
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. కోనేటి నాయుని పాళ్యంలో అంజి అనే వ్యక్తి బాలింతపై అత్యాచార యత్నం చేసి, ఆమె ప్రతిఘటించడంతో ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతని తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు అంజి వెంకటాపురంలోని పరిటాల సునీత ఇంట్లో తలదాచుకున్నాడని, విషయం తెలిసీ పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment