Paritala suneetha
-
పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట..
ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయ ఆదాయాన్ని ఆలయ కమిటీ ముసుగులో దోచేశారు. మాజీ మంత్రి పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలో పాతికేళ్లు ఆలయ నిర్వహణ కొనసాగింది. భక్తుల నుంచి ముడుపులు, కానుకలతో పాటు ఆలయ గదుల అద్దెలు, దుకాణాల వేలం పాట ద్వారా సమకూరిన ఆదాయాన్ని దిగమింగేశారు. నామమాత్రంగా ఆదాయం చూపుతూ భక్తులు అమ్మవారికి సమర్పించిన అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీల రూపంలోని చందాలను ఎంచక్కా ఇళ్లకు చేర్చుకున్నారు. ఎట్టకేలకు ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తేవడంతో దోపిyీ కి చెక్ పడింది. రామగిరి: కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ పూజలందుకుంటోంది. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో నసనకోట ఒకటి. ఇక్కడికి జిల్లా వ్యాప్తంగానే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ముత్యాలమ్మ అమ్మవారికి కానుకల రూపంలో నగదు, చీర, సారెతో పాటు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం ఉంటున్నా రికార్డుల్లో మాత్రం నమోదు కాలేదు. పాతికేళ్లుగా పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలోనే కొనసాగుతూ వచ్చింది. చందాలు, కానుకల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి గానీ, నసనకోట గ్రామ అభివృద్ధికి గానీ వినియోగించిన దాఖలాలు లేవు. పాతికేళ్లుగా దోపిడీ.. మహిమాన్విత నసనకోట ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం అధీనంలోనే పాతికేళ్లుగా ఉండేది. పరిటాల అనుచరులు, కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ పేరుతో చెలామణి అయ్యేవారు. కమిటీ పేరుతో ఏడాదికి ఒకసారి ఆలయ గదులు, హుండీ, కానుకలు, కొబ్బరి కాయలు, మద్యం విక్రయం తదితర వాటికి వేలం వేసి నామమాత్రపు ఆదాయం చూపేవారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక కానుకలను సమర్పించడానికి వచ్చిన అనేక సందర్భాలలో కమిటీ సభ్యులు ఇంటి వద్దకే పిలిపించుకునే వారు. చెక్కులు, బంగారు, వెండి ఆభరణాలు ఆలయానికి వినియోగిస్తామని నమ్మబలికి భక్తుల నుంచి తీసుకునేవారు. ఆలయ కానుకలు, ఆదాయాన్ని భారీగా దోపిడీ చేస్తున్నారంటూ ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆందోళన చేశారు. భక్తులు అందజేసిన బంగారు ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులే ఆరోపించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు దేవదాయ శాఖ పరిధిలోకి.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చొరవతో నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని నాలుగు నెలల కిందట దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ పరిటాల అనుచరులే పెత్తనం సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి పది రోజులకు సంబంధించిన హుండీ కానుకలను ఈ నెల ఏడో తేదీన లెక్కించారు. అదీ మాఘమాసం.. జంతు బలులు తక్కువ ఇచ్చే సమయంలో రూ.77,343 ఆదాయం వచ్చినట్లు ఈఓ నర్సయ్య తెలిపారు. మిగతా రోజుల్లో హుండీ కానుకల ఆదాయం భారీగా ఉంటుందనేది తేటతెల్లమైంది. దేవదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత పరిటాల కుటుంబ కబంధ హస్తాల చెర నుంచి ముత్యాలమ్మ ఆలయానికి విముక్తి కలిగినట్లయ్యిందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇక నుంచైనా ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ఆలయ ఆదాయాన్ని వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న జనం
సాక్షి, టాస్క్‌పోర్స్: ఓటర్లను ప్రభావితం చేసేందు కోసం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను మరూరు గ్రామస్తులతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రాత్రి 10 గంటల సమయంలో మంగళవారం మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామంలో తనను ఎన్నికల్లో గెలిపించాలని లేకపోతే మీ అంతు చూస్తా, గ్రామాలను తగులబెట్టేస్తా అని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరుకముందే గురువారం ఉదయం మండలంలోని మరూరు గ్రామంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల శ్రీరాం వెళ్లి హల్ చేల్ చేశాడు. దాదాపుగా 10 వాహనాల్లో 50 మందికి పైగా తన అనుచరులతో వెళ్లి మరూరులోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మరూరు గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎందుకు ఇంత మందితో పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నావని అడిగారు. దీంతో ఆయన నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ఎక్కడికైనా వెళ్తానని చెప్పారు. అడ్డు వచ్చిన గ్రామస్తులను పక్కకు నెట్టి ముందుకు వెళ్లడంతో అక్కడే ఉన్న మరికొంత మంది గ్రామస్తులు అడ్డుపడ్డారు. వారికి తోడుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లాలని లోపలికి వెళ్లనిచ్చేదే లేదంటూ గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. అయితే వీరిని పక్కకు నెట్టేయండి అంటూ అనుచరులకు శ్రీరాం హుకుం జారీ చేశారు. శ్రీరామ్ వైపు అనుచరులు, టీడీపీ నాయకులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒక్క సారిగా పరిటాల శ్రీరాంతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను బయటకు నెట్టి వేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత వారించినా పరిటాల శ్రీరాంను లోపలికి వెళ్లనిచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. చేసేది లేక పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే గ్రామంలోకి వచ్చి నన్ను అడ్డుకున్న ప్రతి ఒక్కరిని గ్రామ బహిష్కరణ చేస్తానంటూ శ్రీరామ్ మీసం మేలేసి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఆయన రాప్తాడు పోలింగ్ కేంద్రంలో కూడా హల్చల్ చేశాడు. అడ్డుపడటం మంచిపద్ధతి కాదు : మంత్రి పరిటాల సునీత పోలింగ్ కేంద్రంలో జరుగుతన్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వస్తే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆమె మరూరు గ్రామానికి వచ్చి మీరేం చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వస్తే ఎందుకు లోపలికి వెళ్లనివ్వలేదంటూ ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తామంటూ ధ్వజమెత్తారు. అనంతరం ఆమె రాప్తాడులో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. రంగంలోకి దిగిన రామగిరి సీఐ పరిటాల శ్రీరామ్‌ను మరూరు గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలుసుకున్న రామగిరి సీఐ సిద్ధ తేజామూర్తి మరూరుకు వచ్చి గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులపై లాఠీచార్జి చేశారు. మరూరు గ్రామం సీఐ పరిధిలో లేకున్నా ఇక్కడి వచ్చి గ్రామస్తులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అతి చేస్తే బట్టలు ఊడదీసి కోడతానంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని స్టేషన్లో కాళ్లు పైకి కట్టి కొడతానంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఐ దురుసు ప్రవర్తనను కొందరు వైఎస్సార్సీపీ నేతలు సెల్ఫోన్లో బంధిస్తుండగా సెల్ఫోన్లను సీఐ లాక్కొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
డ్వాక్రా రుణమాఫీపై బట్టబయలైన టీడీపీ మోసం
-
బట్టబయలైన టీడీపీ మోసం
అమరావతి: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది. అసెంబ్లీ వేదికగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత సమాధానమిచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు.. రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం బహిరంగ సభల్లో మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ చేసినట్లు ప్రచారం చేయడం గమనర్హం. లిఖితపూర్వక లేఖ -
మంత్రి యనమలకు ఘోర అవమానం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ఘోర అవమానం జరిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల విషయంలో యనమలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం యనమల కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే, కృష్ణా జిల్లాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసే అవకాశం మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి ఇచ్చారు. సీనియర్ మంత్రి, బీసీ నేతను కాదని జూనియర్ మంత్రి అయిన సునీతకు సీఎం అవకాశం ఇవ్వడం గమనార్హం. ఫిరాయింపు మంత్రి అమర్నాథ్రెడ్డికి సైతం జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. కానీ యనమలకు అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది సీనియర్ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదేవిధంగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది జెండా ఆవిష్కరణ విషయంలో తనకు అవమానం జరగడంతో మంత్రి యనమల మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా తూర్పు గోదావరిలో యనమలకు అవకాశమున్నా.. చంద్రబాబు ఇవ్వకపోవడంతో యనమల కినుకు వహించినట్టు తెలుస్తోంది. అవకాశం దక్కని మంత్రులు! మంత్రి యనమల రామకృష్ణుడితోపాటు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి కే అచ్చెన్నాయుడులకు అవకాశం దక్కలేదు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి కళా వెంకట్రావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాకపోయినప్పటికీ.. ఆయనకు జిల్లాలోనే జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేయనున్న మంత్రుల జాబితా ఇదే విజయనగరం- గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం - నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి - కాల్వ శ్రీనివాసులు పశ్చిమగోదావరి - ప్రత్తిపాటి పుల్లారావు కృష్ణా - పరిటాల సునీత గుంటూరు- సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రకాశం - పీ. నారాయణ నెల్లూరు - ఎన్. అమర్నాథ్రెడ్డి కడప - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్నూలు - కేఈ కృష్ణమూర్తి అనంతపురం- డీ ఉమామహేశ్వరరావు చిత్తూరు - ఎన్ ఆనందబాబు -
‘నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్న పరిటాల సునీత’
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. కోనేటి నాయుని పాళ్యంలో అంజి అనే వ్యక్తి బాలింతపై అత్యాచార యత్నం చేసి, ఆమె ప్రతిఘటించడంతో ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతని తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు అంజి వెంకటాపురంలోని పరిటాల సునీత ఇంట్లో తలదాచుకున్నాడని, విషయం తెలిసీ పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. -
మంత్రి పరిటాల సునీత హస్తం
మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు ఎస్పీని కలిశారు. అనంతపురం సెంట్రల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ హత్యలను ప్రేరేపిస్తున్నారని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్పై హత్యకు కుట్ర జరిగిన విషయంపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. బాధితుడు ధనుంజయయాదవ్కు రక్షణ కల్పించాలని అనంత వెంకట్రామిరెడ్డితో పాటు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు ఎస్పీని కోరారు. అనంతరం మాజీ ఎంపీ అనంత మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులే లక్ష్యంగా అధికారపార్టీ నేతలు హత్యారాజకీయాలు ప్రేరేపిస్తున్నారన్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పథకం రచిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి రాక్షసత్వం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను పొట్టన పెట్టుకున్నట్లు తెలిపారు. పెద్దవడుగూరు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులను హత్య చేయించారని గుర్తు చేశారు. పేరూరులో సమావేశమైన వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడమే కాకుండా కౌంటర్ కేసులు నమోదు చేశారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను భయబ్రాంతులకు గురిచేయడానికి దౌర్జన్యాలకు, దారుణాలకు తెగబడుతున్నారన్నారు. రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మంత్రి పరిటాల సునీత హత్యారాజకీయాలను ప్రేరేపిస్తున్నారన్నారు. మంత్రి స్థానంలో ఉంటూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం బాధాకరమన్నారు. సీనియర్ నాయకులను అంతమొందిస్తే తప్పా ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్నారని తెలిపారు. మనోహర్‌నాయుడు, శీన అనే వ్యక్తులు కుట్ర చేస్తున్నారని, వీరి వెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తముందని ఆరోపించారు. దీనిపై పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్కు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్నగర అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు పెన్నోబిలేసు, నాయకులు అమర్నాథ్రెడ్డి, యూపీనాగిరెడ్డి, రఘునాథరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల దాష్టీకం
అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. అధికారం అడ్డం పెట్టుకుని విపక్ష నేతలే లక్ష్యంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. రామగిరి మండలం పేరూరులో సుబ్బుకృష్ణ దంపతులపై దాడి ఘటన మరిచిపోక ముందే ఆదివారం ఇటు రాప్తాడులో , అటు తాడిపత్రిలో రెచ్చిపోయారు. ఓ మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులోనే ఆమె అనుచరులు భూ సమస్య నేపథ్యంలో ఇద్దరు మహిళలపై విచక్షణాæ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చారు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. క్రిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని మట్టుబెట్టిన టీడీపీ నేతలు... ఈకేసులో రాజీకి రావాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు. జేసీ సోదరుల అండతో సమయం దొరికినప్పుడల్లా వైఎస్సార్ సీపీ నేతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అప్పేచర్ల గ్రామంలోని వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లను కూల్చేసి తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించారు. రాప్తాడు: సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే మహిళలపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. బాధితుల సమాచారం మేరకు.. రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గిడ్డ మల్లయ్య తనకున్న తొమ్మిది ఎకరాల పొలం పక్కనే మరో 70 సెంట్ల ప్రభుత్వ భూమిని కూడా చదును చేసుకుని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమికి పక్కనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మిడతల శీనయ్య పొలం ఉంది. ఆ భూమిని తన భూమిలో కలుపుకునేందుకు శీనయ్య కుమారుడు శీనయ్య రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో మల్లయ్యతో రెవెన్యూ అధికారులు చర్చించారు. భూమిపై సాగు హక్కు తనకే చెల్లుతుందని మల్లయ్య వివరించాడు. గ్రామ పెద్దలు కూడా మల్లయ్యకే ఆ భూమిపై సాగు హక్కు ఉందని తేల్చి చెప్పారు. పోలీసుల జోక్యంతో.. మూడు నెలల క్రితం ఈ భూమి విషయంపై గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ కుమారుడు పసుపుల బాబయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పోలీసులు చర్చించారు. మల్లయ్యతో మాట్లాడి ఆ భూమిపై హక్కులు వదులుకునేలా చేయాలని బాబయ్యకు సూచించారు. ఇందుకు నిరాకరించి స్టేషన్ బయటకు వస్తున్న బాబయ్యను పోలీసులు అడ్డుకుని తమదైన శైలీలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈ ఘటన సంచనలమైంది. కోర్టును ఆశ్రయించి.. వరుస ఘటనలతో విసుగెత్తిన మల్లయ్య ఆ భూమికి సంబంధించి కోర్టును ఆశ్రయించి, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ శీనయ్య ఆయన కుమారులు ముగ్గురు, మరొక వ్యక్తి గోపాల్ శనివారం మల్లయ్య సాగు చేసుకుంటున్న 70 సెంట్ల ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో పాపించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆదివారం ఉదయాన కర్రలు, ఇనుప రాడ్లతో మల్లయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. స్థానికులు వెంటనే మల్లయ్యను ఇంటిలోకి నెట్టి తలుపులు వేశారు. ఆ సమయంలో మల్లయ్య ముగ్గురు కుమారులు ఇంటి దగ్గర లేరు. ఇంటి బయట పనులు చేసుకుంటున్న మల్లయ్య భార్య రామక్క, రెండో కోడలు రాధమ్మపై వారు విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన చుట్టుపక్కల వారిని కూడా చితకబాదారు. బాధితుల పరిస్థితి విషమం దాడిలో గాయపడిన వన్నక్క, రాధమ్మను సర్వజనాస్పత్రికి స్థానికులు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వన్నక్కను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, దాడి చేసిన మిడతల శీనయ్య, ఆయన ముగ్గురు కుమారులపై రౌడీ షీట్ ఉన్నట్లు పలువురు ఈ సందర్భంగా ఆరోపించారు. మూడు నెలలుగా వాదించుకుంటున్నారు ఈ విషయంపై ఎస్ఐ ధరణిబాబు వివరణ ఇస్తూ.. మల్లయ్య సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించి ఇద్దరి మధ్య మూడు నెలలుగా ఘర్షణలు ఉన్నాయన్నారు. ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి రెవెన్యూ అధికారుల సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయినా వారు వినకుండా ఘర్షణ పడుతూ వచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఇరువర్గాల మహిళలు కొట్టుకున్నట్లు, ఒక వర్గం వారికి గాయాలైనట్లు సమాచారం అందిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. -
పరిటాల అనుచరుడి ఇంటిపై తమ్ముళ్ల దాడి
పెట్రోల్ పోసి నిప్పంటించిన టీడీపీ నేతలు మంత్రి సునీత ప్రాబల్యం తగ్గించేందుకేనంటున్న పరిశీలకులు అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ఇంత కాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు నేడు ప్రత్యక్ష దాడులకు దారి తీశాయి. పార్టీలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆమె ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. ఆమె వర్గీయులపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతోంది. ధర్మవరం : ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వర్గీయుడి ఇంటిపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. తమ నేత ఆదేశించినా వినకుండా సామూహిక వివాహాలకు హాజరయ్యాడన్న ఏకైక కారణంతోనే ఈ దాడి చోటు చేసుకున్నట్లు బాధితుడు వాపోయాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురం, ధర్మవరంలోని సత్యసాయి నగర్‌కు చెందిన టీడీపీ నేత సురేష్‌నాయుడు ముందు నుంచి పరిటాల రవికి సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. రవి అనంతరం ఆయన భార్య సునీతకు వెన్నంటే ఉంటూ ఆమె వర్గీయుడిగా ముద్ర వేసుకున్నారు. కాగా, గత నెల 21న రామగిరి మండలంలో పరిటాల సునీత కుటుంబం చేపట్టిన ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాలను నిర్వీర్యం చేయడం ద్వారా ఆమె ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు ధర్మవరానికి చెందిన ఓ ప్రముఖ టీడీపీ నేత పావులు కదిపారు. ఇందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గం నుంచి వివాహ కార్యాక్రమాలకు ఎవరూ వెళ్లరాదంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే సునీత వర్గీయుడిగా ముద్ర వేసుకున్న సురేష్‌నాయుడు మాత్రం ఆ హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉచిత వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి నుంచి అతనిపై ప్రత్యర్థి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. ఇదే విషయాన్ని బాధితుడు ధ్రువీకరించారు. ‘పరిటాల వర్గీయుడిగా ఈ ప్రాంతంలో నాకు గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని స్థానిక ప్రజాప్రతినిధి కక్ష కట్టి వేధిస్తున్నాడు. గత నెలలో సునీత నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరయ్యాను. ఈ విషయంలో వారు మరింత కక్ష పెంచుకున్నారు. అదే రోజు నా ద్విచక్ర వాహనాన్ని వారు ధ్వంసం చేశారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దీనిపై మరింత కక్ష పెంచుకున్న వారు ఆదివారం రాత్రి మా ఇంటి గుమ్మం ఎదుట పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయాన్ని గుర్తించి, వెంటనే మంటలు ఆర్పివేశాం. ప్రధాన ద్వారం పాక్షికంగా కాలింది. ఇంటి బయట ఉన్న వస్తువులు కాలిపోయాయి.’ అంటూ సురేష్‌నాయుడు వివరించారు. ఘటనపై పలువురిపై బాధితుడి ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ భాస్కరగౌడ తెలిపారు. -
'నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు'
కర్నూలు: కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ లను ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ-పాస్ విధానంలో టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అందరికి చంద్రన్న కానుకలు అందేలా చూస్తామన్నారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ మంత్రులు, టీడీపీ నాయకులు శనివారం క్యూ కట్టారు. ఏపీ మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, మృణాళిని, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రేవంత్‌రెడ్డితో పాటు సీఎం రమేష్ తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించు కున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశానే. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
చేతగాని మంత్రులు రాజీనామా చేయాలి
సీపీఐ రైతు సంఘం నాయకుల డిమాండ్ అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ జిలాల మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులోని విత్తన పంపిణీ కేంద్రం వద్ద గురువారం సంఘం జిల్లా కార్యదర్శి కాటమయ్య ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 3.28 లక్షలు క్వింటాళ్లు కేటాయించినా కనీసం 2 లక్షల క్వింటాళ్లు కూడా పంపిణీ చేయకుండానే కార్య క్రమాన్ని ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైందని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా కొనసాగడం కన్నా రాజీనామా చేయడం మేలన్నారు. వర్షాలు కురుస్తున్న క్రమంలో రెండో విడత, మూడో విడత విత్తన పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవరెడ్డి, రఘురామయ్య, నాగరాజు, వెంకటనారాయణ, వెంకటేష్‌నాయక్, సీపీఐ నాయకులు మస్తాన్, ఎర్రిస్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మాకు చెప్పకుండా.. బదిలీలా..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో శనివారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత భేటీ అయ్యారు. ఈ భేటీలో అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఎస్ఐ, సీఐలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపిన విషయంపై సునీత హోం మంత్రితో చర్చించినట్టు తెలిసింది. ఈ విషయంలో తమకు తెలియకుండా తమ సొంత నియోజకవర్గంలో అధికారులను ఎలా బదిలీ చేస్తారంటూ చినరాజప్ప ఎదుట ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత కోరినట్టు సమాచారం.