తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప బంధువునని చెప్పుకుని అవినాష్ చేసిన ఆగడాలపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తహం చేసింది.
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప బంధువునని చెప్పుకుని అవినాష్ చేసిన ఆగడాలపై రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తహం చేసింది. పత్రికలు, టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలను చూసిన మానవ హక్కుల సంఘం దీనిని సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, డీజీపీలకు మంగళవారం నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ ఆరోతేదీలోగా నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల సంఘం వారందరికి సూచించింది.
(చదవండి:: ఇదేందప్పా.. రాజప్పా)