నగరంలోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది.
గాంధీలో మరో స్వైన్‌ఫ్లూ కేసు
Published Mon, Oct 3 2016 7:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన సత్యనారాయణ (36) తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ నగరంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీస్ఫెషాలిటీ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం చేరాడు. స్వెన్‌ఫ్లూ లక్షణాల కనిపించడంతో రక్తనమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా నివేదికలో స్వెన్‌ఫ్లూ గా తేలింది. దీంతో మరింత మెరుగైన వైద్యసేవల కోసం అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. సత్యనారాయణకు డిజాస్టర్‌వార్డులో ప్రత్యేక వైద్యచికిత్సలు అందిస్తున్నామని సంబంధిత వైద్యులు తెలిపారు. డెంగీ కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయని, ప్రస్థుతం గాంధీ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.
ఏడాదిలో ఆరుగురు మృతి
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు రోగులు స్వెన్‌ఫ్లూతో మృతి చెందారు. జనవరి నెల నుంచి ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 14 స్వెన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా ఏడుగురు డిశ్చార్జీ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. ఒక రోగి చికిత్స పొందుతున్నాడు. చివరి స్టేజ్‌లో ఇతర ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై వచ్చినవారే మృతి చెందారని, ముందుగానే గాంధీ ఆస్పత్రిలో చేరిన వారంతా డిశ్చార్జీ అయ్యారని సంబంధిత వైద్యులు వివరించారు.
Advertisement
Advertisement