basra
-
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
బాసరలో పదో శతాబ్ది శాసనం
సాక్షి, హైదరాబాద్: సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో కొత్త శాసనం వెలుగు చూసింది. ఇది 10వ శతాబ్దికి చెందినదని భావిస్తున్నారు. ఒక విశ్రాంతి వసతి, ఇళ్ల నిర్మాణం చేపట్టిన కార్యక్రమానికి చెందిన శాసనంగా పరిశోధకులు గుర్తించారు. బాసర గ్రామ సమీపంలోని దస్తగిరి గుట్ట మీద పెద్ద గుండుపై ఈ శాసనం చెక్కి ఉంది. స్థానిక యువకులు రమేశ్, యోగేశ్, ఆనంద్ తదితరుల ద్వారా సమాచారం అందుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దాన్ని పరిశీలించారు. కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడైన రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయుని పేరు ఇందులో కనిపిస్తోందని, సత్యాశ్రయునికి ఇరవ బెడంగ, సట్టి, సట్టిగ అనే పేర్లు కూడా ఉన్నాయని శాసనాన్ని పరిష్కరించిన శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. బసది, నివాసాల కోసం ఈ శాసనాన్ని వేయించినట్టు తెలుస్తోందని తెలిపారు. అందులో రామస్వామి అన్న పేరు కనిపిస్తోందని, అప్పట్లో ఆయన న్యాయాధికారి అయ్యుంటాడని భావిస్తున్నట్టు వెల్లడించారు. దిగువన త్రిశూలం గుర్తు ఉన్నందున, ఆ రాజు శైవ ఆరాధకుడై ఉంటాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
పాత ఈవో ఆదేశాల మేరకే..!
సాక్షి, మంచిర్యాల: బాసర నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండకు సరస్వతి అమ్మవారి విగ్రహం తరలించిన ఉదంతంలో పెద్ద హస్తాలే ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకొండలోని పాఠశాలలో అక్షరాభ్యాసం చేయించేందుకు బాసర నుంచి విగ్రహం తీసుకెళ్లాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరి ఆదేశాలతో అంత దూరం పూజారులు వెళ్లారనే విషయాన్ని దాస్తున్నట్లు తెలుస్తోంది. దేవరకొండలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమానికి గతంలో బాసర ఈవోగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం. వెంకటేశ్వర్లు హాజరయ్యారు. దేవరకొండలోని బచ్పన్ పాఠశాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉన్న ఆయన కోరిక మేరకే అమ్మవారి విగ్రహం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన పేరు బయటకు రాకుం డా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ఆలయ అర్చకులపై వేటుతో సరా? ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్శర్మలు దేవరకొండలోని రెండు ప్రైవేటు పాఠశాలల్లో అక్షరాభ్యాసం చేయించేందుకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు ప్రచారం జరగడంతో దేవాదాయ శాఖ స్పందించింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆలయ పరిచారకుడు విశ్వజిత్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అసలు వ్యక్తిని వదిలి పూజారులను బలి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఈవో ఏం చేస్తున్నట్లు? బాసర ఈవోగా ప్రస్తుతం ఎ. సుధాకర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు తెలియకుండా పూజారులే విగ్రహాన్ని దేవరకొండ తీసుకెళ్లారా అన్నది ప్రశ్న. తాను కొత్తగా వచ్చానని, దేవాలయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, పూజారులకే తెలుసని ఆయన చెబుతుండడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. అర్చకులను బలి చేసే విషయంలో ఓ టీఆర్ఎస్ నేత పూర్తిస్థాయిలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆలయంలో దేవతా మూర్తులతో పాటు ఉత్సవ విగ్రహాల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించే సూపరింటెండెంట్ గిరిధర్ ఉత్సవ విగ్రహాలు ఎక్కడికీ పోలేదని, స్టోర్‌రూంలోనే ఉన్నాయని చెబుతున్నారు. పూజారులు భక్తులు సమర్పించిన విగ్రహాలనే దేవరకొండ తీసుకెళ్లారని చెబుతుండడం గమనార్హం. ఏది ఏమైనా, ఆలయం నుంచి అమ్మవారి విగ్రహం తరలింపు వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని తేల్చాలని భక్తులు కోరుతున్నారు. -
బాసర అమ్మవారి ఆదాయం రూ. 49 లక్షలు
బాసర(నిర్మల్): బాసరలో కొలువు దీరిన శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తైంది. గత 50 రోజుల్లో అమ్మవారి హుండీకి రూ. 49,79,327 నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు 13 విదేశీ కరెన్సీ నాణాలు కూడా ఉన్నాయి. -
పోటెత్తిన వర్గల్ విద్యాధరి
-
భక్తులతో కిటకిటలాడిన బాసర
ముథోల్ మండలం బాసరలోని సరస్వతీ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసం, వరుస సెలవులు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. 30 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 1,75 మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. రూ.11 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయూధికారులు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
గోదావరిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా బాసరలో శుక్రవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన యువకుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. ఇది గుర్తించిన గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి పోలీసులకు అప్పగింఆచరు. -
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రశాంతం
ముథోల్ మండలం బాసర గ్రామంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 500 మంది విద్యార్థులకు గాను 452 మంది హాజరయ్యూరు. ఈ ప్రక్రియను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు హాజరు కావడంతో కళాశాల ఆవరణలో సందడి నెలకొంది. విద్యార్థితోపాటు మరొకరికి యూనివర్సిటీ తరఫున ఉచిత భోజన సదుపాయం కల్పించారు. బ్యాంకు చలాన్ల కోసం భారీ సంఖ్యలో బారులు తీరారు. యూనివర్సిటీ అధికారులు రెండే కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురయ్యారు. -
డేంజర్ జోన్స్
♦ అడుగడుగునా మృత్యుఘంటికలు ♦ ప్రాణాలు బలిగొంటున్న మూలమలుపులు ♦ కాగితాల్లోనే ఫోర్‌లేన్ రహదారి బాసర మహాపుణ్య క్షేత్రం. చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించుకోవడానికి,అక్షరాభ్యాసం కోసం నిత్యం వేలాది మంది భక్తులు, వందలాది వాహనాల్లో రాత్రిపగలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లావాసులు మినహా మిగతా తెలంగాణలోని మొత్తం జిల్లాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా నిజామాబాద్ జిల్లా మీదుగానే బాసరకు వెళ్లాలి. రహదారులు ఇరుకుగా, అధికంగా మూలమలుపులు ఉండటం, కాల్వలు, కల్వర్టులు, ఎత్తుపళ్లాలు ప్రమాదకరంగా ఉన్నారుు. ఫలితంగా ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మార్గంలో ప్రమాదం జరగని గ్రామం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. జానకంపేట నుంచి యంచ వరకు రూ.50 కోట్ల వ్యయంతో ఫోర్‌లేన్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. కానీ, మోక్షం లభించలేదు. ఫోర్‌లేన్ రహదారి పూర్తరుుతే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నవీపేట : దక్షిణ భారతంలో సరస్వతి అమ్మవారు కొలువైన ఏకైక ఆలయం ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది వెళ్తుంటారు. ప్రత్యేక రోజుల్లో లక్షలాది మంది సరస్వతి మాతను దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ప్రధాన మార్గం నవీపేట మీదుగా వెళుతుంది. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. రోజూ వందలాది వాహనాలు వెళ్తున్నాయి. బాసరకు రైలు మార్గం ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో భక్తులు రహదారి వెంబడే వస్తున్నారు. ఈ దారిలో ఎన్నో మూలమలుపులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదకర మలుపులు.. బాసర పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు అక్కడి వరకు విస్తరించుకున్న రహదారి వెంబడి ఉన్న మలుపులు భయానికి గురి చేస్తున్నాయి. నిజామాబాద్, జానకంపేటలను దాటాక నవీపేట మండలంలోని అబ్బాపూర్(ఎం), అభంగపట్నం, నవీపేట, నాగేపూర్, ఫకీరాబాద్, మిట్టాపూర్, యంచల మీదుగా బాసరకు ప్రధాన రహదారి ఉంది. నవీపేట మండలంలోని వివిఈ గ్రామాల వద్ద మలుపులున్నాయి. ఈ మలుపుల వద్దే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూలమలుపులను గమనించే సరికే ప్రమాదం జరిగిపోతోంది. రహదారి వెంబడి ఉన్న అన్ని గ్రామాల పరిధిలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయాలపాలయ్యారు. ఫలానా ఊరు దగ్గర ప్రమాదమే జరగలేదు అన్న గ్రామమే లేదు. నవీపేట, నాగేపూర్, మిట్టాపూర్లలో.. ప్రధానంగా నవీపేట, నాగేపూర్, మిట్టాపూర్లలోని మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని మలుపుల వద్ద ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలబారిన పడుతున్నారు. నాగేపూర్ మూల మలుపు మరింత డేంజర్‌గా మారింది. ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో.. ఈ దారిపై అవగాహనలేని డ్రైవర్లు వాహన వేగాన్ని అదుపు చేయలేకపోతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురెదురుగా వాహనాలు అంతే వేగంతో వస్తే రక్తపుటేరులు పారుతున్నాయి. ఇటీవల నాగేపూర్ మూలమలుపు వద్ద రెండు వేరువేరు ప్రమాదాలలో అయిదుగురికి మించి ప్రాణాలు కోల్పోయారు. నవీపేట మూలమలుపు వద్ద వాహనాలను అదుపు చేసే ప్రయత్నంలో భారీ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరైనా ఉంటే అంతే.. మిట్టాపూర్ దగ్గర రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండడంతో అవతలి వైపు నుంచి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటవాలు వైపు దిగే ప్రయత్నంలో వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. బైక్‌లపై వచ్చే భక్తులు పదుల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. కాలువలు, కల్వర్టులతో.. బాసర రహదారి వెంబడి నిజాంసాగర్ ప్రధాన, ఉప కాలువలు ఉన్నాయి. నవీపేటలో రహదారికి సమాంతరంగా డి -50 ప్రధాన కాలువ ఉండగా.. మిగిలిన ప్రాంతాలలో ఆ కాలువ ఉప కాలువలు, కల్వర్టులు ఉన్నాయి. రోడ్డు కింది నుంచి కాలువలు ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా కల్వర్టులు నిర్మించారు. ఎదురుగా భారీ వాహనాలు వస్తే.. రోడ్డు దిగే ప్రయత్నం చేయగా వాహనదారులు ఈ కల్వర్టులను ఢీకొని ప్రమాదాలబారిన పడుతున్నారు. మూడేళ్ల క్రితం నాగేపూర్ శివారులో కల్వర్టును ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అలాగే ఏడేళ్ల కిందట బాన్సువాడ నుంచి నవీపేట వైపు వస్తున్న ఆటో అబ్బాపూర్(ఎం) దగ్గర కాలువలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ కాలువల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరికల బోర్డు, స్పీడ్ బ్రేకర్లు లేవు. అభంగపట్నం, అబ్బాపూర్(ఎం) గ్రామాలలోనూ స్పీడ్ బ్రేకర్లు లేవు. ట్రాఫిక్ సమస్య.. బాసర భక్తులకు మూలమలుపులు ప్రమాదాలను తెచ్చిపెడుతుండగా.. మండల కేంద్రంలోని రైల్వేగేటు, మేకల సంతలు ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు నవీపేటలో గేటు పడితే ఐదారు నిమిషాలు ఆగాల్సిందే. రైళ్ల రాకపోకలు పెరగడంతో ఒక్కోసారి క్రాసింగ్ ఉంటుంది. అప్పుడు పదినిమిషాల వరకు ఆగాల్సి వస్తుంది. రైలు వెళ్లగానే గేటుకు ఇరువైపులా ఆగిన వాహనదారులు ఒక్కసారిగా ముందుకు వెళ్లేందుకు పోటీపడుతున్నారు. ఈ సమయంలో ఒక్కోసారి స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే మండల కేంద్రంలోని బాసర రహదారికి ఆనుకుని ప్రతి శనివారం మేకల సంత జరుగుతుంది. ఆ సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి సంత ప్రాంగణాన్ని నవీపేట శివారులోని ఆశానగర్కు తరలించాలని గతంలో కలెక్టర్‌గా పనిచేసిన క్రిస్టీనా జెడ్ చోంగ్తూ జారీ చేసిన ఆదేశాలు బుట్టదాఖలే అయ్యాయి. ఈనెలాఖరు నాటికి టెండర్లు పూర్తి.. - గోపాల్ రెడ్డి, డీఈఈ, ఆర్అండ్బీ, బోధన్ యంచ నుంచి ఫకీరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్డు వేస్తాం. దానికి నిధులు మంజూరయ్యాయి. అన్ని సర్వేలు పూర్తయ్యాయి. జాతీయ రహదారికి ప్రతిపాదనలు పంపడంతో ఆలస్యమైంది. ఈనెల చివరికల్లా టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెలలో పనులను ప్రారంభిస్తాం. వర్షాలు ఆటంకం కలిగించకుంటే సకాలంలో పనులు పూర్తి చేస్తాం. కల్వర్టులు వెడల్పు పెంచుతాం. అన్ని మలుపుల వద్ద హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు - వెంకటేశ్వర్రావు, నిజామాబాద్ రూరల్ సీఐ బాసర రహదారి వెంబడి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్అండ్బీ శాఖ అధికారులతో సమీక్షిస్తాం. రహదారి వెంట ఉన్న ముళ్ల పొదలను తొలగిస్తాం. గుంతలను పూడ్చివేయిస్తాం. ఓవర్ టేక్‌ల విషయంలో వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. రహదారి వెంట రాత్రింబవళ్లు పోలీస్ పహారా ఉంటుంది. వాహనదారులు పోలీసులకు సహకరించాలి. నాలుగు లేన్ల రోడ్డుకు మోక్షమెప్పుడో? జానకంపేట నుంచి యంచ వరకు రూ. 50 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో రహదారి పక్కన ఉన్న దుకాణ సముదాయాలకు హద్దులను నిర్ధారించారు. నాలుగు లేన్ల రోడ్డుతో ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే జాతీయ రహదారిని ఇదే రోడ్డు వెంబడి విస్తరించాలనే ప్రతిపాదన ఉండడంతో ఈ పనులకు ఇంతకాలం మోక్షం లభించలేదు. కానీ మెదక్ - బాన్సువాడ - బోధన్- ఫకీరాబాద్ మీదుగా భైంసాకు జాతీయ రహదారి ఖరారయ్యింది. దీంతో ఇకనైనా పనులు ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. ♦ ఏడాది కాలంలో నవీపేట మండలంలో జరిగిన ప్రమాదాల వివరాలిలా ఉన్నాయి. ♦ 2015 జూన్ 17న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో గడ్చాందకు చెందిన యువకుడు మృత్యువు పాలయ్యాడు. ♦ 2015 సెప్టెంబర్ 16న అభంగపట్నం శివారులో జరిగిన ప్రమాదంలో ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్‌లో పని చేసే ఇద్దరు యువకులు మృతి చెందారు. ♦ 2015 అక్టోబర్ 14న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో భైంసాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అకాల మరణం పొందారు. ♦ 2015 నవంబర్17న నవీపేట శివారులో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ♦ 2016 మార్చి 24న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో మండలంలోని మద్దెపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ♦ 2016 ఏప్రిల్ 29న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ధర్మాబాద్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ♦ 2016 జూన్ 7న ఫకీరాబాద్ దగ్గర ట్రాలీ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు. ♦ 2016 జూన్ 8న ఫకీరాబాద్ దగ్గర జరిగిన లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
సరస్వతీ మాతకు ముక్కుపుడక కానుక
బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు ముక్కుపుడకను కానుకగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సుద్దాల శ్రీనివాస్, లావణ్య దంపతులు శుక్రవారం రూ.40వేల విలువైన బంగారు ముక్కుపుడకను ఆలయంలో అందజేశారు. ఆలయ అధికారులు వారితో ప్రత్యేక పూజలు చేయించారు. -
బాసరలో ఏడారిగా మారిన గోదావరి
నిండుకుండలా ఉండే గోదావరి ఏడారిగా మారడంతో ఆదిలాబాద్ జిల్లా బాసరకు నీటి కరువు ఏర్పడింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేద్దామన్నా చుక్క నీరు లేదు. దీంతో అధికారులు భక్తుల స్నానాల కోసం షవర్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ సిబ్బంది ఏడారిగా మారిన గోదావరి ప్రాంతంలో బోర్లు వేయించి పైపులైన్ల ద్వారా ఆలయానికి, ఐఐఐటీ విద్యార్థులకు, బాసర వాసులకు తాత్కాలికంగా నీటిని సరఫరా చేస్తున్నారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ముహూర్తం మంచిగా ఉండడంతో అక్షరాభ్యాసాల కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రానికి సుమారు 10వేల మంది జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అక్షరాభ్యాసాలు కూడా భారీగానే జరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసరలో యనమల మనవరాలికి అక్షరాభ్యాసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి మనవరాలికి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో సోమవారం అక్షరాభ్యాసం జరిగింది. యనమల దంపతులు, వారి కుమార్తె కృష్ణ సాహిత్య, అల్లుడు మహేష్, మనవరాలు సృష్ణి వైష్ణవి (3) కి అక్షరాభ్యాసం చేయించారు. యనమల తో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు సుధాకర్ యాదవ్ దంపతులు కార్యక్రమం లో పాల్గొన్నారు. సృష్ణి వైష్ణవి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వేద పండితులు శ్రీనివాస్, సంజీవ్ నిర్వహించారు. అనంతరం మంత్రి యనమల గోదావరి నదిని పరిశీలించారు. అమరావతి నిర్మాణ స్థూపం కోసం గోదావరి నీటిని, మట్టిని స్థానిక టీడీపీ నాయకులు సేకరించి యనమలకు ఇచ్చారు. -
బాసర వద్ద గోదావరి జలకళ
ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గురువారం గోదావరి నిండుకుండను తలపించింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదలడంతో.. రెండ్రోజుల క్రితం వరకు నీరు లేక బోసిపోయి కనిపించిన గోదావరి ఇప్పుడు నీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం నీరు పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. - బాసర -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
* పేద విద్యార్థులకు సదవకాశం * దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం భైంసా : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్ఐటీ బాసరలో ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన పల్లె విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్యన ందించే లక్ష్యంతో ఆర్జేయూకేటీ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి జూన్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 85 శాతం సీట్లు, 15శాతం అన్రిజర్డ్వ్ సీట్లను కేటాయించారు. దరఖాస్తు చేసుకునే విధానం... ట్రిపుల్‌ఐటీలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ప్రక్రియలో ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ www.rgujt.inలో adm issions2015.rgukt.in ద్వారా అప్లికేషన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రతి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలంలో అడిగే వివరాలు పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్ పేరును నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని పదో తరగతి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, రూ.150 విలువ గల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒరిజినల్ జత పరిచి, రిజిస్ట్రార్ ట్రిపుల్ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు రిజిస్ట్రార్ ద్వారా లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. వెనుకబడిన విద్యార్థులు రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తే సరిపోతుంది. జీపీఏ సమానంగా ఉంటే... దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒకేరకమైన పాయింట్లు ఉన్న వారు వేలల్లో ఉంటారు. అలాంటప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటిప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా సమానంగా ఉంటే భౌతికశాస్త్రం.. అప్పు డూ సమానమైతే రసాయనశాస్త్రం చివరగా ఆంగ్లం మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఎక్కువ మంది సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం తర్వాత... ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆరేళ్ల కోర్సు ఉంటుంది. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు అవకాశాలు వస్తే బయటకు వెళ్లిపోవచ్చు. వారికి పీయూసీ ఉత్తీర్ణత పత్రం ఇస్తారు. మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్య ఉంటుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సును సెమిస్టార్ విధానం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్‌లో ఆర్జీయూకేటీ సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తోంది. పీయూసీలో సాధించిన మార్కులే బీటెక్‌లో కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. ట్రిపుల్‌ఐటీల ప్రధాన లక్ష్యం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు ఇక్కడే పూర్తిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. బోధన రుసుము.. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ట్రిపుల్ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా విద్యా, వసతి కల్పిస్తుంది. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక అది విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తారు. లక్ష ఆదాయం దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి రూ.36 వేలు బోధన రుసుము చెల్లించాలి. మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టు... బీటెక్‌లో ప్రవేశించాక విద్యార్థులు ఆరు శాఖల్లో ఒక దానిని ప్రధాన(మేజర్) సబ్జెక్టుగా ఎంచుకుంటారు. దీంతోపాటు తప్పని సరిగా విద్యాంతర నైపుణ్యాలు పొందేందుకు మైనర్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో సంగీతం, నృత్యం, హ్యూమానిటిస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటి వాటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా యూనివర్సిటీ మైనర్ డిగ్రీని విద్యార్థులకు ప్రదానం చేస్తుంది. ప్రవేశానికి అర్హతలు... పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2015 సంవత్సరంలో రెగ్యూలర్ విద్యార్థులుగా మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. డిసెంబర్ 31, 2015 నాటికి 18 ఏళ్ల వయసు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచి పాయింట్లు ఉండవు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వడపోతను ఆరంభిస్తారు. అనంతరం పదో తరగతి జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లను పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన విద్యార్థులకు ఉత్తరాలు, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. -
బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆదిలాబాద్ జిల్లా: బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భరంగా భక్తుల రద్దీ పెరిగింది.అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. -
సరస్వతీ నమోనమః
భక్తులతో పోటెత్తిన బాసర ⇒ వైభవంగా వసంతపంచమి వేడుకలు ⇒ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ⇒ మొక్కులు తీర్చుకున్న భక్తులు ⇒ సుమారు 50వేల మంది రాక ⇒ 2,128 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు భైంసా/బాసర : చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం బాసరలో శ్రీపంచమి(వసంత పంచమి) వేడుకలు శనివారం అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, కలెక్టర్ దంపతులు, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని భక్తులు శనివారం వేకువజాము నుంచి దర్శనానికి బారులు తీరారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. వేకువజామున 3గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపించింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని శివాలయంలో పూజలు చేశారు. గోదావరమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చారు. చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ, మహాంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. పక్కనే ఉన్న వ్యాసమహార్షి ఆలయంలోనూ పూజలు చేశారు. చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిపించారు. వసంత పంచమి కావడంతో పెద్ద మొత్తంలోనే అక్షరాభ్యాస పూజలు జరిగాయి. చిన్నారులు, వారి కుటుంబ సభ్యులతో అక్షరాభ్యాస మండపాలు కిక్కిరిసిపోయాయి. మండపాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. ప్రసాద కౌంటర్లు, అభిషేకం టికెట్లు తీసుకునే కౌంటర్, అక్షరాభ్యాస టికెట్లు ఇచ్చే కౌంటర్ల వద్ద బారులు తప్పలేదు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండుగా కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. రూ.100 అక్షరాభ్యాస మండపంలో 1,077 మంది చిన్నారులకు, రూ.1000 అక్షరాభ్యాస మండపంలో 1,051 మంది చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు జరిగాయి. 106 రుద్రాభిషేకం, 939 మండప ప్రవేశం, 875 ప్రత్యేక దర్శనం టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రసాదాలు, అతిథిగృహాలు, అక్షరాభ్యాసాలు ఇతర ఆదాయం కలిపి రూ. 15.50 లక్షల మేర వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు పూలతో అలంకరణ వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆలయ గర్భగుడిని పూలతో అలంకరించారు. గర్భగుడి ప్రాంగణమంతా అరటి చెట్లతో అలంకరించారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సెట్టింగు వేశారు. అక్షరాభ్యాస మండపాలను పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వీఐపీలకే గదులు వసంత పంచమి రోజున ఆలయంలో గదులను వీఐ పీలకే కేటాయించారు. సాధారణ భక్తులకు వసతి కో సం గదులు దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక ప్రైవే టు లాడ్జిలను ఆశ్రయించారు. ఏసీ, నాన్ఏసీ గదులను ఎవరికీ ఇవ్వలేదు. భక్తుల తాకిడి పెరగడంతో వసతి కష్టాలు వెంటాడాయి. చలికాలం కావడంతో వచ్చిన వారంతా వసతి కోసం ఇబ్బందులు పడ్డారు. భక్తుల సేవలో.. బాసర ఆలయానికి వసంతపంచమి సందర్భంగా శనివారం రోజు 50 వేల మేర భక్తులు వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల ఎన్సీసీ వాలంటీర్లు సేవలు అందించారు. జిల్లా పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాసర వెలమ సంఘం ఆధ్వర్యంలో వరుసలో ఉన్న చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. క్యూలైన్లలో భక్తులకు నీటి ప్యాకెట్లు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బలరాం పులిహోరా పంచిపెట్టారు. వాహనాలను అనుమతించలేదు... ఆలయ ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆలయానికి కొద్దిదూరంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపివేయించారు. బాసర వచ్చే బస్సులను బస్టాండ్ వద్దే నిలిపి వేయించారు. ఆలయంలోకి బస్సులను అనుమతించలేదు. రైలు, బస్సుమార్గాల ద్వారా వచ్చిన భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. -
అమ్మవారికి శఠగోపం
బాసర : ‘లక్ష్మీ కొందరిది.. సరస్వతీ దేవి అందరిదీ’ అన్న నానుడిని బాసరలోని వ్యాపారులు రుజువు చేస్తున్నారు. సరస్వతీ దేవి అమ్మవారి ఆశీస్సులతో బుద్ధి జ్ఞానం వస్తుందనుకుంటే.. ఈ వ్యాపారులకు మాత్రం ధనలక్ష్మీ కటాక్షం ‘లాభి’స్తోంది. అమ్మవారి పేరిట ఏటా అరకోటి శఠగోపం పెడుతున్నా.. ఆలయాధికారులు పట్టించుకున్న దాఖ లాలు లేవు. బడావ్యాపార వేత్తలు బినామీ పేర్లతో ఆలయ టెండర్లలో పాల్గొని ఎనిమిదేళ్లుగా షాపులు నిర్వహిస్తున్న వైనంపై సాక్షి కథనం.. బాసర : తెలంగాణ రాష్ర్టంలోనే పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కొలువుదీరిన శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం దినదినం అభివృద్ధి చెందుతోంది. అమ్మవారికి మొక్కులు సమర్పించడానికి ఏటా ఇక్కడికి మన రాష్ట్రంతోపాటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వస్తుంటారు. అమ్మవారి చెంత చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపిస్తే విద్యావంతులు అవుతారని వారి నమ్మకం. ఇందులోభాగంగానే.. భక్తులకు పూజా సామగ్రి తదితర వస్తువులను అందుబాటులో ఉండాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణ సముదాయం ఏర్పాటు చేసింది. ఏటా ఆలయాధికారులు ఈ దుకాణాలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఆలయ పరిధిలోని దుకాణాలు, పువ్వుల విక్రయాలు, అమ్మవారి చీరెలు, కుంకుమార్చన, పూజా సామగ్రి, కూల్‌డ్రింక్స్, జ్యూస్ సెంటర్లు, హోటళ్లు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, వెహికిల్ పార్కింగ్ సదుపాయం, పాదరక్షలు భద్రపరచడం, భక్తుల సామగ్రి భద్రపరిచేందుకు లాకర్లు, గోదావరి నది తీరాన పువ్వుల దుకాణాలకు సంబంధించి ఏటా బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది. అయితే.. ఎనిమిదేళ్లుగా బడా, చోట వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై సుమారు అరకోటికి పైగా ఆదాయానికి గండికొట్టారు. ఏం జరిగిందంటే..! దుకాణాల సముదాయం కోసం వచ్చే వ్యాపారులకు బహిరంగ వేలం పాటలో పాల్గొనే ముందు ఆలయ అధికారులు దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనలను ముందుగా వినిపిస్తారు. ఓ దుకానాన్ని టెండర్ నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది 30 శాతం కంటే ఎక్కువ ధరకు వేలం పాట పాడిన వారికే దుకాణాలను అనుమతిస్తారు. వేలం పాటలో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకు నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. కానీ.. ఇక్కడ అలా జరగడం లేదు. 2005లో పువ్వుల దుకాణానికి ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించగా.. రూ.10 లక్షలకు ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. అనంతరం 2009లో అదే పువ్వుల దుకాణాన్ని అదే వ్యాపారికి రూ.4 లక్షల 75 వేలకు అంటగట్టారు ఆలయాధికారులు. దీంతో రూ.5 లక్షల 25 వేల వరకు నష్టం వాటిల్లింది. సదరు వ్యాపారి ఆ డబ్బులను కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోగా.. 2010లో బినామీ పేర్లతో తన అనుచరులతో రూ.11 లక్షల 81 వేలకు దక్కించుకున్నాడు. ఈ పువ్వుల దుకాణానికి సంబంధించే ఇలా ఉంటే.. మిగతా 50 దుకాణాల వేలం పాట ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల చర్యలేవీ.. బహిరంగం వేలం పాటలో పాల్గొన్న వ్యాపారులకు ఆలయ అధికారుల అండదండలు ఉండడంతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించకపోయినా పదేపదే ఆ వ్యాపారులకే కేటాయించి విమర్శలకు తావిస్తోంది. 2006-07 సంవత్సరానికి సంబంధించి అన్ని దుకాణాలకు వేలం పాట నిర్వహించగా.. రూ.8 లక్షల 58 వేల 532 ఇంకా చెల్లించాల్సి ఉంది. 2007-08లో రూ.7 లక్షల 25 వేల 220, 2008-09లో రూ.18 లక్షల 52 వేల 25, 2009-10లో ఆగస్టు వరకు రూ. 30 లక్షల 32 వేల 525 బకాయిలున్నాయి. మొత్తంగా రూ.64 లక్షల 68 వేల 302 వరకు వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. అలాగే 2010-11 వరకు రూ.11 లక్షల 94 వేల 135, 2011-12 రూ.9 లక్షల 48 వేల 501, 2012 సంవత్సరానికి సంబంధించి రూ.11లక్షల 60 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆలయాధికారులు టెండర్‌దారులకు దుకాణాల ఆదాయాలపై ఇప్పటివరకు రికవరీ కూడా చేయలేదు. దేవాదాయ శాఖ నిబంధనలు కఠినంగా ఉన్నా.. అధికారుల వైఖరితో ఆలయ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు తీసుకుంటున్నాం.. - ముత్యాలరావు, ఆలయ ఈవో వేలం పాట నిర్వహించిన దుకాణాల సముదాయానికి సంబంధించి బకాయిలు ఎనిమిదేళ్లుగా సుమారు అరకోటికి పైగా రావాల్సి ఉన్న మాట వాస్తవమే. వ్యాపారులకు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తాం. -
బాసరలో పోటెత్తిన భక్తజనం
భైంసా/బాసర : ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని సుప్రసిద్ధ బాసర సరస్వతీ క్షేత్రంలో బుధవారం మూలా నక్షత్ర మహా సరస్వతీ పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి 1,980 మంది చిన్నారులకు ఈ సందర్భంగా అక్షర శ్రీకార పూజలు చేయించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మూలనక్షత్ర పర్వదినాన తన మనవళ్లు రితిశ్, రిశాంత్లకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. జిల్లా జడ్జి గోపాలకృష్ణమూర్తి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, జేడీఏ రోజ్లీలాతోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 40 వేలకు మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. -
ప్రశాంతంగా ‘ట్రిపుల్ ఐటీ’ కౌన్సెలింగ్
ముథోల్ : బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశం కోసం బుధవారం కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. 500 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 30 మంది గైర్హాజరయ్యారు. హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. డెరైక్టర్ రాజేందర్ సాహూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేశారు. గురువారం మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. వెయిటింగ్ లిస్టులో పేరున్న విద్యార్థులకు ఈనెల 28న కౌన్సెలింగ్ ఉంటుం దని చెప్పారు. తొలిరోజు విద్యార్థితోపాటు అతడి వెంట వచ్చిన ఒకరికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. బాసర ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్, ఎస్‌డబ్ల్యూవో బాలకిషన్‌రెడ్డి, పర్యవేక్షణ అధికారి కరీముల్లాఖాన్, బాసర జేఏసీ చైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ మధుసూదన్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది హరికృష్ణగౌడ్, రవివర్మగౌడ్, కొత్తపల్లి, ఈ.రాములు, గణేశ్, శ్రీశైలం పాల్గొన్నారు. 28 నుంచి తరగతులు.. ఈ నెల 28 నుంచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వి ద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని ట్రిపు ల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేందర్ సాహూ తెలి పారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు 28 లోగా కళాశాలకు చేరుకోవాలని సూచించారు. -
తెలు‘గోడు’..
- ఇరాక్‌లోని బస్రాహ్‌లో చిక్కుకున్న 150 మంది తెలుగు కార్మికులు - తెలంగాణ జిల్లాలకు చెందినవారు 120 మంది - సర్కారు ఆదుకోవాలని విజ్ఞప్తి జగిత్యాల రూరల్ : ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు ఇబ్బందుల్లో పడ్డారు. పలు కంపెనీలు మూతపడటంతో ఆదుకునే దిక్కులేక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమను స్వదేశం పంపించాలని కంపెనీ యాజమాన్యాలను, ఇరాక్ ఎంబసీ అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్‌లోని అల్ మన్‌హెల్ ముథిల్ కంపెనీ ఆధ్వర్యంలో బాగ్దాద్ సమీపంలోని బస్రాహ్ యూనివర్సిటీలో ఐదు వందల మంది భారతీయులు పనిచేస్తుండగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 150 మంది ఉన్నారు. తెలంగాణకు చెందిన దాదాపు 120 మంది ఐదు నెలలుగా కంపెనీ వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు పదిహేను రోజులుగా అంతర్యుద్ధంతో కంపెనీ క్వార్టర్స్‌లో తలదాచుకుంటున్నారు. తమకు వేతనాలిచ్చి స్వదేశం పంపించాలని కంపెనీని వేడుకుంటున్నా యాజమాన్యం గానీ, ఎంబసీ గానీ స్పందించడం లేదని సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డి.గోపాల్, దరూర్ రాజన్న, నారపాక గంగాధర్, నారపాక రవి, నారపాక వెంకట్ (ఉదుమ్‌పూర్, కడెం), దండెం వెంకటేశ్ (అక్కపల్లిగూడెం, జన్నారం), మండె మహేందర్ (రేండ్లగూడ, జన్నారం) ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమను స్వదేశానికి చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.