
సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన లోకేశ్
విజయవాడ: టీడీపీ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆయన దిగొచ్చారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను అవమానించేలా ఉన్న ఫొటోను లోకేశ్ ఫోస్బుక్ నుంచి తొలగించారు.
టీడీపీ శిక్షణ తరగతుల్లో లోకేశ్ ముందు చినరాజప్ప నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో బయటకురావడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వయసులో, అనుభవంలో తనకంటే పెద్దలైన వారికి లోకేశ్ ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడటం, నిలదీసినట్లు ప్రశ్నించడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. పెద్దలను గౌరవించడం లోకేశ్ నేర్చుకోవాలంటూ కామెంట్ చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో లోకేశ్ ఈ ఫొటోను ఫేస్బుక్ నుంచి తొలగించారు.