హైదరాబాద్ : శ్రీహరికోటలోని షార్ కేంద్రం భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఎన్. చినరాజప్ప వెల్లడించారు. శనివారం విజయవాడలో చినరాజప్ప తీరప్రాంత భద్రతపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ... తీర ప్రాంతంలోని మెరైన్ పోలీసులు పని చేసే పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు.
తీరప్రాంత భద్రతను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని చినరాజప్ప హెచ్చరించారు. తీరప్రాంతంలో జరిగే ఘటనలకు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని చినరాజప్ప తెలిపారు.