నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ అవలంభిస్తున్న వైఖరితో కుడికాలువ కింద ఆయకట్టు ఉన్న మూడు జిల్లాల రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని..
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ అవలంభిస్తున్న వైఖరితో కుడికాలువ కింద ఆయకట్టు ఉన్న మూడు జిల్లాల రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. విభజన చట్ట ప్రకారం నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉన్నప్పటికీ తెలంగాణ అడ్డుపడటం శోచనీయమన్నారు.
ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. సాగర్ కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయడానికి ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు రాకుండా గేట్లకు తాళాలు వేయడం, పోలీసులను మోహరించడం సరైన చర్య కాదని చినరాజప్ప పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులూ సంయమనం పాటించి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు.