ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ | Out parede passing of IPS officers | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్

Published Sat, Oct 31 2015 8:31 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

Out parede passing of IPS officers

హైదరాబాద్ : శిక్షణ పూర్తి చేసుకున్న 141 మంది ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ పరేడ్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ధోవల్‌ హాజరయ్యారు. ఈ 67వ బ్యాచ్‌లో మొత్తం 152 మంది శిక్షణ తీసుకోగా, వీరిలో 141 మంది భారతీయులు, మరో 15మంది నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులకు చెందిన వారు.

ఈసారి బ్యాచ్‌లో ఏకంగా 28మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. విద్యార్హత పరంగా చూస్తే.. ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్న 80 మంది, 19మంది ఎంబీబీఎస్‌లు ఈసారి ఐపీఎస్‌ శిక్షణ పూర్తి చేశారు. ట్రైనింగ్‌ అయిన వారిలో ఏపీ, తెలంగాణలలో ఆరుగురు బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన అపూర్వ..  సొంత రాష్ట్రం తెలంగాణలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement