
సాక్షి, ఏలూరు: బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీల కలయికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ పార్టీ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ అన్యాయం చేయడం వల్లే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఎవరో ఒకరి సహకారం ఉండాలంటూ పాతపాటే పాడారు. బీజేపీ చేసినట్టు కాంగ్రెస్ కూడా మోసం చేస్తే అంటూ విలేకరులు ప్రశ్నించగా.. దానికి మంత్రి సమాధానం దాటవేశారు.
రాష్ట్రంలో 3137 పోలీసు పోస్టులు భర్తీ చేయనున్నట్టు చినరాజప్ప తెలిపారు. అదే విధంగా చినరాజప్ప జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందని అనడంలో అర్ధం లేదన్నారు. పవన్ లేకుండానే స్థానిక సంస్థల్లో విజయం సాధించామంటూ చెపుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment