AP Political News And Election News March 29th Telugu Updates
9:30 PM, March 29th 2024
నెల్లూరు:
వింజమూర్‌లో జరిగిన చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు
- టికెట్ రాలేదని గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు
- ఉదయగిరి నియోజకవర్గ కూటమి నాయకులకు వేదికపై దక్కని చోటు
9:00 PM, March 29th 2024
అనంతపురం:
కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ
- టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు
- ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి
- టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు
8:50 PM, March 29th 2024
తాడేపల్లి :
చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ ఫైర్
- వైఎస్సార్‌సీపీలో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం
- అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు?
వైయస్ఆర్సీపీ లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024
అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు?#MemanthaSiddham pic.twitter.com/dSxGLtAe9Z
5:50 PM, March 29th 2024
ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్
- నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది
- ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది
- వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది
- మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది
- జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం
- మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
- పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\
- నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను..
- ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా
- ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను
- నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను
- అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను.
- ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా
- మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా
4:50 PM, March 29th 2024
విజయవాడ:
టీడీపీపై X లో ఘాటైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పోతిన మహేష్
- టీడీపీ నాయకులు జనసేన పార్టీ మీద పెట్టిన శ్రద్ధలో సగం టీడీపీ మీద పెట్టుండాల్సింది
- అలా చేసుంటే టీడీపీ నాయకులను సెంట్రల్ నియోజకవర్గంలో కాపాడుకోవచ్చు
- జనసేనలో చీలికలు తెచ్చే పనులుమాని మీ పార్టీని బలపర్చుకోండంటూ చురకలు
- పొత్తు ధర్మం మాకే కాదు, మీకు కూడా వర్తిస్తుందంటూ పోస్టు పెట్టిన పోతిన మహేష్
4:29 PM, March 29th 2024
అనంతపురం:
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టిక్కెట్ ఇవ్వడంపై ఆగ్రహం
- గుంతకల్లు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల నిరసన
- చంద్రబాబు ఫ్లెక్సీలు దహనం చేసిన టీడీపీ నేతలు
- టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
4:15 PM, March 29th 2024
విజయవాడ:
సీటు దక్కకపోవడంతో విజయవాడ వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ ఆవేదన
- పోరాడి పోరాడి కన్నీరు కూడా రావడం లేదు
- నా బాధను క్రీస్తు శిలువకు చెప్పుకున్నా
- సీటు కోసం పోరాడినా అవకాశం రాలేదు
- ప్రతి రోజూ పరీక్ష అంటే ఎలా అంటూ ఉద్వేగానికి లోనైన పోతిన మహేష్
4:01 PM, March 29th 2024
నెల్లూరు:
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చిన కావలి జనం
- బహిరంగ సభకు జనాలు లేకపోవడంతో సుమారు గంటలు పాటు హెలిపాడ్ దగ్గరే ఉండిపోయిన చంద్రబాబు
- జనాలను సమీకరించడంలో టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విఫలమయ్యారంటూ చంద్రబాబు ఆగ్రహం
- రెండు గంటల 50 నిమిషాలకే ప్రత్యేక హెలికాప్టర్లో కావలి జడ్పీ గ్రౌండ్ లో దిగిన చంద్రబాబు
- నాలుగు గంటలకి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉన్నా కూడా.. జనాలు రాకపోవడంతో గ్రౌండ్ లోనే ఉన్న బాబు
- టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఓవరాక్షన్ కారణంగానే ఇలా జరిగిందని తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
- కావ్య కృష్ణారెడ్డి నియంతృత్వ పోకడల వల్ల కావలిలో పార్టీ నాశనం అయిందని చంద్రబాబుకు నేతల ఫిర్యాదు
3:59 PM, March 29th 2024
అనంతపురం:
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మనస్తాపం
- అనంతపురం అర్బన్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ప్రభాకర్ చౌదరి
- చంద్రబాబు తీరును తప్పుబట్టిన టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి
- టీడీపీ లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదా?
- టీడీపీ ఓ లిమిటెడ్ కంపెనీలా మారిపోయింది
- చంద్రబాబు ను కలవాల్సిన అవసరం నాకు లేదు
- చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం
- ఏ సర్వే ఆధారంగా అనంతపురం టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి
- కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా
3:50 PM, March 29th 2024
ప్రకాశం జిల్లా:
గిద్దలూరు నియోజకవర్గంలో మరోసారి ఎగిరేది వైఎస్సార్‌సీపీ జెండానే:
వైఎస్సార్‌సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
- సంక్షేమం,అభివృద్ధితో మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్న ప్రజలు
- సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసుకుందాం
- సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు
- సీఎం జగన్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఒంగోలు పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం
- కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్
3:20 PM, March 29th 2024
అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
- దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర అసంతృప్తి
- ఫ్లెక్సీలు తగలబెట్టిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు
- టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం
3:15 PM, March 29th 2024
అంబేద్కర్ కోనసీమ
జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై
- జనసేన పార్టీ, పదవికి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ
- ఈ నెల 30న(రేపు) సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్న పితాని బాలకృష్ణ
3:03 PM, March 29th 2024
తాడేపల్లి :
అవ్వాతాతల అప్యాయతపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
- అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది
- అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది
అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024
2:25 PM, March 29th 2024
బీసీలకు చంద్రబాబు హ్యాండ్
- బీసీలకు చంద్రబాబు ఊచకోత
- లోక్‌సభ సీట్లలో బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు
- టీడీపీ కూటమిలో 25లో కేవలం ఆరు సీట్లు మాత్రమే బీసీలకు...
- 20 అన్‌రిజర్వ్ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన వైఎస్సార్‌సీసీ
2:13 PM, March 29th 2024
పెండింగ్ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు
- నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు
- అభ్యర్థుల్ని ఖరారు చేసి జాబితా విడుదల చేసిన చంద్రబాబు
- జాబితా విడుదల చేసిన టీడీపీ
- పంతం నెగ్గించుకున్న గంటా శ్రీనివాస్.. భీమిలి సీటు గంటాకే
- మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు
- జయరాం టికెట్‌పై మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తీవ్ర అభ్యంతరాలు
- జయరాంకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళనలు, నిరసనలు పట్టించుకోని చంద్రబాబు
- అనంత సీనియర్ నేత ప్రభాకరచౌదరికి నిరాశ
- జేసీ కుటుంబం నుంచి ఈసారి ఒక్కరికే సీటు
- జేసీ వారసుడు పవన్‌కుమార్‌కూ నిరాశే
- తాపడిత్రి నుంచి అస్మిత్‌రెడ్డికి ఛాన్స్
1:45 PM, March 29th 2024
తారాస్థాయికి చేరిన టీడీపీ అసమ్మతి సెగలు
- తిరుపతి సత్యవేడు నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు
- కోనేటి ఆదిమూలం కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు సమావేశం
- ఎన్.ఆర్. ఐ రమేష్ నాయుడు నేతృత్వంలో తిరుపతి రాజ్ పార్క్ హోటల్ లో సత్యవేడు టిడిపి అసమ్మతి నేతలు సమావేశం
- నారాయణ వనం, పిచ్చాటురు, కే.వి.బి.పురం, బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాలెం, సత్యవేడు, నాగల పురం మండలాలుకు చెందిన టీడీపీ నేతలు ,ముఖ్య నాయకులు హాజరు
1:23 PM, March 29th 2024
కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
- కోడమూరు, వేముగోడు, సార్ గోనెగండ్ల మీదుగా సాగనున్న యాత్ర
- సాయంత్రం ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగ సభ
12:54 PM, March 29th 2024
ఆసక్తికరంగా ధర్మవరం రాజకీయం
- పొత్తులో భాగంగా బీజేపీ సత్యకుమార్‌కు సీటు కేటాయింపు
- మండిపడుతున్న టీడీపీ జనసేన శ్రేణులు
- బీజేపీ అభ్యర్థికి సహకరించబోమంటూ ప్రకటనలు
- ఇరు వర్గాల నేతలను పిలిపించుకుని మాట్లాడనున్న టీడీపీ-జనసేన అధినేతలు
12:43 PM, March 29th 2024
నూకసాని వ్యాఖ్యలతో ప్రకాశం టీడీపీలో అలజడి
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ సంచలన వ్యాఖ్యలు
- జిల్లా టీడీపీలో కొందరు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు
- రెండు మూడు రోజుల్లో అలాంటి నేతలకు గట్టి సమాధానం చెబుతా..
- పరోక్షంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు , ఒంగోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై వ్యాఖ్యలు
- గత కొద్దిరోజులుగా దామచర్ల జనార్దన్ కి నూకసాని బాలాజీ కి మధ్య విబేధాలు
- జిల్లా టీడీపీ అధ్యక్షుడు గా తనకు గౌరవం ఇవ్వలేదని నూకసాని బాలాజీ గుర్రు
- బీసీ కోటాలో ఒంగోలు ఎంపీ సీటు ఆశించిన నూకసాని
- నూకసానికి మొండి చేయి చూపించిన చంద్రబాబు
- ఆవిర్భావ దినోత్సవం రోజునే జిల్లా పార్టీ అధ్యక్షుడు వ్యాఖ్యలు పై జిల్లా లో తీవ్ర చర్చ
12:12 PM, March 29th 2024
దేవినేని ఉమను బుజ్జగిస్తున్న చంద్రబాబు
- టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరణ
- మైలవరం టికెట్ వలస నేత వసంత కృష్ణకు కేటాయించడంతో దేవినేని నిరాశ
- పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని దేవినేని ఉమకు చెప్పిన చంద్రబాబు
- దేవినేని ఉమకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు సమన్వయ బాధ్యతలు ఇస్తానని చల్లబర్చే యత్నం
11:30 AM, March 29th 2024
ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం
- సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే
- సీటు కేటాయించి నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన
- విజయ్ కుమార్ యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం
- మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం
- తర్వాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు
- సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్
- చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తి
- అనుచరులతో సమావేశం
- భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ
11:15 AM, March 29th 2024
అమరావతి:
పెండింగ్ సీట్లలో అభ్యర్ధుల ఖరారుపై తేల్చుకోలేకపోతున్న జనసేన
- 3 అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటుపై ఇంకా రాని స్పష్టత
- డైలమాలోనే బందరు పార్లమెంటు సీటు
- మరింత సమర్ధవంతమైన అభ్యర్ధుల కోసం పవన్ సెర్చ్ ఆపరేషన్
- అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్ధుల కోసం జనసేన గాలింపు
11:00 AM, March 29th 2024
కృష్ణా జిల్లా గన్నవరంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు
- టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతల ఆవేదన
- పవన్ చెప్పడంతో టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నాం
- టీడీపీకి బానిసత్వం చేయడానికి మేం సిద్ధంగా లేం: గన్నవరం జనసేన ఇన్ ఛార్జ్ చలమలశెట్టి రమేష్ బాబు
10:45 AM, March 29th 2024
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీలో బయటపడ్డ వర్గపోరు
- పార్టీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య పై అసమ్మతి నేతల ఫైర్
- కమ్మ సామాజికవర్గ నేతలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
- -స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిక
10:34 AM, March 29th 2024
జనసేన సీటు.. అయినా పవన్ ప్రచారానికి దూరం?!
- ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం
- సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే
- సీటు కేటాయించి సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన
- విజయ్ కుమార్ ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం
- మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం
- తరువాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు
- సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్
- చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పి వి ఎస్ ఎన్ రాజు అసంతృప్తి
- అనుచరులతో రహస్యంగా సమావేశం
- భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ
10:00 AM, March 29th 2024
మూడో రోజు సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్ యాత్ర పెంచికలపాడు వద్ద ప్రారంభమైంది.
09:53 AM, March 29th 2024
జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
- పెనుగంచిప్రోలులో సమావేశమైన జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు
- బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా విడిపోయిన క్యాడర్
- తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం
- పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు :బొల్లా రామకృష్ణ
- ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు :బొల్లా రామకృష్ణ
- శ్రీరామ్ రాజగోపాల్ కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంతవకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదు :బొల్లా రామకృష్ణ
- నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు:బొల్లా రామకృష్ణ
- గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా :బొల్లా రామకృష్ణ
- నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు :బొల్లా రామకృష్ణ
- టీడీపీ పార్టీ అందరిదీ.. తాతయ్య సొత్తు కాదు:బొల్లా రామకృష్ణ
- శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నాపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి :బొల్లా రామకృష్ణ
- లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా:బొల్లా రామకృష్ణ
09:15 AM, March 29th 2024
‘సార్.. పురందేశ్వరి తీరుతో పార్టీ భ్రష్టుపట్టుకుపోయింది’
- వాడి వేడిగా జరిగిన విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం
- బీజేపీ అగ్ర నేతలు అరుణ్ సింగ్, మధుకర్ జీ హాజరు
- మీటింగ్‌లోనే ఆ ఇద్దరిని నిలదీసిన బీజేపీ నాయకులు
- ఉత్తరాంధ్ర నుంచి సీఎం రమేష్, ఎన్ ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై అసంతృప్తి
- ఓసి వెలమ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ఆగ్రహం
- పార్టీ కోసం కష్టపడ్డ మాధవ్, జివిఎల్, సోము వీర్రాజు సీట్లు కేటాయించకపోవడంపై మండిపాటు
- కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నల వర్షం
- పురందేశ్వరి తీరు వల్ల పార్టీ భ్రష్టుపట్టుకుపోయిందని ఫైర్ అయిన నేతలు
- ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో నాలుగో వంతు సీట్లు కమ్మ సామాజిక వర్గానికే కట్టబెట్టారని ఫిర్యాదు
- ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేయలేమని స్పష్టం చేసిన బీజేపీ నేతలు
- ఒక్క అసెంబ్లీ స్థానం మహిళలకు కేటాయించక పోవడాన్ని తప్పు పట్టిన నేతలు
08:49 AM, March 29th 2024
నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం
- పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- కావలి, వింజమూరు బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
- ప్రజా గళం పేరిట ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత
08:21 AM, March 29th 2024
ఏప్రిల్ 7న పెందుర్తి లో పవన్ ప్రచారం
- ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ ప్రచారం షెడ్యూల్ ప్రకటన
- పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ
07:48 AM, March 29th 2024
Memantha Siddham.. డే 3 షెడ్యూల్
- మూడో రోజుకి చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర
- నేటి(మార్చి 29) సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం
- కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర
- పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరిక
- మధ్యాహ్నాం రాళ్లదొడ్డికి వద్ద భోజన విరామం
- ఆపై కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభకు చేరిక
- సాయంత్రం ఎమ్మిగనూర్ బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
- సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ చేరిక
- ఇవాళ రాత్రికి అక్కడి కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరంలో బస
ఇదీ చదవండి: ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు
07:40 AM, March 29th 2024
రఘురామ.. కొత్త పాట
- ఇంకా నరసాపురం టికెట్ ఆశలు వదులుకోని రఘురామ కృష్ణంరాజు
- చంద్రబాబు తనకు అన్యాయం చేయరంటూ స్టేట్‌మెంట్
- మోదీ, బాబు, పవన్‌లపై పూర్తి విశ్వాసం ఉందంటూ వ్యాఖ్యలు
- బీజేపీ ఢిల్లీ పెద్దలు తనకు బాగా క్లోజ్ అంటూ బిల్డప్పులు ఇచ్చే రఘురామ
- ఏపీ బీజేపీ అధిష్టానంతో మాత్రం పరిచయం, సాన్నిహిత్యం లేదంటూ సన్నాయి నొక్కులు
- అందుకే టికెట్ వచ్చి ఉండకపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్య
07:35 AM, March 29th 2024
పచ్చ పార్టీ ప్రలోభాలు
- డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు
- గ్రామస్థాయి నేతలకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు..
- చోటా నేతలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు..
- పార్టీలో చేరిన వారికి రూ.10వేల చొప్పున చెల్లింపులు
- అదే మండలస్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆఫర్
- అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు
- బాపట్ల, వేమూరులోనూ ఇదే పరిస్థితి
- ఓటర్లను నమ్మలేక నేతల కొనుగోలుకు సిద్ధపడిన వైనం
- బాపట్ల టీడీపీ అభ్యర్థి వర్మ కంపెనీ కంటైనర్‌లో పట్టుబడ్డ రూ.56 లక్షల నగదు
- ఆక్వా కంటైనర్ల మాటున పెద్దఎత్తున టీడీపీ నేతలు నగదు రవాణా!
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
07:12 AM, March 29th 2024
మారని బాబు, మళ్లీ పాత హామీలే
- ప్రజాగళం రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు
- మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు
- ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను
- సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా
- రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా
- యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను
- అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్‌లు ఇప్పిస్తాను
- ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు
- షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు
- అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు
రాష్ట్రంలో ఇన్ని మార్పులు చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వానికి 58 నెలలు మాత్రమే పట్టింది. అయితే 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇందులో కనీసం 10 శాతం కూడా చేయలేదు. ఒకవేళ చేసుంటే ఎల్లోమీడియా, ఆయన భజనపరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇవన్నీ చేసిన నాకు దక్కిన బ… pic.twitter.com/9eGfucnFXQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2024
సంబంధిత కథనం: అలా చేసుంటే ఎల్లో మీడియా ఆకాశానికెత్తేదే కదా!
07:06 AM, March 29th 2024
అనపర్తిలో TDP ఆగ్రహజ్వాలలు
- నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి
- నల్లమిల్లికి జరిగిన అన్యాయంపై భగ్గుమన్న శ్రేణులు
- టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపాటు
- పార్టీ కరపత్రాలు, జెండా, సైకిల్ దహనం
- టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్
- సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి
- కూటమిలో ఓవైపు ఆందోళనలు.. మరోవైపు సర్దుబాట్లు
- అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు
- పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్
- నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం
- చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి
- పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే తనను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- ‘మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడిని’ అని నల్లమిల్లి ఆవేదన
- నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి
- నేటి నుంచి కుటుంబంతో సహా జనంలోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయం వివరించి సింపథీ కోసం యత్నించనున్న నల్లమిల్లి
06:51AM, March 29th 2024
మేమంతా సిద్ధం.. ప్రభంజనం
- నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు
- జన సంద్రంలా నంద్యాల.. బహిరంగ సభకు పోటెత్తిన జనం
- నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర
- ఎమ్మిగనూరులో సాయంత్రం భారీ బహిరంగ సభ
06:42AM, March 29th 2024
అల్లూరి జిల్లా.. బాబుపై సీనియర్ల ఆగ్రహం
- ఇద్దరికీ నో టికెట్
- బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు
- టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి
- ఇటీవలే అబ్రహం ఫైర్.. అదే రూట్లో దొన్నుదొర
- తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్నుదొర
- అరకు అభ్యర్థిగా దొన్నుదొర పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు
- ఇప్పుడు టికెట్ బీజేపీకి కేటాయించడంపై ఆగ్రహం
06:42AM, March 29th 2024
‘తూర్పు’లో తలకిందులు!
- తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలు
- దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో మూడు ముక్కలైన టీడీపీ
- తలో దారీ వెతుక్కుంటున్న కూటమి నేతలు
06:30AM, March 29th 2024
ఓటుతో తలరాతను మార్చుకుందాం: సీఎం జగన్
- నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- సెల్‌ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్
- సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం
- పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు
- 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం
- 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా?
- ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది
- పిల్లల భవిష్యత్‌కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం
- సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం
- రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం
- ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం
నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం కార్యక్రమం సూపర్ సక్సెస్🔥#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/PZvGGLdvde
— YSR Congress Party (@YSRCParty) March 28, 2024
Comments
Please login to add a commentAdd a comment