మావోయిస్టులతో చర్చలకు సిద్ధం: హోం మంత్రి | Nimmakayala Chinna Rajappa takes charge as Andhra pradesh Home Minister | Sakshi
Sakshi News home page

మావోయిస్టులతో చర్చలకు సిద్ధం: హోం మంత్రి

Published Sun, Jun 22 2014 9:30 AM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM

Nimmakayala Chinna Rajappa takes charge as Andhra pradesh Home Minister

జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప పిలుపునిచ్చారు. మావోయిస్టులతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మహిళల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫైల్పై చినరాజప్ప సంతకం చేశారు.

 

అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికడతామని తెలిపారు. శేషాచల అడవుల్లో యథేచ్చగా సాగుతున్న స్మగ్లింగ్ను కట్టడి చేయడమే కాకుండా స్మగ్లర్లను పూర్తిగా నిర్మూలిస్తామని వెల్లడించారు. ఈ సందర్బంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు, టీడీపీ నాయకులు చినరాజప్పను కలసి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement