
దగ్ధమవుతున్న లేబుల్స్
రాజేంద్రనగర్ : బండ్లగూడ ఎక్సైజ్ పోలీస్ అకాడామీలో ఉన్న యూఎస్‌ఈ హోలోగ్రామ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆవరణలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన విస్కీ, బీర్, బ్రాందీ తదితర బాటిళ్లకు ఇక్కడి నుంచే లెబుల్స్‌ను తయారు చేసి పంపిస్తుంటారు. ఇందులోని చెత్తను పక్కనే డంప్ చేశారు. మంగళవారం సాయంత్రం చెత్తకు నిప్పంటుకుంది.
నిమిషాల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీని పక్కనే లేబుల్స్‌కు సంబంధించిన ప్లాస్టిక్ బండిళ్లను డంప్ చేశారు. వీటికి సైతం నిప్పంటుకుని దట్టమైన పోగలు వ్యాపించాయి. కెమికల్ డబ్బాలు ఉండడంతో పేలాయి. ఇంత పెద్ద పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించే పరికరాలు ఏమీ లేకపోవడం గమనార్హం. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చూట్టూ దట్టమైన పొగ ఆవరించింది.
స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న బస్తీల్లోకి ఘాటైన పొగ రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బండ్లగూడ, కిస్మత్‌పూర్, బుద్వేల్, రాజేంద్రనగర్ వరకు ఈ పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కావడంతో ఘాటన దుర్వాసన వ్యాపించింది. రెండు అగ్నిమాపక వాహనాల సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment