అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా): ఎన్‌వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జాతీయస్థాయి ఇన్విటేషన్ మెన్ అండ్ వుమెన్ డే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ సోమవారం ఆరంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్‌ను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ఆరంభించారు. ఈ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ముంబై, గోరఖ్‌పూర్, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్, కేరళ, మైసూర్‌కు చెందిన పురుషులు, మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ 2019లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్జున్ అవార్డు గ్రహీత, వెటరన్ వాలీబాల్ క్రీడాకారుడు ఎ.రమణ, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ వాలీబాల్ పోటీలు ఆరంభం
Published Mon, Mar 7 2016 8:08 PM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM
Advertisement
Advertisement