ముథోల్ మండలం బాసర గ్రామంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ముథోల్ మండలం బాసర గ్రామంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 500 మంది విద్యార్థులకు గాను 452 మంది హాజరయ్యూరు. ఈ ప్రక్రియను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు హాజరు కావడంతో కళాశాల ఆవరణలో సందడి నెలకొంది. విద్యార్థితోపాటు మరొకరికి యూనివర్సిటీ తరఫున ఉచిత భోజన సదుపాయం కల్పించారు. బ్యాంకు చలాన్ల కోసం భారీ సంఖ్యలో బారులు తీరారు. యూనివర్సిటీ అధికారులు రెండే కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురయ్యారు.