'సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు' | no relation in callmoney case accused of satyanand bail | Sakshi
Sakshi News home page

'సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు'

Published Wed, Dec 30 2015 2:04 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

'సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు'

'సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు'

కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంతో సంబంధాలుంటే ఎంతటి వారినైనా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

గుంటూరు: కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంతో సంబంధాలుంటే ఎంతటి వారినైనా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్ మనీ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న సత్యానంద్ బెయిల్ వ్యవహారంతో మాకు సంబంధం లేదని మంత్రి పేర్కొన్నారు.

సెక్స్ రాకెట్ వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చినరాజప్ప హామీ ఇచ్చారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ విదితమే. ఈ కేసుతో సంబంధం ఉన్న సత్యానంద్కు బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement