ఆనంద్ కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం | Government help to SI anand kumar family, says nimmakayala chinarajappa | Sakshi
Sakshi News home page

ఆనంద్ కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం

Published Wed, Jun 24 2015 10:20 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

Government help to SI anand kumar family, says nimmakayala chinarajappa

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏడీబీ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరంగి ఎస్ఐ ఆనంద్ కుమార్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మృతుని కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా మంగళవారం రాత్రి ఆనంద్ కుమార్  డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా... వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ.. బైక్‌ను ఢీకొట్టింది.

 

ఈ ఘటనలో ఎస్ఐ ఆనంద్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆనంద్‌ కుమార్‌.... తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం కోరంగిలో ఎస్ఐగా పని చేస్తున్నారు. ఆయనకు తొమ్మిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement