
అమలాపురం టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మళ్లీ పెద్దాపురం నుంచి పోటీ చేస్తానని చెబుతూనే, అక్కడ టికెట్ బొడ్డు భాస్కర రామారావు అడుగుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు అన్నారు. పెద్దాపురం కాకపోతే రాజప్పకు కోనసీమలోని ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాలు ఉన్నాయని, ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేసి తన సత్తా చాటు కోవాలని సూచించారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో తన వెనుక ఎంత మంది కాపులు ఉన్నారో కూడా ఆయన రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
అమలాపురంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి జలాలను కృష్ణా గోదావరిలో కలిపేందుకు భూసేకరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టు దోచుకోవడానికేనని చినబాబు అన్నారు. చంద్రబాబు ఏ ప్రాజెక్టు తలపెట్టినా తన కోటరీ బాగుపడేందుకేనని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని మోదీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ మరో సభ్యుడు ఆర్‌వీ నాయుడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment