
'టీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి తెచ్చారు'
హైదరాబాద్ సిటీ: టీఆర్‌ఎస్‌లో చేరాలని తమపై కొందరు ఒత్తిడిచేశారని టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వివేకానంద్ లు బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్యేలు విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఒత్తిడి తెచ్చారని, పార్టీలోకి వస్తే కార్పొరేషన్ పదవి ఇస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని ఆశచూపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన కొన్ని రోజులకు ఈ కేసులు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు గుర్తుకు రానిది ఓటుకు నోటు కుంభకోణం బయటపడిన తర్వాతే టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఓటుకు నోటు కేసు మరో మలుపు చోటుచేసుకుంది.