
సాక్షి, తూర్పుగోదావరి : అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు శనివారం మంత్రులు అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పలను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ బాధలను మంత్రులకు చెప్పుకున్నారు.
దీంతో అయ్యన్న పాత్రుడు వారిపై విరుచుకుపడ్డారు. అంతేకాక మమ్మల్ని అడిగి డబ్బులు కట్టారా అని మంత్రి ప్రశ్నించారు. ఆ డబ్బు మొత్తం చంద్రబాబు ఇవాలా అని ఆయన అన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేవారు. వెంటనే అక్కడే ఉన్న హోంమంత్రి చిన్నరాజప్ప జోక్యం చేసుకున్నారు. అంతేకాక బాధితులు ఆగ్రహించడంతో వారికి చినరాజప్ప సర్ది చెప్పారు. దీంతో సమస్య కొంత వరకూ తగ్గుముఖం పట్టంది. గత కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని అధికార పార్టీని కోరుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment