
మాకు చెప్పకుండా.. బదిలీలా..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో శనివారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత భేటీ అయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఎస్ఐ, సీఐలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపిన విషయంపై సునీత హోం మంత్రితో చర్చించినట్టు తెలిసింది.
ఈ విషయంలో తమకు తెలియకుండా తమ సొంత నియోజకవర్గంలో అధికారులను ఎలా బదిలీ చేస్తారంటూ చినరాజప్ప ఎదుట ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత కోరినట్టు సమాచారం.