యువతిని కాపాడి తీసుకొస్తున్న పోలీసులు
మంచిర్యాల, జైపూర్: ఇంట్లో గొడవల కారణంగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. మందమర్రి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన లింగపల్లి సు వర్ణ అనే 23 ఏళ్ల యువతి ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఇందారం గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకింది. గోదావరి బ్రిడ్జివద్దగల చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న జైపూర్ పోలీసులు ఆ మెను చూసి సమయస్ఫూర్తితో కాపాడారు. విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు రవి, దేవన్నలు బ్రిడ్జిపై నుంచి తాడును గోదావరి నదిలోకి వేసి సువర్ణను కాపాడారు. ఎస్సై అర్రం విజేందర్ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి తల్లిదండ్రులకు సువర్ణను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment