rajendarreddy
-
జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. గురువారం స్థానిక టీఎన్జీఓ భవన్లో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ కళాభవన్‌లో జోనల్వ్యవస్థ రద్దుతోపాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలపై జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు రామకష్ణరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు సనాతనబాల్స్వామి, కష్ణమోహన్, శ్రీనివాస్‌గౌడ్, రాఘవేందర్, జహీర్, ప్రవీణ్, రవిప్రకాష్, రమేష్‌నాయక్, పాండురంగ, జానేశ్వర్ పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు'
హైదరాబాద్ సిటీ: టీఆర్ఎస్లో చేరాలని తమపై కొందరు ఒత్తిడిచేశారని టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వివేకానంద్ లు బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్యేలు విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి రావాలని ఒత్తిడి తెచ్చారని, పార్టీలోకి వస్తే కార్పొరేషన్ పదవి ఇస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని ఆశచూపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన కొన్ని రోజులకు ఈ కేసులు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు గుర్తుకు రానిది ఓటుకు నోటు కుంభకోణం బయటపడిన తర్వాతే టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఓటుకు నోటు కేసు మరో మలుపు చోటుచేసుకుంది.