రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి | korangi si dies in road accident in kakinada | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

Jun 24 2015 6:07 AM | Updated on Sep 2 2018 3:46 PM

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

విధులు ముగించుకొని తిరుగుపయనమైన ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటాక జిల్లాలోని కాకినాడ సమీపంలోని అచ్చంపేట వద్ద చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి: విధులు ముగించుకొని తిరుగుపయనమైన ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటాక జిల్లాలోని కాకినాడ సమీపంలోని అచ్చంపేట వద్ద చోటుచేసుకుంది. వివరాలు..కోరంగి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్‌కుమార్ మంగళవారం అర్ధరాత్రి డ్యూటి ముగించుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో అచ్చంపేట జంక్షన్ వద్ద వెనక నుంచి వచ్చిన లారీ ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement