చెప్పకుండా అందరూ తిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో అతని తల్లి లక్ష్మి ఇంటికి వచ్చి చూస్తే.. తల, పెదవుల మీద గాయాలతో కనకరాజు మంచం మీద పడి ఉండడం చూసి షాక్‌కు గురైంది. ఏం జరిగిందని అతన్ని అడగ్గా.. జరిగిన విషయం చెప్పారు. వెంటనే ఆమె విజయనగరం మహారాజా ఆస్పత్రిలో కనకరాజును చేర్పించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జాము నాలుగు గంటల సమయంలో అతను మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని భార్యతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. చదవండి: రూ.100 కోసం హత్య: తొమ్మిది మంది అరెస్ట్ -
నువ్వులేని జీవితం నాకెందుకని..
నాలుగు నెలల క్రితమే వివాహమైన ఆ దంపతులకు ఒకరంటే మరొకరికి ప్రాణం. మమతానురాగాలే తెరచాపగా..ఆప్యాయతే ఆలంబనగా.. సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మానాన్నలం కాబోతున్నామన్న శుభవార్త వారిలో అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. అయితే విధికి కన్నుకుట్టింది. కడుపునొప్పి రూపంలో భార్యను మృత్యువు కాటేసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన భర్త కూడా నీవులేని జీవితం నాకెందుకంటూ ప్రాణం తీసుకున్నాడు. గుర్తు తెలియని వాహనం కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఇచ్ఛాపురం మండలంలోని కొఠారీ గ్రామంలో చోటుచేసుకుంది. సాక్షి, ఇచ్ఛాపురం: కొఠారీ గ్రామానికి చెందిన బుడ్డేపు రామారావు, పార్వతిల ఒక్కగానొక్క కొడుకు రాజేష్ (చూడామణి) (28). ఈయన విదేశాల్లో కూలీగా పని చేస్తుండేవాడు. కోవిడ్ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చేశాడు. ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడకు చెందిన జయ(26)తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ప్రస్తుతం జయ గర్భిణి. అయితే ఆమెకు ఆదివారం సాయంత్రం కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కడుపు నొప్పి తీవ్రం కావడంతో వైద్యుల సూచనల మేరకు హుటాహుటీన బరంపురం పెద్దాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో జయ కన్నుమూసింది. మృతదేహాన్ని కొఠారీ గ్రామానికి సోమవారం తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త రాజేష్ జీర్ణించుకోలేకపోయాడు. మంగళవారం ఉదయం ఈదుపురంలో టిఫిన్ చేస్తానంటూ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఇచ్ఛాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు, ఇచ్ఛాపురం–ఈదుపురం క్రాస్ రోడ్డు పక్కనే తన వాహనాన్ని ఉంచి డివైడర్‌పై కూర్చొని వేదనకు గురయ్యాడు. బరంపురం నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. -
పిల్లలను కాపాడబోయి..
కోరుట్ల/కోరుట్ల టౌన్: చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడేందుకు భార్యాభర్తలు చేసిన ప్రయత్నంలో.. భార్య ఆస్పత్రి పాలుకాగా.. భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగింది. కోరుట్లలోని బీమునిదుబ్బకు గుంటుక వీరకుమార్(45) భార్య జ్యోతితో కలసి శనివారం సాయంత్రం అయిలాపూర్‌లోని అత్తగారింటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోరుట్ల రైల్వే స్టేషన్ సమీపంలోని కుంటలో ఇద్దరు బాలురు మునిగిపోతుండగా, గమనించాడు. వీరకుమార్ తనకు ఈతరాకున్నా.. పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో కుంటలోకి దిగి.. మునిగిపోయాడు. ఆందోళన చెందిన జ్యోతి భర్తను కాపాడేందుకు చీర వేసి.. ఆమెకూడా కుంటలోకి జారిపోయింది. అటుగా వెళ్తున్న యువకులు సుదవేని మహేశ్, బోరే శ్యాం మరికొందరి వెంటనే చెరువులో దిగి మునిగిపోతున్న పిల్లలను బయటకి తీశారు. జ్యోతిని సైతం కాపాడారు. అంతలోపే వీరకుమార్ నీళ్లలో మునిగి మృతి చెందాడు. పదేళ్లుగా సౌదీ వెళ్లి వస్తున్న వీరకుమార్ ఈ నెల 10న తిరిగివెళ్లాల్సి ఉంది. ఆయనకు కూతురు ధరణి(17), కుమారుడు వినయ్(14) ఉన్నారు. -
కారు-బైక్ ఢీకొని ఒకరి మృతి
భర్త దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు జనగామ రూరల్ : ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను కారు ఢీ కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా..భార్యకు తీవ్రగాయాలైన ఘటన జనగామ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి..కరిమికొండ సత్యనారాయణ-నాగలక్ష్మి దంపతులది రఘునాథపల్లి. సత్యనారాయణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా, నాగలక్ష్మి బీడీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బీడీలను కార్ఖానాలో ఇచ్చేందుకు దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వస్తూ పెట్రోల్ బంక్ వద్ద క్రాస్ అవుతుండగా..వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యనారాయణ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. సత్యనారాయణ భవన కార్మిక సంఘం మండలాధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.