శివబాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు
తూర్పుగోదావరి, పెద్దాపురం: ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో భారీ షాక్ తగిలింది. మాజీ సర్పంచి దాసు శివబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో గురువారం రాత్రి పార్టీలో చేరారు. టీడీపీకి ఏకవర్గంగా ఉండే ఈ గ్రామంలో ఒక్కసారి సర్పంచి, బూత్ కమిటీ, పార్టీ కమిటీ నాయకులు వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు ఆకుల వీరబాబు, గళ్లా శ్రీను ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. శివబాబుతోపాటు టీడీపీ గ్రామ బూత్ కమిటీ కన్వీనర్ మదిరెడ్డి చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచి అరవ సత్తిబాబు, గ్రామ కమిటీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు పోకల శివ రామకృష్ణ, ఆకాశపు ప్రసాద్, అడబాల దొరబాబు, జున్ను సుబ్రహ్మణ్యం, అడబాల వెంకట్రావు, జున్ను రాంబాబు సహ సుమారు 200 మందికి కో–ఆర్డినేటర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. పార్టీకి లభిస్తున్న ఆదరణను చూడలేక సీఎం చంద్రబాబు అబద్దపు హామీలతో తిరిగి గద్దె ఎక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
పార్టీలో చేరిన శివబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజల నుంచి వచ్చినా స్పందనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, గోపు నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి భద్రం, బంగారుకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శులు యినకొండ వీర విష్ణుచక్రం, ఆదపురెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ విజయానికి ప్రతిక్క కార్యకర్త కృషిచేయాలని కోరారు. తొలుత దేవాలయాల్లో పూజలు చేసి బహిరంగ సభ వద్ద హిందూ, క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించి వారు పార్టీలో చేరారు. కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, గోలి దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు గవరసాని సూరిబాబు, యూత్ అధ్యక్షుడు గోపు మురళి, నల్లల నాగేంద్రబాబు, కొప్పిరెడ్డి రాధాకృష్ణ, తోట అప్పారావు, రెడ్డి లక్ష్మి, కామన రామకృష్ణ.,పల్లా గంగారావు, జోకా సతీష్ తదితరులు
పాల్గొన్నారు.
దాకోడులో 100 కుటుంబాలు..
అడ్డతీగల (రంపచోడవరం): అడ్డతీగల మండలం దాకోడు పంచాయితీలోని తిరుమలవాడ, జాజిపాలెం, దాకోడు, బందమామిళ్లు, ఎం.భీమవరం గ్రామాల నుంచి పలు పార్టీలకు చెందిన 100 కుటుంబాలకు చెందిన గిరిజనులు వైఎస్సార్ సీపీలో చేరారు. దాకోడు పంచాయతీలో గురువారం నిర్వహించిన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరిన వారిని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వివిధ పార్టీల్లో ముఖ్య నేతలు పల్లాల గోపాలకృష్ణారెడ్డి, పల్లాల రామిరెడ్డి, పల్లాల రవిరాజశేఖరరెడ్డి, వంతల ప్రసాద్ ఆధ్వర్యంలో మొల్ల ప్రేమ్‌కుమార్, ఒండ్లోపు పెద్దబ్బాయి, పొడుగు పండయ్య, చెదల అశోక్, సడ్డా సోమరాజు, శిరిసిం దుర్గబాబు, సడ్డా మల్లేశ్వర్రావు, జర్తా చిన్నబ్బాయి, చలుమర్తి సోమరాజు, కలింకోట శ్రీను సహ 100 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో భాగస్వాములవుతున్న ఇతర పార్టీల నేతల సంఖ్య పెరుగుతోందన్నారు. పార్టీ రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సర్కారుని అధికారం నుంచి సాగనంపడానికి ప్రజలందరూ కార్యోన్ముఖులై ముందుకు వస్తున్నారని అన్నారు.
కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు..
కాకినాడ రూరల్: చంద్రబాబు పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. రమణయ్యపేట పాత గైగోలుపాడు 49వ డివిజన్ సోమాలమ్మ గుడి వద్ద ఆయన సమక్షంలో చింతపల్లి శ్రీను, పాలిక నర్శింహమూర్తి, పాలిక వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ‘రావాలి జగన్ – కావాలి కన్నబాబు’నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలిక వీరభద్రరావు, సీహెచ్ అవినాష్, సమ్మంగి రామకృష్ణ, పి.నాని, నున్న సాయి, సీహెచ్ దినేష్, గుత్తుల అన్నవరం, అనసూరి సత్తెమ్మ, వి.పద్మ, వి.సుజాతలకు కన్నబాబు పార్టీ కండువాలు ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, కాకినాడ రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, కోరాడ దుర్గాప్రసాద్, సూరాడ రాజు, వడ్డి మణికుమార్, గుబ్బల విజయ్, పాలిక ప్రకాష్, చిలుకూరి సుజాత, మేడిశెట్టి లక్ష్మి, కర్రి చక్రధర్, కొత్తా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment