ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు | Bullock cart competitions at East Godavari district | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు

Published Sun, Apr 19 2015 5:43 PM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM

ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు - Sakshi

ఉత్సాహంగా ఎడ్లబండి పరుగు పోటీలు

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామంలో ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆసక్తికరంగా సాగాయి.

రాజమండ్రి(సామర్లకోట): తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామంలో ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు ఆసక్తికరంగా సాగాయి. తూర్పు గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి మూడు బహుమతులను తూర్పు గోదావరి జిల్లా ఎద్దులే కైవసం చేసుకోవడం విశేషం.

పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరుకు చెందిన చుండ్రు సత్యనారాయణ ఎడ్లు 4 నిమిషాల 10 సెకెన్ల 31 పాయింట్లలోను, కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన తుమ్మల మణికంఠ ఎడ్లు 4 నిమిషాల 10 సెకెన్ల 47 పాయింట్లతోను, సామర్లకోట మండలం కాపవరం గ్రామానికి చెందిన కుంచం మనోజ్ ఎడ్లు 4 నిమిషాల 16 సెకెన్ల 40 పాయింట్లతోను వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement