'రూ.3,400 కోట్లు నిధులు అవసరం'
హైదరాబాద్: పోలీసుల గృహనిర్మాణశాఖపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమీక్షా సమావేశం నిర్వహించారు. విభజన తర్వాత పోలీసుల గృహనిర్మాణం కోసం 3,400 కోట్ల రూపాయల నిధులు అవసరమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
గృహ నిర్మాణాలకు పరిపాలన అనుమతి డీజీ పీకే ఇవ్వాలన్న దానిపై సమావేశంలో సమాలోచనలు జరిపినట్టు వెల్లడించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని రాజప్ప అంతకుముందు అన్నారు.