- భర్త దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు
కారు-బైక్ ఢీకొని ఒకరి మృతి
Published Fri, Sep 16 2016 1:05 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
జనగామ రూరల్ : ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను కారు ఢీ కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా..భార్యకు తీవ్రగాయాలైన ఘటన జనగామ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి..కరిమికొండ సత్యనారాయణ-నాగలక్ష్మి దంపతులది రఘునాథపల్లి. సత్యనారాయణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా, నాగలక్ష్మి బీడీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
బీడీలను కార్ఖానాలో ఇచ్చేందుకు దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వస్తూ పెట్రోల్ బంక్ వద్ద క్రాస్ అవుతుండగా..వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యనారాయణ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. సత్యనారాయణ భవన కార్మిక సంఘం మండలాధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement