
సాక్షి, భీమవరం : రేవంత్‌రెడ్డి ఒక పార్టీలో ఎదిగి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటూ మా మంత్రులపై బురద జల్లి వెళ్లిపోతాననడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామాన్ని ఆయన సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. అంతే కానీ అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు.
ఇటీవలి కాలంలో చింతమనేని ప్రభాకర్ ఓ కుటుంబంపై దాడి చేసిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారని తెలిపారు. కాగా సోమవారం ఉదయం పంచారామ ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగత పలికారు. చినరాజప్ప ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment