Chennai: Woman Found Living With Husband Dead Body For Two Days - Sakshi
Sakshi News home page

చెన్నై.. భర్త మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే.. 

May 25 2022 3:53 PM | Updated on May 25 2022 6:37 PM

Chennai: Woman Found Living With Husband Dead Body For Two Days - Sakshi

సాక్షి, చెన్నై: చెన్నై పురసైవాక్కంలో తాళం వేసి న ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న భర్త మృతదేహంతో భార్య రెండు రోజులు గడిపిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. చెన్నై పురసైవాక్కం వైకోకారన్‌ వీధికి చెందిన అశోక్‌బాబు (53). ఇతను ఆంబూరులోని లెదర్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య పద్మిని (48), కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమై చెన్నై నుంగంబాక్కంలో ఉంటోంది. కుమారుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు. కాగా పద్మిని 2011 నుంచి మానసిక రుగ్మతకు చికిత్స పొందినట్లు తెలిసింది. భర్త అశోక్‌బాబు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

అశోక్‌బాబు కుమారుడు ఈనెల 22న ఇంటికి ఫోన్‌ చేయగా ఎవరూతీలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూశాడు. లోపల తలుపు వేసి ఉండడంతో వేప్పేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అశోక్‌బాబు మృతి చెంది కుళ్లిన స్థితిలో పడి ఉన్నాడు. అతని పక్కనే పద్మిని కూర్చొని ఉంది. పోలీసులు అశోక్‌బాబు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement