నిండుకుండలా ఉండే గోదావరి ఏడారిగా మారడంతో ఆదిలాబాద్ జిల్లా బాసరకు నీటి కరువు ఏర్పడింది.
నిండుకుండలా ఉండే గోదావరి ఏడారిగా మారడంతో ఆదిలాబాద్ జిల్లా బాసరకు నీటి కరువు ఏర్పడింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేద్దామన్నా చుక్క నీరు లేదు. దీంతో అధికారులు భక్తుల స్నానాల కోసం షవర్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ సిబ్బంది ఏడారిగా మారిన గోదావరి ప్రాంతంలో బోర్లు వేయించి పైపులైన్ల ద్వారా ఆలయానికి, ఐఐఐటీ విద్యార్థులకు, బాసర వాసులకు తాత్కాలికంగా నీటిని సరఫరా చేస్తున్నారు.