Police Academy
-
Arti Singh Tanwar: పోలీస్ వీడియో పాఠాలు
మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్తిసింగ్ తన్వర్కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్లైన్స్కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్. ► వృత్తి... ప్రవృత్తితో కలిసి.. ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ. ► సోషల్ మీడియా సెల్... పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె. ► యువతకు వీడియో పాఠాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. ► కొత్త టెక్నాలజీ పరిచయం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి. ► ఖాకీ యూనిఫాంలో.. ‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రతిరోజూ అవగాహన రీల్ ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు. -
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు !
Popular Actor Nassar Wounded In Cinema Shooting: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. అయితే తాజాగా ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో బుధవారం (ఆగస్టు 17) ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న నాజర్ గాయాలపాలయ్యారని సమాచారం. నాజర్‌కు గాయాలు కాగా వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చదవండి: నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్ -
స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత
సాక్షి, చెన్నై(తమిళనాడు): పొల్లాచ్చి కేసులో నిందితులకు అండగా ఖాకీలు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వీడియో వైరల్ కావడంతో ఓ స్పెషల్ ఎస్ఐతో సహా ఏడుగురిని గురువారం సస్పెండ్ చేశారు. మాయ మాటలతో, స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగ దీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలాగాటం ఆడుతూ వచ్చిన మృగాళ్ల బండారం పొల్లాచ్చిలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధితులు అనేక మంది గతంలో చేసిన ఫిర్యాదుతో మృగాళ్ల తిరునావుక్కరసు, శబరినాథన్, మణివణ్ణన్, వసంతకుమార్, సతీష్ తొలుత అరెస్టు అయ్యారు. కేసు సీబీఐ చేతికి వెళ్లినానంతరం అన్నాడీఎంకేకు చెందిన అరులానందన్, బాలు, బాబు పట్టుబడ్డారు. ఈ కీచకుల్లో ఐదుగురు సేలం జైల్లో, మరో ముగ్గురు గోబి చెట్టి పాళయం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మార్గం మధ్యలో సపర్యలు బుధవారం వీరిని కేసు విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు హాజరు పరిచారు. సేలం జైల్లో ఉన్న ఐదుగుర్ని ఎస్ఎస్ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసులు వ్యానులో కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్ పొడిగించినానంతరం వీరిని మరలా జైలుకు తరలించారు.అయితే, మార్గం మధ్యలో ఈ కీచకులకు అండగా భద్రతకు వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో అర్ధరాత్రి వేళ వైరల్‌గా మారింది. గోల్డెన్‌ట్విన్స్ షూటింగ్‌స్పాట్ వద్ద పోలీసుల వాహనం ఆపేశారు. కీచకులు వారి కుటుంబీకులు, బంధువులు వారితో ముచ్చటించడమే కాకుండా, కోర్టు సమర్పించిన చార్జ్‌షీట్ నకలు వారి చేతికి చేరింది. అర్ధగంటకు పైగా కుటుంబంతో నిందితులు గడిపిన వీడి యో వెలుగులోకి రావడంతో పోలీసు బాసులు స్పందించారు. ఎస్ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కీచకులు, వారి కుటుంబాలతో భద్రతకు వెళ్లిన వారికి ఉన్న సంబంధాలు, వారి నుంచి వీరికి ఏ మేరకు నగదు ముట్టిందో.. అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో సీబీఐ సైతం సస్పెండైన ఏడుగురి మీద గురి పెట్టడం గమనార్హం. -
అట్టహాసంగా పోలీస్ బతుకమ్మ సంబురాలు
-
కొలువుల్లోకి టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ (టీఎస్ఎస్పీ) శిక్షణ కానిస్టేబుళ్లు ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వీరికి ఈనెల 26వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్లు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) చైర్మన్ శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శిక్షణ అనంతరం వీరికి వారం రోజుల పాటు సెలవులు ఉంటాయని తొలుత భావించారు. కానీ ఈనెల 28వ తేదీనే తమకు కేటాయించిన యూనిట్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వీరికి కేవలం 25, 26, 27 తేదీల్లో మూడు మాత్రమే సెలవు దినాలు రానున్నాయి. 25వ తేదీలోగా ట్రైనీ కానిస్టేబుళ్లందరికీ స్టైఫండ్ చెల్లించాలని స్పష్టం చేశారు. మరోవైపు 22, 23, 24 తేదీల్లో వీరి పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. అపాయింట్మెంట్ ఆర్డర్లు, విధుల్లో చేరాల్సిన తేదీలు ఖరారు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా శిక్షణ కేంద్రాల్లోని దాదాపు 3,900 మంది టీఎస్ఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లు రెట్టించిన ఉత్సాహంతో పరేడ్‌కు సాధన చేస్తున్నారు. -
పోలీస్ అకాడమీ సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో కరోనా కలకలంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం సరోజిని ఆస్పత్రిలో టీఎస్పీఏ సిబ్బంది, క్యాడెట్లకి ఉచిత కరోనా నిర్ధారణ క్యాంపు ఏర్పాటు చేయించారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అకాడమీలో ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ రాగా, సిబ్బంది, క్యాడెట్లకి రూ.2,800 చొప్పున ప్రైవేటు ల్యాబ్ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్షలు చేయించాలని తొలుత ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు పెల్లుబికాయి. పోలీస్ అకాడమీలో సామాజిక దూరం పాటించడం లేదని, కరోనా పాజిటివ్ వస్తే మాత్రం తమ డబ్బుతో పరీక్షలు చేయించుకోవాలా? అంటూ సిబ్బంది ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు లేవనెత్తారు. ఈ విషయాన్ని సాక్షి ‘పోలీస్ అకాడమీ కరోనా కలకలం’ అన్న శీర్షికతో వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన అకాడమీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. -
పోలీస్ అకాడమీలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడ మీ (టీఎస్పీఏ)లో ఓ అటెండర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అకాడమీ సిబ్బంది, కేడెట్లలో ఆందోళన మొదలైంది. కాగా, అకాడమీలో ఒకే గదిలో 400 మంది వరకు కేడెట్లను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తూ భౌతిక దూరం తదితర కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాడమీలో 1,200 మంది ఎస్సైలు, 650 మంది వరకు విమెన్ పీసీ కేడెట్లు శిక్షణ పొందు తున్నారు. వీరు కాకుండా మరో 400 మంది సిబ్బంది బయట నుంచి వస్తారు. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే క్యాంపస్‌లో ఉంటా రు. లాక్డౌన్ విధించినా అకాడమీలో కొత్తవారిని రానీయలేదు. లాక్డౌన్ ఆంక్షలు తొలగించిన తరువాత హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగాయి. దీంతో టీఎస్పీఏ అటెండర్ ఉద్యోగికి కరోనా రావడంతో సిబ్బం దిలో కలకలం మొదలైంది. ఆందోళనకు కారణాలివే..! అకాడమీలో భౌతిక దూరం నిబంధన ఏ కోశానా అమలుకావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. తరగతిలో 400 మందికిపైగా కేడెట్లు ఒకే హాల్లో కూర్చుంటున్నారు. ముఖానికి మాస్కులు వేసుకుంటున్నా.. అంత దగ్గరగా కూర్చోవడంతో కేడెట్లలో కరోనా ఆందోళన మొదలైంది. రెండు వేల మంది కేడెట్లు, 400 మంది సిబ్బందితో శ్రమదానం సైతం చేయించారు. కరోనా కేసు వెలుగుచూసినా ఎలాంటి మార్పు రాలేదు. అకాడమీలో శనివారం కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనికి అందరూ హాజరయ్యారు. కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆదివారం నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. రూ. 2,800 కట్టిన వారికి ప్రైవేటు సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలపడంతో సిబ్బంది నీరుగారిపోయారు. -
చట్టం వేరు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలు వేరు
సాక్షి, హైదరాబాద్: నిజమైన ప్రజాస్వామ్యం అంటే న్యాయపరమైన సంయమనం, రాజకీయ స్వేచ్ఛ, చట్టబద్ధపాలన ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఈ విధంగా జరిగినప్పుడే ప్రజాతంత్ర వ్యవస్థ నిజమైన మనుగడ సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ‘ఆధునిక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వ్యక్తి పాలనకు, చట్టబద్ధ పాలనకు తేడా ఉంటుందని, చట్టపాలనకు కచ్చితంగా ప్రభుత్వ విధానాలతో పెనవేసుకుని ఉండనవసరం లేదని, ఈ తేడాను విధి నిర్వహణలో గుర్తించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందన్నారు. చట్టబద్ధ పాలనకు న్యాయసమీక్ష మూలాధారం అవుతుందన్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని, ఇలాంటి సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నింటినీ అధిగమించినప్పుడే సమర్ధత బయటపడుతుందని యువ ఐపీఎస్ అధికారులకు సూచించారు. మాతృభూమికి సేవలు అందించేందుకు కదనరంగంలోకి దిగే సమయంలో ఎదురయ్యే సవాళ్లను చట్టబద్ధంగానే అధిరోహించాలన్నారు. మీకున్న అధికారాలను నీతి, నిజాయితీతో సహేతుకంగా వినియోగించుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. దేశంకోసం సరిహద్దుల్లోనూ, ఇతర చోట్ల ప్రాణాలను ఫణంగా పెట్టిన సైనికుల సేవలకూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసులకు పెద్దగా తేడా లేదని, రెండు త్యాగాలూ వెలకట్టలేనివే అని జస్టిస్ రంజన్ గొగోయ్ కొనియాడారు. పోలీస్ అకాడమీ 1983లో ఏర్పాటైందని, ఆ తర్వాత ఏడాది ఆనాటి జమ్మూకాశ్మీర్ గవర్నర్ బీకే నెహ్రూ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఇదే వేదిక నుంచి ప్రసంగించారని అకాడమీ డైరెక్ట్టర్ డాక్టర్ అభయ్ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 2018 బ్యాచ్‌కు చెందిన తొలి దశ శిక్షణలో ఉన్న 156 మంది ఐపీఎస్‌లు హాజరయ్యారు. -
తెల్ంగాణ పోలీస్ అకాడమీలో గణతంత్ర వేడుకలు
-
ఆ పోలీస్ స్టేషన్‌కు స్కూల్ బ్యాగులతో పిల్లలు క్యూ!
రోజూ ఉదయం తొమ్మిదిన్నర అయితే చాలు ఆ పోలీస్ స్టేషన్‌కు స్కూల్ బ్యాగులతో పిల్లలు క్యూ కడతారు. మధ్యాహ్నం మూడున్నర వరకు అక్కడే ఉండి పాఠాలు వల్లె వేస్తారు. కొంతమంది పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తూనే ఖాళీసమయాల్లో వారికి పాఠాలు చెబుతారు..పోలీస్‌స్టేషన్ ఏంటి? పాఠాలేంటి? అనుకుంటున్నారా? డెహ్రాడూన్‌లోని ప్రేమ్‌నగర్‌లో ఓ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్‌స్టేషన్ ఆవరణలో కొంతకాలంగా ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు. మొదట ఈ పాఠశాలను ప్రారంభించినప్పుడు పది మంది మాత్రమే విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 4–12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 51 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ మిగతా పాఠశాలల తరహాలో బట్టీ పట్టడాలు, మార్కుల వేటలు ఉండవు. హిందీ, ఇంగ్లిష్, గణితం నేర్పుతారు. చదవడం వచ్చిన వారికి చరిత్ర, భౌగోళిక శాస్త్రం కూడా నేర్పుతారు. ముందుకొస్తున్న దాతలు పోలీసుల రక్షణలోనే పాఠశాల ఉండటంతో ఈ పాఠశాలకు పంపేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు కొంతమంది అవసరమైన సాయం అందించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థులను తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు వ్యాన్ కోసం ఓ వ్యక్తి నెలకు రూ.5,000 ఇచ్చేందుకు అంగీకరించారు. మరొకరు ఉచితంగా బ్యాగులు ఇచ్చారు. ఈ స్కూల్‌కు వచ్చే పిల్లలకు అరటిపళ్లు, సమోసా వంటి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని దాతలు అందజేస్తున్నారు. నందాకీ చౌకీ స్లమ్‌లో నివసించే బడిఈడు పిల్లల కోసం ఆసరా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట ఈ పాఠశాలను పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని చక్రతా రోడ్డు పక్కన నడిపేవారు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఈ రోడ్డు బిజీగా ఉండటంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగేది. ఇది గమనించిన ప్రేమ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేశ్ త్యాగి పాఠశాలను పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగితే ఒక్కో సెషన్ రెండు గంటల చొప్పున మూడు సెషన్స్ నిర్వహిస్తామని ఆసరా ట్రస్ట్‌కు చెందిన రాఖీ వర్మ తెలిపారు. ‘మా నాన్న చిత్తు కాగితాలు ఏరుతారు..నేను అడుక్కుంటూ కుటుంబానికి సాయం చేస్తాను...ఇప్పుడు ఈ స్కూల్‌కి వెళ్లి హాయిగా చదువుకుంటున్నాను’ అని గాయత్రి అనే విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్క గాయత్రే కాదు.. ఎప్పుడూ పాఠశాల గడప తొక్కని పలువురు ఇక్కడ హాయిగా చదువుకుంటున్నారు. -
ఎక్సైజ్ పోలీస్ అకాడమీలో అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ : బండ్లగూడ ఎక్సైజ్ పోలీస్ అకాడామీలో ఉన్న యూఎస్ఈ హోలోగ్రామ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆవరణలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన విస్కీ, బీర్, బ్రాందీ తదితర బాటిళ్లకు ఇక్కడి నుంచే లెబుల్స్‌ను తయారు చేసి పంపిస్తుంటారు. ఇందులోని చెత్తను పక్కనే డంప్ చేశారు. మంగళవారం సాయంత్రం చెత్తకు నిప్పంటుకుంది. నిమిషాల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీని పక్కనే లేబుల్స్‌కు సంబంధించిన ప్లాస్టిక్ బండిళ్లను డంప్ చేశారు. వీటికి సైతం నిప్పంటుకుని దట్టమైన పోగలు వ్యాపించాయి. కెమికల్ డబ్బాలు ఉండడంతో పేలాయి. ఇంత పెద్ద పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించే పరికరాలు ఏమీ లేకపోవడం గమనార్హం. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చూట్టూ దట్టమైన పొగ ఆవరించింది. స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న బస్తీల్లోకి ఘాటైన పొగ రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బండ్లగూడ, కిస్మత్పూర్, బుద్వేల్, రాజేంద్రనగర్ వరకు ఈ పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కావడంతో ఘాటన దుర్వాసన వ్యాపించింది. రెండు అగ్నిమాపక వాహనాల సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
ఆపదలో పోలీసులే దేవుళ్లు
సాక్షి, రంగారెడ్డి: ఆపద సమయంలో బాధితులకు పోలీసులే దేవుళ్లని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించే వారికి సత్వర న్యాయం అందించాలన్నారు. బుధవారం రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రం (ఆర్బీవీఆర్ టీఎస్పీఏ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 735 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. సివిల్ 452, ఏఆర్ 283 మహిళా కానిస్టేబుళ్లు ఇక్కడ శిక్షణ పొందారు. పాసింగ్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మునుపటిలా పరిస్థితులు లేవని, ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిందన్నారు. చట్టానికి లోబడి గౌరవప్రదంగా విధులు నిర్వహించాలని మహిళా కానిస్టేబుళ్లకు సూచించారు. ఆపదలో పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కే మహిళలను ఒక స్త్రీగా ఓపికతో సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ పోలీస్ శిక్షణ కేంద్రాల్లో టీఎస్పీఏ ఒకటని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీస్ స్టేషన్ దేవాలయంలా కనిపిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మెరుగైన సేవలు అందిస్తే పోలీస్‌ని దేవుడిలా చూస్తారన్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతోనే జీతాలు పొందుతున్న విషయాన్ని గుర్తించి.. వారిని యజమానులుగా భావించాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనూ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ అందజేశామని పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్ పేర్కొన్నారు. తొమ్మిది నెలల శిక్షణలో భాగంగా చట్టం, ఆయుధాల వాడకం, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చామని వివరించారు. -
కేసీఆర్‌తో ఏకాంతంగా మాట్లాడిన మోదీ
-
కేసీఆర్‌తో ఏకాంతంగా మాట్లాడిన మోదీ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీలో జరిగిన డీజీపీ, ఐజీపీల సదస్సులో శనివారం మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 26/11 ముంబై దాడులను ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. పోలీసులు తీవ్రవాదులతో ధ్యైర్యంగా పోరాడారని కొనియాడారు. అలాగే విధి నిర్వహణలో 33,000 మందికి పైగా పోలీసులు అమరులైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. డీజీపీ, ఐజీపీలతో సదస్సు వినూత్నంగా జరిగిందని తెలిపిన మోదీ.. ఇక్కడ చర్చించిన విషయాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్ పెంపుందించుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే మానవ ప్రవర్తన, సైకాలజీలకు సంబంధించిన విషయాలు ట్రైనింగ్‌లో భాగం కావాలన్నారు. పోలీసులకు నాయకత్వ లక్షణాలు ముఖ్యన్నారు. 'ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్' మొబైల్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. అలాగే.. ఇంటలిజెన్స్ బ్యూరోలో అత్యుత్తమ సేవలందించిన వారికి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను మోదీ అందజేశారు. రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సాయంత్రం తిరుగుపయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు సీఎంతోపాటు గవర్నర్, మంత్రులు, డీజీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, గవర్నర్లతో మోదీ కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. -
పోలీస్ అకాడమిలో వివిధ పనులకు శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమిలో వివిధ అభివృద్ధి పనులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం భూమి పూజ చేశారు. మోడల్ పోలీసు స్టేషన్, క్లాస్ రూమ్ బ్లాక్, ఇండోర్ స్పోర్ట్సు కాంప్లెక్సుకు శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో మోడల్ పోలీస్ స్టేషన్, రూ.2.40 కోట్లతో క్లాస్ రూమ్ బ్లాక్, రూ.15.20 కోట్లతో ఇండోర్ స్పోర్ట్సు కాంప్లెక్సును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌తోపాటు డీజీపీ అనురాగ్ శర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'
-
'అది భస్మాసుర హస్తం.. మీకే డేంజర్'
హైదరాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. 61మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో వాస్తవాలు గ్రహించాలని, ఉగ్రవాదాన్ని దేశ విధానంగా కొనసాగించడం సాక్షాత్తు ఆత్మహత్యా సాదృశ్యమే అని చెప్పారు. 'ఉగ్రవాదం అనేది భస్మాసుర హస్తం. భస్మాసూరుడికి మీరు(పాక్) అవకాశం ఇస్తే చివరికి అది మిమ్మల్నే అంతం చేస్తుంది. మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. దాని బాధితులుగా మిగిలిపోతారు' అని వెంకయ్య హెచ్చరించారు. పాక్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగానే కాకుండా భారత్‌కు వ్యతిరేకంగా పెంచిపోషిస్తోందని అన్నారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, పర్వేజ్ ముషార్రఫ్ ల మధ్య ఆగ్రా సమావేశం జరిగిందని, అందులో పాక్ తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించదని హామీ ఇచ్చిందని, కానీ దానిని నిలబెట్టుకోవడంలో పాక్ విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పాక్ నడుచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'25 మంది ఐపీఎస్‌లను కేటాయించండి'
ఢిల్లీ: ఐపీఎస్ కేడర్ కేటాయింపు సమీక్షా సమావేశానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు హాజరయ్యారు. కేంద్ర హొం శాఖ కార్యదర్శిని సోమవారం ఆయన కలిశారు. పోలీసు శిక్షణా సంస్థల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరారు. ఏపీకి అదనంగా 25 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2 వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటి ఫై చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ : శిక్షణ పూర్తి చేసుకున్న 141 మంది ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ పరేడ్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ధోవల్ హాజరయ్యారు. ఈ 67వ బ్యాచ్‌లో మొత్తం 152 మంది శిక్షణ తీసుకోగా, వీరిలో 141 మంది భారతీయులు, మరో 15మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన వారు. ఈసారి బ్యాచ్‌లో ఏకంగా 28మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. విద్యార్హత పరంగా చూస్తే.. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న 80 మంది, 19మంది ఎంబీబీఎస్‌లు ఈసారి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారు. ట్రైనింగ్ అయిన వారిలో ఏపీ, తెలంగాణలలో ఆరుగురు బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన అపూర్వ.. సొంత రాష్ట్రం తెలంగాణలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. -
'పోలీస్ అకాడమీకి 2 వేల ఎకరాలు అవసరం'
ఢిల్లీ: కేంద్ర హోం, అటవీశాఖ మంత్రులను మంగళవారం ఢిల్లీలో కలిసానట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు నిధులు అడిగినట్టు చెప్పారు. పోలీసు విభాగానికి సంబంధించిన కీలక ప్రతిపాదనల ఆమోదం కోసం.. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు చినరాజప్ప సోమవారం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే గుంటూరు పోలీస్ అకాడమీకి రెండు వేల ఎకరాలు అవసరమనీ, అందుకుగానూ తాను అటవీశాఖ అనుమతిని కోరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యకే హోదా అంశంపై తానేమి చర్చించలేదని తెలిపారు. అంతేకాక శేషాచలం ఎన్కౌంటర్ కేసు కోర్టులో ఉన్నందున ఈ విషయంలో తాను వ్యాఖ్యానించనని చినరాజప్ప చెప్పారు. -
హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో సంబురం!
-
పోలీస్ అకాడమీలో మిస్‌ఫైర్
-
జిల్లా కేంద్రంలో రాష్ట్ర పోలీసు అకాడమీ..?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : డీఎస్పీ, ఎస్సై స్థాయి పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ(అప్పా)తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళుతుంది. దీంతో సీమాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు అకాడమీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ అకాడమీని విజయనగరంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దీనికి పట్టణంలో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రం అనువైనదిగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు భావించినట్లుగా తెలిసింది. పోలీసు శిక్షణ కేంద్రానికి గతంలో సుమారు 127 ఎకరాలు వరకు భూమిని కేటాయించారు. పోలీసు శిక్షణ కేంద్రం, మైదానం, జిల్లా పోలీసు కార్యాలయం, పోలీసు క్వార్టర్స్ తదితరాలను కలుపుకొని 87 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ స్థలం అన్నిరకాల పోలీసు శిక్షణా కార్యక్రమాలకు సరిపోతుందన్న భావనతో ఇక్కడ అకాడమీని ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ ఎంత స్థలం ఉంది తదితర వివరాలను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలుసుకున్నట్లు తెలిసింది. -
మేమున్నామని...
‘2014 ఏడాదికల్లా దేశంలో మహిళా పోలీసుల సంఖ్య 5వేలు దాటాలి’ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని చెప్పిన మాటలివి. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు ఇదొక్కటే పరిష్కారమంటూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతి జిల్లా పరిధిలో పన్నెండుమంది మహిళా పోలీసులుండాలన్న నిబంధనను అమలుచేసే పనిలో భాగంగా పెద్ద ఎత్తున శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యనే ఆప్ఘనిస్తాన పోలీస్ అకాడమీలో చేరిన ఫ్రిభాని పలకరిస్తే...‘‘ఐదేళ్ల కిందట ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సమయంలో సహ ఉద్యోగుల్లో కొందరు పురుషులు నన్ను చాలా రకాలుగా వేధించారు. చాలాసార్లు పోలీసుల్ని ఆశ్రయించాలనుకున్నాను. కానీ, మగపోలీసులకు నా బాధ ఎలా అర్థమవుతుందనుకుని...ఊరుకున్నాను. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఏ మహిళకు చిన్న సమస్య వచ్చినా..మేం ఉన్నాం’’ అని గర్వంగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం 1850మంది మహిళా పోలీసులున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నారు అక్కడి మహిళలంతా. -
పోలీసులకు మానసిక ఒత్తిడి ఎక్కువే
మెడికల్ క్యాంప్ ప్రారంభ కార్యక్రమంలో డీజీపీ సాక్షి, హైదరాబాద్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడుతుంటారని రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు అన్నారు. వయసు ప్రభావంతో రక్తపోటు, మధుమేహం, గుండెనొప్పి బారిన పడకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు. మెడ్విన్ ఆస్పత్రి సౌజన్యంతో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు వెల్ఫేర్ మెడికల్ క్యాంప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ శిబిరంలో పంపిణీ చేసే మందులకోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) రూ.లక్ష విరాళంగా ఇచ్చిందని డీజీపీ తెలిపారు. ఈ క్యాంప్ సేవల్ని డీజీపీ కార్యాలయంతోపాటు ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏపీఎస్పీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం వినియోగించుకోవచ్చని అదనపు డీజీ(సంక్షేమం) సౌమ్య మిశ్రా తెలిపారు. -
డీఐజీ మురళీకృష్ణకు రాష్ట్రపతి మెడల్
కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు శాఖలో విశేష ప్రతిభ కనపర్చిన కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం దక్కింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు పోలీసు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం సాయంత్రం మెడల్స్ దక్కించుకున్న పోలీసు అధికారుల జాబితా విడుదల చేసింది. ఆక్టోపస్ విభాగంలో ఎస్పీగా ఉన్న మురళీకృష్ణకు గత ఏడాది మే 23న డీఐజీగా పదోన్నతి కల్పించి కర్నూలు రేంజ్‌కు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆయన 2013 మే 31న డీఐజీగా విధుల్లో చేరారు. 1987వ సంవత్సరం గ్రూప్-1 పరీక్షలో ఎంపికై పోలీసు శాఖలో చేరిన మురళీకృష్ణ వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 1998లో ఐపీఎస్‌కు ఎంపికై పోలీస్ అకాడమి హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో పనిచేశారు. గతంలో ఉత్తమ సేవా పతకం, మహోన్నత పతకం, ఇండియన్ పోలీస్ మెడల్, ఐక్యరాజ్య సమితి మెడల్ అందుకున్నారు. అత్యున్నతమైన పోలీసు పురస్కారానికి ఎంపికైన డీఐజీ మురళీకృష్ణకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
ఐపీఎస్‌లు సామాన్యులకు రక్షణ కల్పించాలి: ప్రణబ్
హైదరాబాద్ : సామాన్యులకు రక్షణ కల్పించేలా ఐపీఎస్‌లు పని చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంగళవారం ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ప్రణబ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంకితభావంతో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను అభినందిస్తున్నానని తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఐపీఎస్‌లు పని చేయాలన్నారు. ఐపీఎస్‌లు వృత్తి నిబద్ధతతో పని చేస్తారని ఆశిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలని సూచించారు. మతసామరస్యం కాపాడడంలో ఐపీఎస్‌లది కీలకపాత్ర అని తెలిపారు. నిరంతరం ఉగ్రవాదులకు భారత్ లక్ష్యంగా మారుతోందని చెప్పారు. ఉగ్రవాదం, చొరబాటుదారులను ఆరికట్టడంలో భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందన్నారు. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేరకు మహిళలపై వేధింపుల నివారణకు కొత్త చట్టం తెచ్చామని చెప్పారు. దేశంలో జరుగుతున్న సంఘ విద్రోహ చర్యలను అరికట్టాలని కోరారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. 148 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో ఏపీ కేడర్‌కు చెందినవారు ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రణబ్ రాజ్‌భవన్ చేరుకున్నారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయాం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 5 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.