
'పోలీస్ అకాడమీకి 2 వేల ఎకరాలు అవసరం'
ఢిల్లీ: కేంద్ర హోం, అటవీశాఖ మంత్రులను మంగళవారం ఢిల్లీలో కలిసానట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు నిధులు అడిగినట్టు చెప్పారు. పోలీసు విభాగానికి సంబంధించిన కీలక ప్రతిపాదనల ఆమోదం కోసం.. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు చినరాజప్ప సోమవారం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
అలాగే గుంటూరు పోలీస్ అకాడమీకి రెండు వేల ఎకరాలు అవసరమనీ, అందుకుగానూ తాను అటవీశాఖ అనుమతిని కోరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యకే హోదా అంశంపై తానేమి చర్చించలేదని తెలిపారు. అంతేకాక శేషాచలం ఎన్కౌంటర్ కేసు కోర్టులో ఉన్నందున ఈ విషయంలో తాను వ్యాఖ్యానించనని చినరాజప్ప చెప్పారు.