
టోనీ, బిజూ(ఫైల్)
సాక్షి, మంచిర్యాల: వారు ముగ్గురూ ఉపాధ్యాయులు. వృతి నిమిత్తం కేరళ నుంచి వచ్చారు. చెన్నూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి నది వద్దకు వెళ్లారు. ముగ్గురూ కలిసి నదీ తీరంలో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరు బయటకు వచ్చారు. ఈ విషాద ఘటన కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో జరిగింది.
ఎస్సై చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ సరదా కోసం ఆదివారం గోదావరి తీరానికి వెళ్లారు,. ఫోటో షూట్ అనంతరం నదిలో ఈతకొడుతుండగా బిజూ, టోనీ గల్లంతయ్యారు. ఆంటోనీ ఒడ్డుకు చేరారు. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం వెతుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment