హోంమంత్రిని అడ్డుకున్న మహిళలు | womens are stopped home minister chinarajappa in eastgodavari district | Sakshi
Sakshi News home page

హోంమంత్రిని అడ్డుకున్న మహిళలు

Published Sun, Sep 20 2015 4:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

హోంమంత్రిని అడ్డుకున్న మహిళలు

హోంమంత్రిని అడ్డుకున్న మహిళలు

సామర్లకోట: గ్రామంలో జనావాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు అడ్డుకున్నారు. మంత్రి చినరాజప్ప ఆదివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు వెళ్లారు. దీంతో మహిళలు ఆయన్ను అడ్డుకుని బ్రాందీ షాపును అక్కడి నుంచి తరలించాలని ఆయనను డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయంపై స్పందించిన హోంమంత్రి ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. పది రోజుల్లో షాపును అక్కడి నుంచి తరలిస్తామని అధికారులు చెప్పడంతో ఆ మేరకు చినరాజప్ప వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement