కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్‌ జగన్‌ ఆరా | ysrcp worker suicide in east godavari: ys jagan phone call to kannababu | Sakshi
Sakshi News home page

కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్‌ జగన్‌ ఆరా

Published Mon, Jul 10 2017 8:10 PM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్‌ జగన్‌ ఆరా - Sakshi

కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్‌ జగన్‌ ఆరా

హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లాలో  పార్టీ కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు సోమవారం వైఎస్‌ జగన్‌ ఫోన్‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై  పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమాచారాన్ని సేకరించారు.

కాగా పెద్దపూడి మండలం సహపురంలో వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్త సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వేధింపుల కారణంగానే అతడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. మరోవైపు సత్యనారాయణ మృతదేహంతో పార్టీ శ్రేణులు ఇవాళ కైకవోలు సెంటర్‌ వద్ద  ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో పార్టీ కార్యకర్తలతో పాటు కురసాల కన్నబాబు, సూరినారాయణరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అయితే వైఎస్‌ఆర్‌ సీపీ ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement