ఏపీలో వడదెబ్బ: 45 మంది మృతి | 45 people died in Andhra Pradesh due to sunstroke | Sakshi
Sakshi News home page

ఏపీలో వడదెబ్బ: 45 మంది మృతి

Published Thu, Apr 7 2016 2:54 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

45 people died in Andhra Pradesh due to sunstroke

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా ఇప్పటి వరకు 45 మంది మరణించారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో వడగాల్పులుపై ఉన్నతాధికారులతో మంత్రి చినరాజప్ప సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వడగాల్పుల వల్ల కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారని చెప్పారు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో3, పశ్చిమగోదావరి జిల్లాలో1, కృష్ణాజిల్లాలో2, ప్రకాశం జిల్లాలో 11 , చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4 మరణించారని గణాంకాలతో సహా సోదాహరణగా వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే వైద్యఅధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప ఆదేశించారు. వడగాల్పులు నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చినరాజప్ప సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement