
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు.
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు.
అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్‌ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు.