జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలి | Delete Zonal System | Sakshi
Sakshi News home page

జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలి

Published Thu, Aug 25 2016 10:53 PM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు - Sakshi

జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని టీజేఏసీ జిల్లా చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. గురువారం స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. టీఎన్‌జీఓ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్‌ కళాభవన్‌లో జోనల్‌వ్యవస్థ రద్దుతోపాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంలపై జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షుడు రామకష్ణరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు సనాతనబాల్‌స్వామి, కష్ణమోహన్, శ్రీనివాస్‌గౌడ్, రాఘవేందర్, జహీర్, ప్రవీణ్, రవిప్రకాష్, రమేష్‌నాయక్, పాండురంగ, జానేశ్వర్‌ పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement