అమలాపురం మున్సిపల్ చైర్మన్ మృతి | Amalapuram Municipal Chairman Died | Sakshi
Sakshi News home page

అమలాపురం మున్సిపల్ చైర్మన్ మృతి

Nov 22 2015 12:56 PM | Updated on Sep 3 2017 12:51 PM

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు (68) అనారోగ్యంతో ఆదివారం ఉదయం కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు (68) అనారోగ్యంతో ఆదివారం ఉదయం కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన మల్లేశ్వరరావు 2005లో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది చైర్మన్ అయ్యారు. మల్లేశ్వరరావు మృతిపట్ల డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సంతాపం ప్రకటించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement