saraswati
-
తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ దీక్ష
-
సరస్వతి పూజలో టీమిండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా కుటుంబం (ఫొటోలు)
-
అవన్నీ పట్టా భూములే
సాక్షి, అమరావతి: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు గ్రామ సభలో అడిగిన దాని కంటే ఎక్కువ పరిహారం ఇచ్చి భూములు సేకరించామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ సభలో ఎకరానికి రూ.2.70 లక్షలు ఇస్తే చాలని రైతులు అడిగారని మావాళ్లు చెబితే.. రైతులను సంతోషపెట్టేలా దానికి అదనంగా రూ.30 వేలు కలిపి ఎకరాకు రూ.3 లక్షలు తగ్గకుండా చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశామని.. అదీ జగన్ అంటే అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించిన మాచవరం తహసిల్దార్.. ఆ భూముల వద్దకు వెళ్లి సర్వే చేసి, అందులో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ, అటవీ, జల వనరుల భూములు లేవని స్పష్టం చేశారని(తహíసీల్దార్ మీడియాతో మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపుతూ) గుర్తు చేశారు. అయినా పవన్ కళ్యాణ్ ఆ భూముల వద్దకు వెళ్లి ఏదో జరిగిపోతున్నట్లు ఊగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పరిశ్రమలు రాకూడదనే రీతిలో..⇒ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్స్ ఎకరా రూ.50 వేలు–రూ90 వేల లోపునే భూములు కొనింది. భవ్య సిమెంట్స్ తర్వాతే మా ప్రాజెక్టు వచి్చంది. వాళ్లు భూమి కొన్న ఏడాది తర్వాత మేము రూ.3 లక్షలకు తక్కువ కాకుండా భూములు సేకరించాం. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు నేను నిజంగానే చెడ్డోడిని అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను రూపాయి పెట్టాల్సిన పని లేకుండా తీసుకోవచ్చు. గతంలో తాడిపత్రిలో దివాకర్‌రెడ్డి ప్రభుత్వ భూములను వాళ్ల పీఏ పేరుతో రాయించుకున్నారని విమర్శలొచ్చాయి. సరస్వతి సిమెంట్స్‌లో ఒక ఎకరా ప్రభుత్వ భూమి లేదు. అంతా ప్రైవేటు భూమే. ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 5న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రాంతంలో పర్యటించారు. అంతకు ముందే డెప్యూటీ సీఎంగా ఆయన ఆదేశాలతోనే అక్టోబర్ 26న మాచవరం మండల తహసీల్దార్ సరస్వతి పవర్‌కు చెందిన భూములన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చారు. సరస్వతి సిమెంట్స్ కొనుగోలు చేసిన భూములన్నీ పట్టా భూములేనని ఆమె ప్రకటించారు. ఆ ఫ్యాక్టరీ కోసం సేకరించిన వెయ్యికిపైగా ఎకరాలు మొత్తం పట్టా భూమేనంటూ ధ్రువీకరించారు. నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉన్నా, దాన్ని పరిశ్రమకు తీసుకోలేదని తహసీల్దార్ చెప్పారు. ⇒ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి కేసులు వేశారు. దాని వల్లే ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్లింది. 2014లో మైనింగ్ లీజులు రద్దు చేశారు. దీనిపై మేము కోర్టును ఆశ్రయిస్తే 2015లో మాకు అనుకూలంగా స్టే ఇచి్చంది. ⇒ 2019లో చంద్రబాబు చేసింది తప్పని, లీజులన్నీ రీస్టోర్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. చంద్రబాబు పరిశ్రమలు రాకూడదనే రీతిలో అడుగులు వేస్తున్నారు. ఫ్యాక్టరీకి నీళ్లు కూడా ఇవ్వరా? ⇒ పవన్ కళ్యాణ్ సిమెంటు పరిశ్రమకు ఇచ్చే నీళ్లపైనా రాద్ధాంతం మొదలెట్టారు. వాస్తవంగా స్టీల్ ఫ్యాక్టరీలకు ఎక్కువగా నీళ్లు కావాలి. సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్దగా అవసరం ఉండదు. కానీ, అందులో పని చేసేవాళ్ల కోసం కనీసం నీళ్లు ఇవ్వాలి. ఆ మేరకు బాధ్యత ప్రభుత్వానిదే.⇒ కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి జిందాల్ ముందుకొచ్చి పునాది రాయి వేశారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆయన్ని ప్రోత్సహించాల్సింది పోయి జత్వానిని తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు పెట్టించి, బెదిరించి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరస్వతి సిమెంట్స్‌ను ఇదే రీతిలో అడ్డుకునే కుట్రలు చేశారు. రాని పరిశ్రమ వచ్చినట్టుగా గొప్పలు ⇒ మరోవైపున ఆర్సిలర్ మిట్టల్–నిపాన్ పరిశ్రమ అనకాపల్లికి వస్తోందంటూ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు. ఆర్సిలర్ మిట్టల్–నిపాన్ పరిశ్రమ మా దగ్గరే ఉందని, పనులు ప్రారంభించింది అని ఒడిశా మంత్రి చెబుతున్నాడు. అక్కడ రూ.1.04 లక్షల కోట్లతో 24 మిలియన్ టన్నుల గ్రీన్ పీల్డ్ ప్లాంట్ కడుతున్నారు. మొదలైన ప్లాంట్ అపేసి ఇక్కడి వస్తారా?‘అవి పట్టా భూములే’‘పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి ప్రాజెక్టు భూములను పరిశీలించాం. మాచవరం మండలం చెన్నాయ్ పాలెంలో 272.96 ఎకరాలు, పిన్నెల్లిలో 793.79, వేమవరంలో 710.63 ఎకరాలు.. మొత్తంగా 1073.38 ఎకరాలు పట్టా భూములే. చెరువులు, వాగులు, కుంటలు, వాడీ బాడీస్ లేవు. తర్వాత ప్రభుత్వ ల్యాండ్స్ పిన్నెల్లిలో 2.87 (కొండ ప్రాంతం), వేమవరంలో 1.44 (చుక్క భూములు) కలిపి మొత్తం 4.31 ఎకరాలుసరస్వతి సిమెంట్స్ ఇంకా తీసుకోలేదు. మొత్తం 1077 ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఆన్లైన్ పోరి్టంగ్కు పంపించాం. ఇందులో 821.44 ఎకరాలకు పోరి్టంగ్ చేశాం. ఇంకా 255.94 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నివేదికను పై అధికారులకు పంపిస్తున్నాం’. – మాచవరం తహసీల్దార్ మాట్లాడిన వీడియోలోని మాటలు -
జ్వరమా.. మరేదైనా కారణమా..?
పెన్‌పహాడ్: గురుకుల పాఠశాల విద్యార్థిని అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే జ్వరంతో విద్యార్థిని చనిపోయిందని ప్రిన్సిపాల్ చెబుతుండగా, రాత్రే చనిపోతే ఉదయం వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహంతో మృతురాలి బంధువులు ప్రిన్సి పాల్‌పై దాడి చేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు సరస్వతి(10) పెన్ పహాడ్ మండలంలోని దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సరస్వతికి సోమవారం రాత్రి జ్వరం వచ్చింది.గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న జీఎన్ఎం మంగళవారం తెల్లవారుజామున పరీక్షించి మరో ఉపాధ్యాయురాలితో కలిసి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ఇంజక్షన్ వేయించారు. అయినా జ్వరం తీవ్రత తగ్గకపోగా సీరియస్‌గా ఉండటంతో 108 వాహనంలో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరస్వతిని పరీక్షించిన డాక్టర్ అప్పటికే చని పోయిందని చెప్పారు. దీంతో ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి.. మీ పాపకు సీరియస్‌గా ఉందంటూ సర స్వతి తల్లి దండ్రులకు ఫోన్ చేశారు. వారు వెంటనే ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కూతురు బాగానే ఉందని, అప్పుడే ఎలా చనిపోయిందని వారు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఆస్పత్రిలో బంధువులు, తల్లిదండ్రుల ఆందోళనసరస్వతి మృతి చెందిన విషయం ప్రిన్సిపాల్ విజ యలక్ష్మి, పాఠశాల సిబ్బంది తమకు తెలియజే య కుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆస్పత్రి లోని మార్చురీ వద్ద కుటుంబసభ్యు లు ఆందోళన చేశారు. తమ కూతురు సోమ వారం రాత్రే చని పోయిందని, ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి మంగళవారం ఫోన్ చేసి సీరియస్‌గా ఉందని చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురుని కొట్టి చంపారా.. లేక ఏదైనా చేశారా మాకు చెప్పాలని తండ్రి సోమయ్య డిమాండ్ చేశాడు. న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయొద్దని పట్టుబట్టారు. మాట్లాడదామని చెప్పి...ప్రిన్సిపాల్‌తో మాట్లాడించాలని రీజినల్ కోఆర్డి నేటర్ షకీనాను బంధువులు కోరగా, ఆమెను తీసుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ప్రిన్సిపాల్‌పై సరస్వతి బంధువులు దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ రవి జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీసీ గురుకుల అధికారులు మద్దిలేటి,వెంకటేశ్వర్లు ఆస్పత్రి వద్దకు వెళ్లి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు మృతదేహాన్ని స్వగ్రామా నికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతురాలి తండ్రి కొంపెల్లి సోమయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్‌లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్‌కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్‌లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది. -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్‌గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్‌వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్‌లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్‌పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్‌గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్‌లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్‌చైర్‌కే పరిమితమైన వారిలో విల్‌పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్‌తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్‌కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది... -
హంసవాహనంపై సరస్వతీ రూపంలో మలయప్ప స్వామి
-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
అంతర్జాతీయ సదస్సుకు ఏఎన్‌యూ అధ్యాపకులు
ఏఎన్‌యూ: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ దుబాయ్‌లో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీడీసీ డీన్, ఎకనామిక్స్ విభాగాధిపతి, బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఆచార్య కె.మధుబాబు, యూనివర్సిటీ ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్, సోషల్ వర్క్ అధ్యాపకురాలు ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ హాజరుకానున్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘బెస్ట్ డిప్లమాట్స్’ నిర్వహిస్తున్న ఈ సదస్సులో 175 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి చాలా మంది ఆశావహులు తమ అధ్యయన పత్రాలను పంపగా, వారిలో పలు ప్రమాణాల ఆధారంగా నిర్వాహకులు ఎంపిక చేసిన వారినే సదస్సుకు ఆహ్వా నించారు. వీరిలో ఏఎన్‌యూ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆచార్య కె.మధుబాబు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండ్రస్టియల్ సెక్టార్ ఇన్ అండర్ డెవలపింగ్ కంట్రీస్’ అనే అంశంపై, ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ ‘ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఇండస్ట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు వియత్నాం’ అనే అంశంపై అధ్యయన పత్రాలు సమర్పించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ఏఎన్‌యూ అధ్యాపకులకు వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్టార్ ఆచార్య బి.కరుణ, యూనివర్సిటీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
‘చీకోటి’ మంత్రులను విచారించాలి
సాక్షి, హైదరాబాద్: మంత్రులు తలసాని, మల్లారెడ్డి సన్నిహితుల హవాలా దందాపై ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీలో, మంత్రి కేటీఆర్ ఇంట్లో సేదతీరుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. హవాలా దందాపై వారు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో మాజీ మంత్రి బీంరావ్ కుమార్తె, 2014లో టీడీపీ నుంచి పోటీచేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ ముర్సుకోల సరస్వతి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చీకోటి ప్రవీణ్ సాగించిన చీకటి కోణాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లపై మంత్రి కేటీఆర్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్టిక్కర్ పడేశానని చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసిన మంత్రి మల్లారెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ప్రవీణ్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటే ఎందుకు స్పందించడంలేదో చెప్పాలని, రాష్ట్ర దర్యాప్తు బృందాలపై నమ్మకం లేకపోతే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో కేసీఆర్ కుటుంబానికి కూడా సంబంధాలున్నాయని భావించాల్సి ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. వన్యప్రాణులను ఫాంహౌస్‌లో పెట్టుకున్న వీడియోలు కనిపిస్తుంటే వన్యప్రాణ చట్టం ఉల్లంఘన జరిగినా కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో ఆదేశించడం లేదన్నారు. వర్షాల వల్ల 11 లక్షల ఎకరాల పంటనష్టం జరిగితే ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించలేదని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధానిని కలవకుండా రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో ప్రధాని మోదీ అవమానించారని..ఇందుకుగాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పి పాదయాత్రకు బయలుదేరాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆగస్టు 5న భారీ నిరసన... పెట్రో ధరలు, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 5న 119 నియెజకవర్గాలతోపాటు 33 జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. అలాగే స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆగస్టు 9 నుంచి 15 వరకు ఉత్సవాలు జరపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై పార్టీ దూతగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చిస్తున్నారని రేవంత్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
పెద్దపల్లి: సరస్వతి బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
-
మనసుకు నచ్చని మనువు చేశారని..
భర్త చేయి పట్టుకుని నిండు నూరేళ్లు జీవించాల్సిన ఓ నవ వధువు పసుపు,కుంకుమలు చెరగకముందే.. కాళ్ల పారాణి ఆరకముందే.. అచ్చట ముచ్చట తీరకుండానే.. మనసుకు నచ్చని మనువు చేశారని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. చిత్తూరు జిల్లా /రామసముద్రం: మండలంలోని గంపనపల్లెలో ఓ నవ వధువు కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు.. మండలంలోని గంపనపల్లెకు చెందిన పునీశ్వర్ కుమార్తె టి.సరస్వతి (19) పెద్దపంజాణి మండలం లింగంరెడ్డిపల్లెకు చెందిన తన మామ జగదీష్‌కు ఇచ్చి మూడు రోజుల క్రితం వివాహం చేశారు. అయితే సరస్వతికి ఆ వివాహం ఇష్టం లేదు. అయినా పెద్దలు వివాహం చేశారు. సరస్వతి భర్త జగదీష్‌తో శుక్రవారం పుట్టింటికి వచ్చింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా సరస్వతి బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మంటల్లో చిక్కుకున్న సరస్వతి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి, చికిత్సల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ శివశంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న సరస్వతి ఇష్టం లేని వివాహం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఆ హత్య చేయించింది భార్యే!
చిన్నప్పటినుంచీ అనుకుంటున్నా... మేనమామతో ఇష్టంలేని పెళ్లి... ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడిని వదిలి ఉండలేని పరిస్థితి... ఆమెను హత్యవైపు ఉసిగొల్పాయి. పెద్దలకు ప్రేమ విషయం చెప్పలేక అప్పటికి తాళి కట్టించుకున్నా... ఎలాగైనా వదిలించుకోవాలన్నదే ఆమె ఆలోచన. అందుకు ప్రేమికుడి తోడు అర్థించింది. ఆయన ద్వారా ఓ కిరాయి హంతకుడితో బేరం కుదుర్చుకుంది. పథకం ప్రకారం వారిని రప్పించి... తాము వెళ్తున్న ప్రాంతాన్ని గూగుల్‌మ్యాప్ ద్వారా పంపించి.. ఆన్లైన్లో డబ్బు చెల్లించి ఎంచక్కా కట్టుకున్నోడిని హత్యచేయించి... అదో దోపిడీగా చిత్రీకరించేందుకు యత్నించి... విఫలమైంది. విజయనగరం టౌన్: గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న హత్యోదంతం ఎంతగా సంచలనం కలిగిం చిందో... కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సంఘటనకు సూత్రధారి హతుడి భార్యే అని తేలడంతో ఇప్పుడు అవాక్కవ్వడం జిల్లా ప్రజల వంతయిం ది. పథకం ప్రకారం కట్టుకున్నోడిని కడతేర్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం ఫేస్‌బుక్‌ద్వారా పరిచయం అయిన ప్రియుడు... విశాఖకు చెందిన కిరాయి హంతకుడిని వినియోగించుకున్నట్టు స్పష్టమైంది. దీనికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. జిల్లా ఎస్పీ జి.పాలరాజు జిల్లా కాన్పెరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది...? గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపుడివలసకు చెందిన యామక గౌరీశంకరరావు, పదిరోజుల క్రితం పెళ్లి చేసుకున్న అదే మండలం కడకెళ్లకు చెందిన సరస్వతితో కలసి బైక్‌పై వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి వారిపై దాడి చేశారు. ఈ సంఘటనలో తనభర్తను హతమార్చి, తన మెడలోని బంగారాన్ని అపహరించుకుపోయారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడనీ, గత నెల 28న తమ వివాహం జరిగిందనీ, ఇద్దరం కలసి పార్వతీపురం వచ్చి, హోండా మోటార్ సైకిల్‌ను దాడి హోండా షోరూమ్‌లో సర్వీసింగ్‌కి ఇచ్చి అక్కడి బంధువుల ఇంటికి వెళ్లామనీ, మధ్యాహ్నం భోజనం తర్వాత షోరూమ్నుంచి బైక్ తీసుకుని వీరఘట్టం వెళ్తుండగా మార్గమధ్యలో లఘుశంక తీర్చుకునేందుకు దిగగా ఈ సంఘటన జరిగిందనీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన ఎస్పీ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జి.పాలరాజు వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. పెదమానాపురం తనిఖీ కేంద్రం వద్ద ముగ్గురు వ్యక్తులు రాత్రి 11.30 గంటల సమయంలో రావడంతో అనుమానంతో వారిని ప్రశ్నించారు. వాళ్లు ప్రయాణిస్తున్న ఆటో విశాఖ రిజిస్ట్రేషన్ కలిగి ఉండటంతో పాటు, వారు ముగ్గురూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారిది విశాఖపట్నానికి చెందిన మెరు గు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజుగా తెలిపారు. వారితో వచ్చిన ఆటోడ్రైవర్ పేరు దేవరాపల్లి కిశోర్‌గా తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెదమానాపురం పోలీసులు వారిని మరింత లోతుగా ప్రశ్నించడంతో గౌరీశంకర్‌పై దాడికి పాల్పడి, అతడిని హతమార్చింది తామేనని అంగీకరించారు. పథకం ప్రకారమే హత్య సరస్వతికి ఇష్టం లేకుండా మేనమామ గౌరీశంకర్‌తో వివాహం జరిగింది. ఆమె విశాఖకు చెందిన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తిని ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమలో ఉంది. ఇష్టం లేని వివాహాన్ని రద్దుచేసుకోవాలంటే భర్త ను హతమార్చడమే సరైన నిర్ణయమని శివతో పథకం రూపొందించింది. విశాఖపట్నానికి చెంది న మెరుగు గోపిని కలిసి, తన భర్తను హత్యచేసేం దుకు సాయంచేయాలనీ, అందుకు ప్రతిగా బంగా రం ఇస్తానని తెలిపింది. ముందుగా మొబైల్లో టీఈజెడ్ యాప్ ద్వారా రూ.8వేలు బదిలీ చేసిం ది. బంగారు ఉంగరాన్ని అందించింది. తర్వాత శివ రూ.10వేలు అడ్వాన్సుగా అందించారు. ఒప్పందం కుదిరిన తర్వాత గోపీ తన స్నేహితులు విశాఖకు చెందిన పాతనేరస్తుడు, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజులకు విషయం తెలిపి, హత్యచేసేందుకు సాయపడాల్సిందిగా కోరారు. హత్యకు పథకాన్ని రూపొందించిన గోపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సరస్వతికి తెలిపి, పథకాన్ని ఆమెకు వివరించాడు. దంపతులు పార్వతీపురం వచ్చినరోజు నిందితులు ముగ్గురూ ఆటోలో విశాఖ నుంచి పార్వతీపురానికి వచ్చి, తిరిగి బైక్‌పై వెళ్తున్నవారిని ఫాలో అవుతూ, ఆమెతో చాటింగ్ చేస్తూ వచ్చారు. ఐటీడీఏ పార్కు వద్ద కాపు కాసి ఉండగా, పథకం ప్రకారం సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు బైక్ ఆపమని చెప్పింది. భర్త గౌరీశంకర్ బైక్ ఆపడమే తరువాయి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి ఇనుపరాడ్డుతో తలపై కొట్టగా గౌరీశంకర్ అక్కడకక్కడే ప్రాణాలు వదిలాడు. మూడు గంటల్లోనే కేసు ఛేదన రాత్రి 8 గంటలకు హత్య జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ అటుగా వెళ్లే అన్ని చోట్లా వాహన తనిఖీలు ముమ్మరం చేయించారు. సరస్వతితో మాట్లాడినప్పుడు పొంతనలేని సమాధానం ఇవ్వడం, పెదమానాపురం వద్ద అనుమానాస్పదంగా ఆటోలో ముగ్గురు కనిపించడంతో కేవలం మూడు గంటల్లోనే కేసును పరిష్కరించగలిగారు. రెండేళ్లుగా శివతో ప్రేమాయణం 2016లోనే మడ్డుశివతో సరస్వతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. వారి స్నేహం ప్రేమవరకూ దారితీసింది. అయితే తనకు ఇష్టం లేకున్నా మేనమామ గౌరీశంకరరావుతో తల్లిదండ్రులు పెళ్లిచేయడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇష్టం లేని భర్తతో శారీరకంగా కలిసేందుకూ సమ్మతించలేదు. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగినట్లు పోలీసులను నమ్మించేందుకు యత్నించింది. ఆభరణాలు తనవద్దే ఉంచుకుని... తన గాజులను పగలగొట్టుకుని తనపైనా దాడిజరిగిందంటూ నమ్మబలికింది. విచారణలో నేరం నిరూపణ కావడంతో నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నామని ఎస్పీ వివరించారు. రోదనలతో మార్మోగిన ఏరియా ఆస్పత్రి పార్వతీపురం: తోటపల్లి ఐటీడీఏ పార్కువద్ద సోమవారం రాత్రి నవదంపతులపై దాడి చేసి అందులో వరుడిని హతమార్చిన సంఘటన ఇటు విజయనగరం, అటు శ్రీకాకుళం జిల్లాలోనూ సంచలనం సృష్టించింది. ఇంతలోనే ఆ హత్యను కట్టుకున్న భార్యే చేయించిందని తేలడంతో అంతా అవాక్కయ్యారు. ఈ సంఘటనతో గౌరీ శంకర్రావు కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇంత ఘోరం జరుగుతుం దని ఊహించలేదని తల్లి, దండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడు అమాయకుడని, చాలా మంచివాడని అటువంటివాడిని ఇలా చంపేస్తారని ఊహించలేదని రోదించారు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువుల రోదనతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతం విషాదం అలముకుంది. నమ్మిన కోడలే పుత్ర శోకాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని, ఇష్టం లేకపోతే విడిచి వెళ్లిపోయినా బాగుండేదని ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. కాగా ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఆస్పత్రివద్దే మంగళవారం పరామర్శించారు. -
సుపారీ ఇచ్చి.. భర్త ప్రాణం తీసిన భార్య..
సాక్షి, విజయనగరం : పార్వతీపురం హత్య కేసులో సంచలనం నిజం వెల్లడైంది. ఇష్టంలేని పెళ్లితో రగిలిపోయిన భార్య సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది. సోమవారం ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది. గణపతినగరం స్టేషన్‌కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ITDA పార్క్ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక కథనం.. నవ జంటపై దాడి.. భర్త మృతి -
సినీఫక్కీలో
12 తులాల బంగారం అపహరణ పూసపాటిరేగ (నెల్లిమర్ల): మండలంలోని రెల్లివలసకు చెందిన వృద్ధ దంపతుల నుంచి అగంతకులు సినీఫక్కీలో నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పతివాడ సత్యనారాయణ, సరస్వతి దంపతులు శుభకార్యంలో పాల్గొనేందుకు నెల్లిమర్ల మండలం గరికిపేటకు ఈ నెల 9న బయలుదేరారు. విజయనగరం వరకు తమ అల్లుడుకు చెందిన కారులో వెళ్లారు. అక్కడ నుంచి భోజనం చేసేందుకు ఎస్‌కేఎంఎల్ హోటల్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు తారసపడ్డారు. మెడలో బంగారు గొలుసులు ఉంటే దొంగలు అపహరించే ప్రమాదముందని, అందుకే వాటిని తీసి సంచిలో వేసుకోండని అగంతకులు వృద్ధ దంపతులకు సలహా ఇచ్చారు. అంతలో వారి వద్దకు మరో యువకుడు వచ్చాడు. ఆయన మెడలో కూడా బంగారు గొలుసు ఉండడంతో వృద్ధులను నమ్మించడానికి అతనిచేత కూడా గొలుసు తీయించి బ్యాగులో వేయించారు. దీంతో వృద్ధ దంపతులు కూడా తమ వద్ద నున్న నాలుగున్నర తులాల బంగారం గొలుసు, మూడు తులాల పుస్తెల తాడు, తులంన్నర మూడు ఉంగరాలు, అర తులం శతమానం తీశారు. వాటిని వృద్ధురాలి చీర కొంగులో ముడికడుతున్నట్లు సాయం చేసిన అగంతకులు బంగారం స్థానంలో ఇనపముక్కలు కట్టి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. కొద్ది సేపటి తర్వాత చీరకొంగుముడి విప్పిన వృద్ధురాలు అందులో ఇనపముక్కలు ఉండడంతో మోసపోయామని గుర్తించి లబోదిబోమన్నారు. దీనిపై విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
వైభవంగా వసంత పంచమి
- కొలనుభారతిక్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు - సర్వసతీదేవికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థాన ఏఈఓ -చిన్నారుల అక్షరాభ్యాసం వద్ద తోపులాట కొలనుభారతి(కొత్తపల్లి): వసంతపంచమి వేడుకలు జిల్లాలో వైభంగా జరిగాయి. రాష్ట్రంలోని ఏకైక సరస్వతీ కేత్రం కొలనుభారతిలో భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షర్యాభ్యాసం చేయించారు. ఉదయం 5.30గంటల ప్రాంతంలో చారుఘోషిణీ నదీజలాలతో సర్వస్వతీదేవికి మంగళస్నానం చేయించారు. అనంతరం అమ్మవారికి పంచామృత సహిత మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, విశేష అలంకరణ పుష్పార్చన, కుంకుమార్చన, మహానైవేద్యం, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ పూజలు నిర్వహించారు. పట్టువస్త్రాల సమర్పణ శ్రీశైల భ్రమరాంబమల్లిఖార్జున స్వామివారి దేవస్థానం అసిస్టెంటు జేఈఓ మల్లిఖార్జునరెడ్డి, ప్రధాన అర్చకులు మల్లిఖార్జున, వేదపండితులు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వారికి ఆలయకమిటీ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ చంద్రశేఖరయాదవ్, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అందజేసిన పట్టువస్త్రాలతో సరస్వతీ అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి పుట్టిన రోజు వేడుకలు ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు చారుఘోషిణీ నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని, సప్తశివాలయాల్లోని శివలింగాలను దర్శించుకున్నారు. కాశిరెడ్డినాయన ఆశ్రమం ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసానికి పోటెత్తిన భక్తులు: వసంతపంచమిని పురుస్కరించుకుని కొలనుభారతిలో వెలసిన జ్ఞానసరస్వతీ అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు రాష్ట్రనలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 850 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నట్లు ఆలయపూజారి చంద్రశేఖరశర్మ తెలిపారు. అయితే, అక్షరాభ్యాసం చేయించే చోట ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అరగంటపాటు అక్షరాభ్యాస కార్యక్రమం నిలిపివేశారు. కానరాని అధికారుల సందడి: ప్రతి ఏటా సరస్వతీ అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే కలెక్టర్, ఎస్పీ,వివిధ శాఖల జిల్లా అ ధికారులు, ప్రజాప్రతినిధులు ఈసారి క్షేత్రం వద్ద కనిపించలేదు. వారు వచ్చి ఉంటే క్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధిచేస్తామని గొప్పలు చెప్పి చేతులు దులుపుకుని వెళ్లేవారు. అధికారుల్లో బుధవారం ఆర్డీఓ సత్యనారాయణ ఒక్కరే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం గోకవరం ప్రాథమిక వైద్యాధికారిణి దీపిక అధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి ఎస్సై శివశంకర్‌నాయక్ ల అధ్వర్యంలో 45మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. -
వసంత పంచమికి ఏర్పాట్లు పూర్తి
-ముస్తాబైన కొలనుభారతి క్షేత్రం - భక్తులకు వసతి ఏర్పాట్లు - సామూహిక అక్షరాభ్యాసానికి ప్రత్యేకంగా అర్చకుల నియామకం కొత్తపల్లి: కొలనుభారతి క్షేత్రంలో బుధవారం వసంత పంచమిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఏకైక సరస్వతీ క్షేత్రం కొలను భారతి. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం దేవస్థానం నుంచి ఆలయ ఈఓ ..సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు అందించటంతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అవుతాయి. అంతకముందే ఆలయ పూజారులు అమ్మవారికి చారుఘోషిణి నదీజలాలతో భిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలం నుంచి వచ్చిన పట్టువస్త్రాలతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరిస్తారు. అనంతరం వేదపండితులు వేదమంత్రాలను పఠిస్తూ వేడుకలను నిర్వహిస్తారు. భక్తులకు సకల సౌకర్యాలు: వసంత పంచమికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. వారు చారుఘోషిణీ నదిలో స్నానం ఆచరించి దుస్తువులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లను నిర్మించారు. తాగునీటి, మరుగుదొడ్ల వసతులు కల్పించారు. భక్తులు తోపులాడుకోకుండా క్యూలైన్లను నిర్మించారు. అక్షరాభ్యాసానికి తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేశారు. సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అర్చకులను నియమించారు. భక్తులకు కాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నదానం చేస్తారు. భక్తుల సౌకర్యార్థం నందికొట్కూరు, ఆత్మకూరు ఆర్టీసీ డిపో వారు కొలనుభారతి క్షేత్రానికి బస్సులను తిప్పనున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా, రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి ఎస్ఐ శివశంకర్‌నాయక్ అధ్వర్యంలో 40 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు: సత్యనారాయణ, ఈఓ, చంద్రశేఖరయాదవ్, ఆలయ చైర్మన్ వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి ఏటా కొలను భారతి క్షేత్రాభివృద్ధికి నిధులు మంజూరు చేసేవారు. ఈ ఏడాది అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు జిల్లా అధికారులు ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు చేయలేదు. దేవాలయ ఖాతాలోంచి నిధులను తీసుకొని..వాటితోనే క్షేత్రంలో తోచినంతలో అభివృద్ధి పనులు చేపట్టాం. -
రంగు పొర
చూపుకు రంగుంటుంది. నలుపు.. తెలుపు.. ఎరుపు.. నీలం. చూపుకు రంగేంటి?! తెలుపంటే... పవిత్రం. నలుపంటే... మలినం. ఎరుపంటే... విప్లవం. నీలం అంటే... ఆకాశమంత. మగవాడి చూపులో కూడా ఇన్ని రంగులు ఉంటాయి! రంగులను బట్టి కూడా మగవాడి చూపు ఉంటుంది!! ఆ రంగుల్లో కొన్ని... ‘పొర’ల్లా పరుచుకుంటాయి. ఆ పొరలు విడిపోవాలి. నోరు మంచిదైతే... ఊరు మంచిదవుతుంది. కన్ను మంచిదైతే... కాపురం బాగుంటుంది. తొలిరాత్రి ముగిసింది.. ‘రజనీ! ప్లీజ్ ఆ చీర మార్చుకొని హాయిగా నైటీ వేసుకోవచ్చు కదా!’ అప్పటికి అయిదోసారి బతిమాలుతున్నాడు నవీన్. ‘అరే.. నేను చీరలో ఉండడం వల్ల నీకేంటి ఇబ్బంది? ఎందుకంత ఫీలవుతున్నావ్ నవీన్?’ భర్త ప్రవర్తన వింత అనిపించడంతో ఆశ్చర్యంగా అడిగింది రజని. ‘నాకేం ఇబ్బంది. ఆ తెల్ల చీరతో నువ్వే ఇబ్బంది పడ్తున్నావేమో.. నైట్‌వేర్‌లో అయితే ఫ్రీగా ఉంటావ్ కదా అని అంతే..’ అన్నాడు భుజాలెగరేస్తూ! తన మాట కాదని నొప్పించడమెందుకని ‘సరేలే.. మార్చుకుంటా’ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్లి నైటీ వేసుకొని వచ్చింది రజని. రజని ఇలా గదిలోకి రాగానే నవీన్ అలా వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. నవ్వుకుంది ఆమె. అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు పాలిపోయిన మొహంతో. తేడా గమనించింది. ‘స్టమక్ అప్సెట్ ఏమో’ అనుకొని ఊరుకుంది. తన చిన్నప్పటి కబుర్లేవో చెబుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రజని చెప్పింది యాంత్రికంగా విన్నాడే కాని అతని మనసు మనసులో లేదు. నిద్రపోయిన భార్య మొహాన్ని తదేకంగా చూస్తున్నాడు. ‘ఎంత అమాయకంగా కనపడుతోంది.. నన్ను మోసం చేస్తోందా? తాను నిజంగానే మోసపోయాడా? అందుకే ఫస్ట్‌నైట్ అంత స్మూత్‌గా జరిగిపోయిందా? గాడ్.. అయితే బ్యాచ్లర్స్ పార్టీ రోజు తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నిజమేనా? నిజమే..’ నవీన్‌కి తలలో బాంబు పేలినట్టయింది. విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎలా అడగాలి? ఏమని మొదలుపెట్టాలి? ఈ ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు.. రజని చాలా క్యాజువల్‌గా... హ్యాపీగా కనపడుతోంది. రొమాంటిక్ జోక్స్ వేస్తూ ఉడికిస్తోంది. ‘ఏమీ తెలీనట్టు ఎంతలా నటిస్తోంది? రెండోరాత్రికే ఈ కవ్వింపు జోక్స్ఏంటో.. ఆ ఎక్స్‌పీరియెన్స్ అంతకు ముందు లేకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయ్? జాణ.. ’ కసిగా అనుకున్నాడు నవీన్ మనసులో.అనుమానం అతణ్ణి మనిషిలా ఉండనివ్వట్లేదు. ఉచ్చనీచాలు మరిచేలా చేస్తోంది. చేసింది. ఆ రాత్రే ఆమెకు టార్చర్ మొదలుపెట్టింది అతని మైండ్‌లో తిష్ఠ వేసి. ‘ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?’ అద్భుతంగా నటించాడు. ‘మా మేనత్త పెట్టిన చీర. రెండో రాత్రి కట్టుకోమని చెప్పింది’ సిగ్గుపడుతూ. ‘నేనొకటి అడగనా?’ అన్నాడు. ‘ఊ.. అడుగు’ గారంగా అన్నది. ‘కో ఎడ్యుకేషన్ కాలేజ్‌లో చదివావ్ కదా..’ ఆగాడు. ‘అవును..పీజీ కూడా కో-ఎడ్డే. క్లాస్మేట్స్ అందరం కలిసి గోవా టూర్ కూడా వెళ్లామని చెప్పాను కదా. ఫోటోలు కూడా చూశారు కదా. వండర్ఫుల్డేస్.. భలే ఎంజాయ్ చేసేవాళ్లం.’ ఒక్క క్షణం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లింది రజని. ‘అదే.... ఆ టైమ్‌లో ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉ...న్నా..’ రజని కళ్లల్లోకి చూస్తూ ఆగాడు. చాలా మామూలుగా.. హాయిగా నవ్వింది రజని. ‘మా క్లాస్‌లో ఉన్న అబ్బాయిలంతా నాకు బాయ్‌ఫ్రెండ్సే..’ నవ్వుతూనే అనేసి బాల్కనీలోకి వెళ్లిపోయింది. తనకు కావాల్సిన సమాధానం కాదు అది. కొంపదీసి తన మనసులో ఉన్నది అర్థమైందా ఏంటీ ఆమెకు. అర్థంకానీ.. అసలు విషయం బయటపడుతుంది అనుకున్నాడు. బాల్కనీలో ఉన్న రజని కళ్లల్లో సన్నటి నీటి పొర. ఆ సంఘర్షణ, అనుమానాలతో నాలుగు రోజులకే హానీమూన్ ట్రిప్ ముగించుకొని ముభావంగా ఇంటికి బయలుదేరింది ఆ జంట. మూడు నెలలు గడిచాయి... ఇంట్లో వాతావరణాన్ని, తమ మధ్య కమ్యూనికేషన్‌ను నార్మల్‌గా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తోంది రజని. కానీ కుదరనివ్వట్లేదు నవీన్. ఆమె ప్రతి కదలికను అనుమానంగానే చూస్తున్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి టీ ఇవ్వబోతుంటే మొహం తిప్పుకొని వెళ్లిపోతాడు. లేదంటే ఆమె వ్యక్తిగతానికి సంబంధించి ఆరా తీస్తాడు. ఈ వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయే కానీ తగ్గడం లేదు. అవి ఎంతలా శ్రుతిమించాయంటే కాలేజ్ డేస్‌లో ఆమె ప్రవర్తన గురించి ఎంక్వయిరీ చేసేంతనగా. ఆమె ఫ్రెండ్స్‌కే ఫోన్ చేసి ఆమె క్యారెక్టర్ గురించి కూపీ లాగుతున్నాడు. అయినా సహిస్తోంది. పెళ్లికి ముందు తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరనీ... తనకెవరితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్స్ లేవనీ ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. బతిమాలుతోంది. సంసారాన్ని నరకం చేయొద్దని ప్రాథేయపడింది. చివరకు అతని అనుమానం పోవడానికి ఏం చేయమన్నా చేస్తానంది. ‘అయితే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్దాం.. రా’ అన్నాడు స్థిరంగా. ఆ మాటకు షాక్ అయింది రజని. కోపం, అసహ్యం, బాధ, తన మీద తనకు జాలి.. కలిగాయి. గుండె పగిలేంత దుఃఖం పొంగుకొస్తున్నా తమాయించుకొని ‘వెళదాం పద’ అంది. అయితే... పరీక్ష చేయడానికి డాక్టర్ ససేమిరా అంది. పైగా నవీన్‌ను చెడామడా తిట్టింది. అమ్మాయికి పెళ్లికి ముందు సెక్సువల్ రిలేషన్ లేదు అనడానికి మొదటి రాత్రి రక్తస్రావం కావడం ఏ రకంగా ప్రామాణికం అని నిలదీసింది. చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇదేనా? అంటూ గడ్డిపెట్టింది. హైమన్ (కన్నెపొర) ఎంత సున్నితంగా ఉంటుందో? ఏయే సందర్భాల్లో చిరిగిపోయే అవకాశాలుంటాయో వివరించింది. భార్యాభర్తల దాంపత్యానికి నమ్మకం పునాది.. అనుబంధానికి అండర్స్టాండింగ్ ఉండాలి అంటూ క్లాస్ తీసుకొని పంపించింది. ఇంటికొచ్చాక... గదిలోకి వెళ్లిపోయి.. సూట్‌కేస్‌తో బయటకు వచ్చింది రజని. హతాశుడయ్యాడు నవీన్. ‘ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావ్ రజనీ?’ ఈసారి నవీన్ షాక్ అయ్యాడు. ‘నీ అనుమానంతో నేనింకా అవమానపడదల్చుకోలేదు. నీకు తెలియని ఇంకో విషయం... స్కూల్ డేస్ నుంచి కూడా నేను సైక్లింగ్ చాంపియన్ని’అంటూ బయటకు నడిచింది రజని. నేపథ్యం రజని, నవీన్... ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఆమె ఎంబీఏ. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి. చక్కటి ఈడూజోడు.. అన్ని విధాలా తగిన సంబంధం అని రెండు కుటుంబాల వాళ్లూ అనుకొని ఘనంగా పెళ్లిచేశారు. పెళ్లికి ముందు బ్యాచ్లర్స్ పార్టీలో తన భార్య గురించి, తన అత్తగారింటి వైభోగం గురించి చెబుతూ నవీన్ మురిసిపోతుంటే అసూయపడ్డ అతని స్నేహితుడొకడు.. ‘ఒరేయ్.. అంత సోషల్మూవింగ్ ఉన్న అమ్మాయి పెళ్లికి ముందే అన్ని చేసుంటుంది జాగ్రత్తరోయ్’ అని కూశాడు. ‘ఎలా తెలుస్తుందిరా’ అని అడిగాడు అమాయకంగా. వాడు చెప్పాడు. అందుకే ఫస్ట్‌నైట్ అయ్యాక వాష్‌రూమ్‌లోకి వెళ్లి చీర చూశాడు నవీన్. రజని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు. జీవనసహచరిని దూరం చేసుకున్నాడు. అదో పెద్ద మూఢనమ్మకం! మన సమాజంలో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకం... మొదటి రాత్రి తెల్లచీర ధరించాలని, మరునాడు దాన్ని పరీక్షించాలని, మరక ఉంటే ఆమె వర్జిన్ అనీ, లేకుంటే కాదని! నేటికీ చాలామంది మగవాళ్ల మెదళ్లను తొలుస్తున్న పురుగు ఇది. ప్రతిదానికీ సైన్స్ రీజన్ చెప్తున్నా అర్థం కావట్లేదు.. చేసుకోవట్లేదు. నవీన్ ఇందుకు అతీతుడేం కాదు. నవీన్ చేసిన పని మెంటల్ క్రూయల్టీ. హిందూ వివాహచట్టం ప్రకారం భార్య శీలాన్ని శంకించడం, ఆమె శీలవతి కాదని ప్రచారం చేయడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం వంటివన్నీ మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తాయి. అలాంటి వ్యక్తి నుంచి విడాకులు తీసుకోవచ్చు. ఐపీసీ 498ఏ కింద కేస్ కూడా నమోదు చేయవచ్చు.- ఇ.పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ - సరస్వతి రమ -
నాలుగేళ్లు కాపురం చేసి రూ.30 లక్షలు దోచుకున్నాడు
నాకు న్యాయం చేయండి హిమాయత్‌నగర్: తన భర్త తనను మోసం చేశాడని, నాలుగేళ్లు కాపురం చేసి రూ.30 లక్షలు దోచుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన కుమార్తెతో కలిసి బాలల హక్కుల సంఘం, మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ సందర్భంగా మహిళా సంఘం నార్త్‌జోన్ అధ్యక్షురాలు రేఖ, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు గురువారం నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాధితురాలు సరస్వతి మాట్లాడుతూ కేరళకు చెందిన తాము నగరంలోని మల్కాజగిరిలో స్థిరపడినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌కు చెందిన పంకజ్ కాంతిలాల్సుఖియా(60) ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను లోబరుచుకున్నాడని, 2001లో తాము పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఆ తరువాత కొద్దిరోజులు కోదాడలో నివాసం ఉండి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చామన్నారు. 2007లో తమకు అమ్మాయి పుట్టిందన్నారు. అయితే అతను గత నాలుగేళ్లుగా తనకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి రూ.30లక్షల వరకు కాజేశాడని. అతనికి గతంలోనే విహహం జరిగినట్లు తెలియడంతోనిలదీయగా, దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నాడన్నారు. పాప చదువు ఖర్చులను భరించడం లేదని, తన సంతకాలను ఫోర్జరీ చేసి లోన్లు తీసుకున్నందున బ్యాంకుల నుంచి తనకు నోటీసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘం నార్త్ జోన్ అధ్యక్షురాలు రేఖ మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఆర్థికంగా, శారీరకంగా మోసం చేసిన కాంతిలాల్ తక్షణమే తన భార్యకు క్షమాపణ చెప్పాలని, ఆమె పేరుతో తీసుకున్న లోన్లను చెల్లించాలన్నారు. లేని పక్షంలో కవాడిగూడలోని అతని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ తన కుమార్తె బ్రింద చదువుతో సంబంధం లేదనడం సమంజసం కాదని, కుమార్తె విద్యాభ్యాసానికి చర్యలు తీసుకోకపోతే చైల్డ్ కమీషన్ నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. అప్పుడు మూడు నెలలకు.. సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం 2002 నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌గా మహేందర్‌రెడ్డిని 2003 ఫిబ్రవరిలో నియమించింది. సైబరాబాద్ పోలీసు యాక్ట్ ఆ ఏడాది డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు సైబరాబాద్‌ను రెండుగా విభజిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటికి కమిషనర్లను నియమించాల్సి ఉంది. ఐజీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారులు నవీన్‌చంద్ (వెస్ట్), మహేష్ మురళీధర్ భగవత్‌కు (ఈస్ట్) తొలి కమిషనర్లుగా చాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రెండు కమిషనరేట్లకు విడివిడిగా చట్టాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏ టైంలో ఎవరు కమిషనర్.. 2003 నుంచి 2006 డిసెంబర్ అఖరు వరకు మహేందర్‌రెడ్డి 2007 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకు ప్రభాకర్‌రెడ్డి 2011 జనవరి నుంచి 2013 మే 26 వరకు తిరుమలరావు 2013 మే 27 నుంచి ఇప్పటివరకు సీవీ ఆనంద్ -
వేస్ట్ ఫెలోస్
బాధ్యత అవసరం కంటే ఎక్కువ పెట్టుకోవడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ వడ్డించడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ తినడం వేస్ట్ కాదా! ఆ తర్వాత అజీర్తికనీ, షుగర్ అనీ, సకల జబ్బులకు సర్వం ధారపోయడం వేస్ట్ కాదా! రైతు కష్టాన్ని గౌరవించకపోవడం వేస్ట్ కాదా! పేదవాడి కడుపుకొట్టడం వేస్ట్ కాదా! పంచుకోవాల్సింది పారేయడం వేస్ట్ కాదా! పిల్లలకు వేస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచేవాళ్లు వేస్ట్‌ఫెలోస్ కాదా! కాదా!? అన్నం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ అంటే సృష్టి. సృష్టి అంటే శక్తి. ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే శక్తిని, మన ఉత్పాదకతను వృథా చేస్తున్నామనే అర్థం. ఈ పాఠం రతన్‌టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజానికి జర్మనీకి వెళితే కాని అర్థం కాలేదు. చాలా ఏళ్ల కిందట రతన్ టాటా ఏదో పని మీద జర్మనీ వెళ్లారు. అప్పటి వరకు ఆయన జర్మనీ చాలా ధనిక దేశమని, అక్కడి ప్రజలంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆయన స్నేహితుడితో కలిసి హేమ్బర్గ్కి వెళ్లాడు. లంచ్ టైమ్ అయింది. ‘ఆకలి దంచేస్తోంది. ముందు ఏదైనా రెస్టారెంట్‌కి వెళదాం.. తర్వాతే ఇంకో పని’ అన్నాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. మూలన ఒక యువజంట, ఇంకో చోట యాభైఏళ్లు పైబడిన ఓ మహిళల గుంపు మినహా రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉంది. ‘ఇదేం హోటల్‌రా బాబూ.. అంతా ఖాళీగా ఉంది.. మంచి ఫుడ్ ఉంటుందా?’ సందేహం వెలిబుచ్చుతూ లోపలంతా పరికించి చూడసాగాడు. మూలన కుర్చున్న యువజంట ముందు ఓ రెండు కూరలతో మాత్రమే భోజనం ఉంది. ‘ఇంత సాధారణ భోజనంతో రొమాంటిక్ లంచా? గర్ల్‌ఫ్రెండ్‌కి మంచి లంచ్ కూడా ఆర్డర్ చేయని ఆ పిసినారి బాయ్‌ఫ్రెండ్‌ని ఆ పిల్ల ఎంతోకాలం భరించదు’ అనుకుంటూ నవ్వుకున్నారు రతన్‌టాటా. యాభై పైబడిన ఆడాళ్ల బృందమేమో ఆర్డర్ చేసుకొన్న డిష్‌ను కొసరి కొసరి వడ్డించుకుంటున్నారు. ప్లేట్లలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ మిగల్చకుండా తినేస్తున్నారు. వాళ్లను చూసి అంత కక్కుర్తి ఏమిటా అనుకున్నారాయన. ఇప్పుడు ఆర్డర్ చేయడం వీళ్ల వంతైంది. ఉన్నది ఇద్దరే అయినా చాలా రకరాల వెరైటీలను ఆర్డర్ చేశారు రతన్‌టాటా. తినగలిగినంత తిని మిగిలినది ప్లేట్లలో వదిలేశారు. అది చూసి పక్కనే ఉన్న బృందంలోని మహిళ... ‘మిస్టర్.. భోజనాన్ని అలా వదిలేశారెందుకు?’ అంటూ కోప్పడింది. ఆ మాటకు రతన్‌టాటా స్నేహితుడికి చిర్రెత్తింది. ‘మా డబ్బు.. మా భోజనం.. మా ఇష్టం. తింటాం.. వదిలేస్తాం.. మీకెందుకు?’ అంతే కోపంగా సమాధానమిచ్చాడు. ఆ జవాబుకి కనుబొమలు ముడివేసిన ఆ మహిళ వెంటనే రిసెప్షన్‌లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది. కొద్ది క్షణాల్లోనే అక్కడి సోషల్ సెక్యురిటీ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. ఈ మిత్రుల టేబుల్ దగ్గరకు వచ్చి ‘ప్లేట్లలో వదిలేసిన ఆహారానికి యాభై యూరోలు ఫైన్ కట్టండి’ అంటూ ఓ రిసీట్ ఇచ్చారు. తెల్లబోయారిద్దరూ. ‘అదేంటి? ఈ ఫుడ్ మేం డబ్బుకట్టి ఆర్డర్ చేసిందే’ అన్నాడు రతన్‌టాటా స్నేహితుడు. ‘డబ్బు మీదే కాని వనరులు మీవి కావు. మీవి కాని రీసోసెర్సెస్ను వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. దానికే ఈ ఫైన్’ అని వాళ్ల దగ్గర యాభై యూరోలు తీసుకొని వెళ్లిపోయారు. అప్పటిదాకా ఆ ధనిక దేశమ్మీద రతన్‌టాటాకు ఉన్న అపోహలు తొలగిపోయాయి. అంత సంపద ఉన్న దేశమే ప్రకృతి సంపదను ఎంతో జాగ్రత్తగా వాడుకుంటుంటే అతి తక్కువ వనరులన్న మన దేశం ఎంతెంత ఆహారాన్ని వృథా చేస్తోంది ...అని చింత పడ్డారు. అప్పటినుంచి ఒక్క ఆహారపు గింజను కూడా వృథా చేయనని ఒట్టేసుకోవడమే కాదు, చిత్తశుద్ధితో ఆచరించడమూ మొదలెట్టారట. మన ఇళ్లల్లో.. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో, మన హోటళ్లల్లో కనిపించవు. కానీ తిన్నంత తిని వదిలేసినంత వదిలేసే అలవాట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇద్దరున్న ఇంట్లో నలుగురి వంట; నలుగురు ఉన్న ఇంట్లో ఆరుగురి వంట; ఇక పదిమంది ఉన్న ఇంట్లో పదిహేను మంది వంట చెత్తకుండీల్లోకి చేరుతుంది. అదే చెత్తకుండీ పక్కన అన్నమో రామచంద్రా అంటూ డొక్కలు అతుక్కుపోయిన అన్నార్తులూ కనిపిస్తుంటారు. ఒక ఇంట్లో అతివృష్టి... ఒకడి ఒంట్లో అనావృష్టి. అయినా ఆహారం విలువ తెలియదు. దానికి ఉదాహరణ మన దగ్గర జరిగే అట్టహాసపు ఆర్భాటపు పెళ్లిళ్లు, పెరంటాళ్లే! ఈ వేడుకల్లో టన్నుల కొద్దీ ఆహారం వృథాపాలవుతోంది. ఇలా వృథా చేస్తున్న ఏ ఒక్కరికైనా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తున్నాయా? చెత్తలో కలుపుతున్న ఈ ఆహారధాన్యాలను పండించడానికి రైతు తన సర్వస్వం ధారపోస్తున్నాడు. తాను నమ్ముకున్న నేల కోసం ఇంటినీ, భార్య ఒంటి మీది నగలను తాకట్టు పెట్టి పంటకు పెట్టుబడి తెస్తున్నాడు. అయినా అనుకున్న రాబడి రాక అప్పులు మిగిలి తన ప్రాణాల్నే తీసుకుంటున్నాడు. అతని కుటుంబం ఈ గింజలే కరువై రోడ్డున పడుతోంది. మన ఒక్క ఇంట్లో ఒక ముద్దే కదా వృథా అవుతోంది అనుకుంటాం... అలా కొన్ని వందల ఇళ్లల్లో వందల ముద్దలు వృథా అయి కొన్ని వందల మంది నోటి దగ్గరి ముద్దలను లాక్కున్న వాళ్లమవుతున్నాం. అంటే అన్ని వందలమంది అన్నార్తులను సృష్టించిన నేరస్తులమవుతున్నాం. ఎంతోమంది రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాం. వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేసిన పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. బహుశా ఇలాంటి బాధను అనుభవించే కావచ్చు.. లేదా రతన్‌టాటాకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకొని కావచ్చు.. దుబాయ్‌లో.. బర్‌దుబాయ్‌లోని అల్ కరామా ప్రాంతంలో అజంతా అనే హోటల్ ఉంది. ఆ హోటల్ యజమాని తన దగ్గరకి వచ్చే కస్టమర్స్‌కి 20 ధిరహామ్లకు కావల్సినంత భోజనం పెడ్తాడు. మళ్లీ మళ్లీ పెట్టించుకుంటూ కడుపునిండా తినొచ్చు. కానీ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మిగిలిందో, 13 ధిరహామ్స్ ఫైన్ కట్టి వెళ్లాలి. అంటే కావల్సినదానికల్లా ఎక్కువ పెట్టుకొని వదిలేస్తే భోజనం ఖరీదు 20 ధిర్హామ్స్తో పాటు అదనంగా 13 ధిర్‌హామ్స్ మొత్తం ముప్పైమూడు ధిర్‌హామ్స్ చెల్లించి వెళ్లాలి. ఒక్క ధిర్హామ్ విలువ 20 రూపాయలు. 33 ధిర్‌హామ్స్ ఇండియన్ కరెన్సీలో 660 రూపాయలు. ఎందుకీ ప్రాక్టీస్ అంటే ‘పాతికేళ్ల కిందట ఒకసారి నా హోటల్‌కి ఓ నలుగురు యువకులు వచ్చి నచ్చినవాటిని నచ్చినంత ఆర్డర్ చేశారు. కనీసం అందులో పావు భాగమైనా తినకుండా పారేసి వెళ్లిపోయారు. అప్పట్లో నేను రోజుకి యాభై మందికి మీల్స్ సర్వ్ చేసేవాడిని. ఈ నలుగురు వచ్చి వెళ్లాక వారిలో ఏడుగురికి భోజనం పెట్టలేకపోయాను. అంటే ఈ నలుగురు ఏడుగురి భోజనాన్ని వృథా చేసి వెళ్లారు. పాపం ఆ ఏడుగురూ లేబర్స్. నా రెగ్యులర్ కస్టమర్స్. ఆకలితో వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో అల్కరామాలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. వాళ్లకు ఆ పూటకు తిండే దొరకలేదు. నీకు పట్టినంత నువ్ తిను.. కాని ఇతరులు తినాల్సినదాన్ని నువ్వు వృథా చేసే హక్కు నీకు లేదు అని చెప్పడానికే ఈ రూల్ పెట్టాను ’ అని చెప్పాడు. ఇదీ కథ.. కథలాంటి నిజం. ఆహారాన్ని వృథా చేయడం ఎంత నేరమో చెప్పే గొప్ప అనుభవం. నోటి దగ్గరకు ముద్ద వెళ్లినప్పుడల్లా ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావాల్సిన పాఠం. - సరస్వతి రమ -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్ పార్వతీపురం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన సరస్వతి (25)కు గత ఏడాది అక్టోబరు 29న పార్వతీపురం నెహ్రూకాలనీకి చెందిన రాయల సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ లాంఛనాల కింద లక్ష రూపాయల కట్నం, తులం బంగారం ఇచ్చారు. సరస్వతి కుటుంబ సభ్యులు మంగళవారం పార్వతీపురం వచ్చి సంతోషంగా ఉన్న తమ కుమార్తెను చూసి ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఇంతలో గురువారం ఉదయం మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్త, అత్తమామలే చంపేశారు..! ఈ విషయమై మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు మాట్లాడుతూ మంగళవారం నాటికి సంతోషంగా ఉన్న తన సోదరి సరస్వతిని భర్త, అత్తమామలే చంపేశారని ఆరోపించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. గత అక్టోబర్ 29న సింహాచలంలో పెళ్లి చేశామన్నారు. తన సోదరి భర్త రాయల సంతోష్, అత్త ఈశ్వరమ్మ, మామ రామారావులు కలిసి చంపేసినట్లు ఆరోపించారు. మద్యం మత్తులో... భార్యాభర్తలిద్దరూ మేడపై పడుకుంటారని, గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో మృతదేహాన్ని పట్టుకొని భర్త, అత్తమామలు, ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి కనిపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం మత్తులో భార్యను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లోనే పడిపోయి కోడలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏఎస్పీ దర్యాప్తు... విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్, సీఐ వి.చంద్రశేఖర్, పట్టణ ఎస్ఐ బి. సురేంద్రనాయుడు తన సిబ్బందితోపాటు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
బాసరలో ఏడారిగా మారిన గోదావరి
నిండుకుండలా ఉండే గోదావరి ఏడారిగా మారడంతో ఆదిలాబాద్ జిల్లా బాసరకు నీటి కరువు ఏర్పడింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేద్దామన్నా చుక్క నీరు లేదు. దీంతో అధికారులు భక్తుల స్నానాల కోసం షవర్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ సిబ్బంది ఏడారిగా మారిన గోదావరి ప్రాంతంలో బోర్లు వేయించి పైపులైన్ల ద్వారా ఆలయానికి, ఐఐఐటీ విద్యార్థులకు, బాసర వాసులకు తాత్కాలికంగా నీటిని సరఫరా చేస్తున్నారు. -
అక్కా సారీ! అంటూ సెండ్‌కాని ఓ మెసేజ్
విజయనగరం కంటోన్మెంట్/గంట్యాడ: కట్టుకున్నవాడు నిరంతరం అనుమానంతో వేధిస్తుంటే తట్టుకోలేకపోయింది ఆ తల్లి. తండ్రి తనువు చాలిస్తే కనీసం ఆ విషాదం నుంచి తేరుకోకముందే సంక్రాంతి పండగ చేసుకోవాలని సతాయిస్తే... భర్త వెంట ఇంటికి చేరింది. మానసికంగా ఆమె ఎంత మధనపడిందో కానీ ఇద్దరు కుమారులతో కలసి ఆత్మహత్య చేసుకుంది. గంట్యాడ మండలం రామవరంలో బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. గ్రామానికి చెందిన కలిదిండి సరస్వతి(35) తన ఇద్దరు కుమారులు సాయివర్మ(14), హర్షవర్ధన్‌లతో సహా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం సరస్వతి పెద్దక్క ఫోను చేస్తున్నా ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోను చేశారు. ఆ సమయంలో పొలంలో ఉన్న వారు ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా ముగ్గురూ ఫ్యానుకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించడాన్ని చూసి తిరిగి ఫోను చేసి చెప్పారు. ఇంతలో పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి తలుపులు విరగ్గొట్టి మృతదేహాలను బయటకు తీశారు. పదహారేళ్ల క్రితమే వివాహం రామవరం గ్రామానికి చెందిన కలిదిండి నరసింహ రాజుకు భీమిలి మండలం చిప్పాడ దగ్గర్లోని మూలకుద్దు గ్రామానికి చెందిన సరస్వతితో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రారంభంలో బాగానే ఉన్న వీరి మధ్య లో కొన్నాళ్లుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహరాజు తరచూ భార్యను హింసిస్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు. అనుమానంతో భార్యను వేధిస్తుండే వాడ ంటున్నారు. సరస్వతికి ఇద్దరు అక్కలున్నారు. పెద్దక్క కన్నమ్మ విజయనగరంలోని గాజుల రేగలో నివాసముంటుండగా కొన్నాళ్ల నుంచీ తల్లిదండ్రులు ఈమె వద్దే నివాసం ఉంటున్నారు. సరస్వతి తండ్రి గత నెల 6న విజయనగరంలో మృతి చెందారు. విషాదంతో ఉన్న తల్లి వద్ద కొన్ని రోజు లుందామని అనుకున్న సరస్వతిని సం క్రాంతికి తమ పెద్దలకు బట్టలు చూపిం చాలని వెంటనే పండగకు రమ్మని భర్త ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయం లో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. సరస్వతి తల్లి రమాదేవి ఇద్దరినీ మందలించి సయోధ్య కుదిర్చి కూతుర్ని అల్లుడితో పంపించింది. ఇంతలోనే ఆమె ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని ఆమె ఊహించలేదు. సమాచారం అందుకున్న ఆమె కన్నవారు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపిం చారు. తన అల్లుడు నరసింహరాజుపై నే తమకు అనుమానం ఉందని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై తిరుపతిరావు, సీఐ రవికుమార్‌లు ప్రాధమిక పరిశీలన చేశారు. సమాచారం అందుకున్న నరసింహరాజు కూడా అక్కడకు చేరుకున్నాడు. అక్కా సారీ! అంటూ సెండ్‌కాని ఓ మెసేజ్ అక్కా సారీ! అంటూ తన పెద్దక్క కన్నమ్మకు సెంట్‌కాని మెసేజ్‌ను పెట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు. తన అక్కకు కూడా చెప్పలేని విషయాలేమయినా ఉన్నాయా? లేకపోతే కేవలం సారీ అని మాత్రమే చెబుతూ తన ఆవేదనను ఒకే పదంలో చెప్పాల్సిన బాధ ఏమొచ్చిందన్నది పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశముంది. ఇద్దరు కుమారులూ ప్రతిఘటించలేదా? ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న సరస్వతిని ఇద్దరు పిల్లలు ప్రతిఘటించలేదా? నువ్వు చనిపోవద్దు, మేమూ చావొద్దనే విషయాన్ని కూడా చెప్పలేకపోయారా? ఇద్దరినీ ఎలా ఉరికి సిద్ధం చేసిందన్నది ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నకైమ్ డీఎస్పీ సందర్శనసమాచారం అందుకున్న క్రైం డీఎస్పీ కృష్ణప్రసన్న రామవరంలోని సంఘటనా స్థలానికి బుధవారం రాత్రి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. దీనిపై సీఐ రవికుమార్ మాట్లాడుతూ సంఘటనను లోతుగా పరిశీలిస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదనీ, వెంటనే విచారణ ప్రారంభించామనీ చెప్పారు. -
'బసంత్ పంచమి'శుభాకాంక్షలు తెలిపిన మోదీ
న్యూఢిల్లీ: బసంత్ పంచమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బసంత్ పంచమి అందరి జీవితాల్లో వెలుగులను తీసుకురావాలన్నారు.ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.' బసంత్ పంచమితో అందరికీ ఐశ్వర్యాలు కల్గి సుఖ సంతోషాలతో జీవించాలని మోదీ ఆకాంక్షించారు. -
‘ఆసరా’ అభాసుపాలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : భర్త బతికుండగానే భార్యకు వితంతు పింఛన్.. మరో వ్యక్తి ఎటువంటి ైవె కల్యం లేకున్నా.. అతడికీ పింఛన్.. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు చేనేత కార్మికుడిగా గుర్తించి అతడికీ పింఛన్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. తాము అర్హులమని పింఛన్లు ఇవ్వాలని ఆధారాలతో పాటు కాళ్లకు చెప్పులు అరిగే లా తిరుగుతున్నా వారిని కాదని అధికారులు అనర్హులకు పింఛన్ జాబితాలో చోటు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని 31 వార్డుల్లో వివిధ రకాల పింఛన్ల కోసం 5,360 దరఖాస్తులు రాగా 2,571 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ పూర్తి చేయగా అందులో 1,900 వివిధ రకాల పింఛన్లను మంజూరు చేశారు. అందులో 22వ వార్డులో పింఛన్ జాబితాలో పట్టణంలోని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, ఎమ్మెల్యే సన్నిహితుడుగా ఉన్న హెచ్ హరి కిషన్‌కు చేనేత కార్మికుడిగా గుర్తించి రూ. 1000 పింఛన్‌ను మంజూరు చేస్తూ అధికారులు బుధవారం మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. దీంతో పాటు సోమేశ్వర్వాడ 18వ వార్డుకు చెందిన సయ్యద్ నేహకు వికలాంగురాలిగా గుర్తించి గత నెలలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా రూ.1500 తీసుకున్నా.. బాలిక ప్రస్తుతం అధికారులు వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు. 16వ వార్డులో సరస్వతి భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఒకటో వార్డుకు చెందిన సుజాతకు కూడా భర్త బు చ్చిరాములు బతికే ఉండగా ఆమెకు సైతం వితంతు పింఛన్ మంజూరైంది. రజీయాబేగం భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరైం ది. వాస్తవానికి ఆమె భర్త వృద్ధ్యాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కావడం గమనార్హం. కమిషనర్ వివరణ : టీఆర్ఎస్ నాయకుడు పింఛన్ మంజూరు చేయడంపై ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాజుద్దీన్‌ను వివరణ కోరగా కంప్యూటర్ ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో పొరపాట్లు జరిగాయని వాటిని సవరిస్తామన్నారు. అనర్హులకు పింఛన్ తొలగించి అర్హులకు అందజేస్తామని తెలిపారు. హరికిషన్ వివరణ : పింఛన్ మంజూరుపై టీఆర్ఎస్ నాయకుడు హరికిషన్‌ను వివరణ కోరగా తాను ఎలాంటి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. తమది చేనేత సామాజిక వర్గం కాదని వివరణ ఇచ్చారు. -
సరస్వతి భూములపై చంద్రబాబు రాజకీయ కక్ష
-
ప్రేమ సంగీతం
A successful marriage requires falling in love many times.. always with THE SAME PERSON.. ఈ మాట ఈ జంట విషయంలో ప్రూవ్ అయిన సత్యం! పదిహేడేళ్ల వీళ్ల కాపురంలో ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డది ఎన్నిసార్లో! ఆయన జయవంత్‌నాయుడు.. ‘జయవంత్ గిటార్ ఇన్వెన్షన్’తో జగమెరిగిన సంగీతవాయిద్య కారుడయ్యాడు. ఆమె.. మాధవి! భర్తలోని కళను అభిమానించే కళత్రం! సంగీతమంటే చెవికోసుకుంటుంది. అందుకే ఈ సంగీతకారుడికి పంచప్రాణాలూ అర్పించింది! పాట ముడివేసిన ఈ జంట అనుబంధం "You and I’ గా ఒక్క చూరుకిందకి చేరి ‘we’గా సాగుతోంది! ఆ ముచ్చట్లు... ‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులప్పుడు మా ఇద్దరికీ నచ్చిన కామన్ థింగ్ మ్యూజిక్. ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అన్నా నాకు చాలా ఇష్టం. అప్పటికే ఆయన పేరున్న గిటారిస్ట్. మేం ఒకరినొకరు ఇష్టపడ్డానికి, ఆ చూపులు పెళ్లిగా మారడానికి మెయిన్ పాయింట్ అయింది అదే’ అని అప్పటి జ్ఞాపకాన్ని తలచుకొని మురిసిపోయింది మాధవి. ‘తను మ్యూజిక్ లవర్ కావడం నాకు చాలా ప్లస్‌పాయింట్ అయింది. బై ప్రొఫెషన్ ఐయామ్ చార్టర్డ్ అకౌంటెంట్. ప్రవృత్తి మాత్రం సంగీతం మీదే. కన్సర్ట్ ఉన్నప్పుడు నా దృష్టంతా ప్రాక్టీస్ మీదే ఉంటుంది. చాలా టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నన్ను అస్సలు డిస్టర్బ్ చేయదు’ అని జయవంత్ నాయుడు చెప్తుంటే ‘ఆడియెన్స్ కన్నా ముందు వినే భాగ్యం కలుగుతుంటే డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తాను? గ్రేట్ ఎంజాయ్మెంట్ అది. నాకే కాదు.. మా ఫ్యామిలీ అంతటికీ!’ అంది మాధవి. సలహాలు? అంతలేదు. నేను గుడ్ లిజనర్ని మాత్రమే కానీ గుడ్ క్రిటిక్‌ని కాను. ఇన్ఫాక్ట్ రాగాల పట్ల నాకంత అవగాహన లేదు కాబట్టి ఆయన కంపోజిషన్స్కి సలహాలిచ్చే వైజ్ అడ్వయిజర్ని కాను’ అని మాధవి నిజాయితీగా చెప్తుంటే ‘అలా ఏం లేదు. మంచి సలహాలివ్వగలదు. అయితే పర్టిక్యులర్ ట్యూన్‌ని వినిపించి ఇది ఎలా ఉంది? అనే నేనెప్పుడూ తనను అడగలేదు. మామూలుగా మ్యూజిక్కు సంబంధించి ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు తను చేసిన సజెషన్స్ నా మెదడులో అలా రిజిష్టర్ అయిపోతాయి. కంపోజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిగ్గా ఇంప్లిమెంట్ అవుతాయి’ అని తనూ నిజాయితీగా ఒప్పుకున్నాడు. జయవంత్గిటార్ ఇన్వెన్షన్లో మాధవి పాత్ర? ‘నిజం చెప్పాలంటే ఇనీషియల్స్టేజ్లో విషయాన్నే తనతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే అదెంత వరకు వర్కవుట్ అవుతుందో తెలీదు. 2003 నుంచి దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటికీ కోల్‌కతా వెళ్లొచ్చాక.. ఓకే.. అవుతుంది అన్నాకే తనతో షేర్ చేసుకున్నా. అంటే రెండేళ్లకనుకోవచ్చు. 2007లో జయవంత్ గిటార్‌ని లాంచ్ చేశా’ అన్నాడు. ‘ఆయన కష్టంలో ప్రత్యక్ష పాత్ర లేదు. కానీ.. జయవంత్ గిటార్ తయారు చేసేటప్పుడు మిగిలిన విషయాల బర్డెన్ తన మీద పడకుండా చూసుకున్నా. మాది జాయింట్ ఫ్యామిలీ. మా అత్తయ్య .. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన తన పనిలో బిజీగా ఉంటే మిగిలిన బాధ్యతలను షేర్ చేసుకోవడానికి ిషీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అజ్!’ అని క్రెడిట్‌ని కుటుంబానికిచ్చింది మాధవి. స్ట్రెంత్స్.. ‘లైఫ్‌లో ఎలాంటి చాలెంజెస్ వచ్చినా బ్రేకప్ కారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఓపికెక్కువ’ అని మాధవి కితాబు ఇచ్చేలోపల ‘అవన్నీ సంగీతం ఇచ్చిన సద్గుణాలు’ అన్నాడు జయవంత్. ‘నిజమే. ఆయనెప్పుడూ ఫిలాసఫికల్ యాటిట్యూడ్‌తో, చాలా ప్రశాంతంగా ఉంటారు. మే బీ ఇదంతా సంగీతం వల్లే సాధ్యమేమో అనిపిస్తుంది. సన్‌గా, హజ్బెండ్‌గా, ఫాదర్‌గా పర్ఫెక్ట్ రోల్ ఆయనది. ఈ సమన్వయమూ ఆ సంగీతమిచ్చిన వరమేమో’అని భర్తను మెచ్చుకుంది. ‘మాధవి ఫర్మ్ అండ్ గుడ్ అప్రోచ్. ఆమెలో నాకు చాలా నచ్చిన క్వాలిటీ అది. సెల్ఫ్కాన్ఫిడెంట్. తన కెరీర్‌కి సంబంధించి అస్సలు కాంప్రమైజ్ కాదు. ఒక స్త్రీకి అత్యంత అవసరమైన క్వాలిటీ అది. తన స్పేస్‌ను చాలా కాపాడుకుంటుంది. అలాగే ఎదుటి వాళ్ల స్పేస్‌నూ గౌరవిస్తుంది. మాధవిలోని ఈ పర్సనాలిటే ఆమె పట్ల నేను పదేపదే ప్రేమలో పడేట్టుచేస్తుంది. అంతకంతకూ గౌరవాన్ని పెంచుతుంది. కాకపోతే స్కూల్ టీచర్కదా.. పిల్లల విషయంలో ఆ స్ట్రిక్ట్నెస్ను చూపిస్తుంది. అదొక్కటే నాకు నచ్చని విషయం’ అంటూ భార్యకు కాంప్లిమెంట్స్ ఇస్తూనే మైనస్నూ చెప్పాడు జయవంత్. మాధవి రాగం.. ‘మా పెళ్లయి పదిహేడేళ్లయినా.. ఇంకా తాజాగానే ఉంది మా కాపురం. పెద్దగా కోపాలు, అలకలు లేవు. జయవంత్ ప్రతిసారీ కొత్తగానే కన్పిస్తాడు.. కాబట్టి అండర్స్టాండింగ్ పెరుగుతూనే ఉంది. ఇదంతా బికాజ్ ఆఫ్ మ్యూజిక్కే అనుకుంటాను. మా కాపురం స్ట్రాంగ్ అవడానికి డెఫినెట్‌గా మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తోంది. మాకు మేం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడానికి అదో టూల్‌గా ఉంటోంది. జయవంత్ తన మ్యూజిక్‌తో మా పిల్లలతో సహా ఇంట్లో వాళ్లందరికీ ఓ ఇన్సిపిరేషన్ అండ్ ఐడియల్ మ్యాన్’ అని మాధవి చెప్తుంటే..‘ఆమె అందించిన, ఇస్తున్న సహకారానికి ‘మాధవిరాగాన్ని’ ఆమెకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చేమో భవిష్యత్‌లో’ అన్నాడు నవ్వుతూ జయవంత్. ‘అంటే నన్ను ఇంకొంత త్యాగానికి సిద్ధపడమని చెప్తున్నట్లా?’ అంది మాధవి అదే చిరునవ్వుతో. అంతటితో ఆ ముచ్చట్ల నుంచి సైనాఫ్ అయింది మధుకౌన్స్రాగంలోని మెలోడీని తమ కాపురంలోనూ కంటిన్యూ చేసుకుంటున్న ఈ జంట. - సరస్వతి రమ ఫొటోలు: సృజన్ పున్నా జయవంత్‌నాయుడు, మాధవి -
నా దారి.. రహదారి అంటున్న రాందాస్
నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్.. సమస్యలున్నప్పుడు పరిష్కారాలు దొరుకుతాయి ! ఆ అన్వేషణతోనే రాందాస్ రాథోడ్ ఇలా పరిచయమవుతున్నాడు.. రాందాస్ సొంతూరు నాగార్జునసాగర్‌లోని కుంకుడునెట్టు తండా. ఇంటర్మీడియెట్ అయిపోగానే హైదరాబాద్ వచ్చేశాడు. నాగోల్‌లో ఉన్న వాళ్ల అక్క దగ్గరే ఉండేవాడు. ఓ వైపు పని చేసుకుంటూనే ఓపెన్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. సికింద్రాబాద్ ఎస్.పి కాలేజీలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేశాడు. తర్వాత తారామతి బారాదరిలోని హరిత రెస్టారెంట్లో వెయిటర్‌గా చేరాడు. మూడేళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. మొదట్లో నాగోల్ నుంచి తారామతి వెళ్లేవాడు. ట్రాఫిక్ సముద్రం ఈది అక్కడకు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా పట్టేది. సాయంకాలమైతే మరింత ఆలస్యం ! లాభం లేదని తారామతికి దగ్గర్లోని రాందేవ్గూడకు మకాం మార్చాడు. ఆలోచన ఆగలేదు.. బస అయితే మారింది కానీ ఆ ట్రాఫిక్ జర్నీ అనుభవాలు రాందాస్లో కొత్త ఆలోచనలుగా టేకాఫ్ అయ్యాయి. దానికి తోడు అక్కవాళ్లింటి పక్కనే ఉన్న మూసీ జ్ఞాపకాలు ఊరికే ఉండనివ్వలేదు. పైగా నాగోల్ నుంచి తారామతి వరకు తన ప్రయాణమంతా మూసీ పక్కనుంచే! ఆ ఆలోచనలు. జ్ఞాపకాలు కలగాపులగమై ఏదో కొత్తదారి చూపించసాగాయి. అంతా అస్పష్టంగా ఉంది.. నిర్ధారణకు రాలేకపోతున్నాడు. ఈ మూల నుంచి ఆ మూల వరకు పరచుకున్న దారి ఒక్కటే ఆయన మస్తిష్కంలో ముద్ర వేసుకుంది. షేరింగ్.. కొన్ని రోజుల తర్జనభర్జన తర్వాత మెదడులో మెరిసిన ఆలోచన రాందాస్‌కు అర్థమైంది. అవగాహన కోసం ఒకసారి ఉప్పల్ నుంచి గోల్కొండ దాకా.. మూసీ వెంట నడక సాగించాడు. దారిపొడుగునా.. ఖాళీ ప్రాంతాలు, కబ్జా ఏరియాలు, కట్టడాలు.. ట్రాఫిక్ అన్నింటినీ గమనించాడు. కాస్త అధ్యయనమూ చేశాడు. గోల్కొండ చేరేసరికి తన గమనానికి లక్ష్యం దొకినట్టయింది. వెంటనే తన కొలీగ్స్ సీనియర్ షెఫ్ శ్యామ్‌ప్రసాద్, వెయిటర్లు యాదగిరి, శ్యామ్, ఎలక్ట్ట్రీషియన్ శివశంకర్‌తో తన ఐడియా పంచుకున్నాడు. అది అందరికీ నచ్చి రాందాస్‌కు మద్దతిచ్చారు. ఆ బారు వంతెన.. స్నేహతుల ప్రోత్సాహంతో తన ఐడియాను పేపర్ మీద పెట్టాడు. గండిపేట దగ్గర్లోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్‌ను టచ్ చేస్తూ మొదలైన ఓ దారిని హైదరాబాద్ సిటీలోంచి తీసుకెళ్తూ ఘట్కేసర్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర ముగిస్తూ స్కెచ్ గీశాడు. ఇదంతా మూసీపై నుంచే వెళ్తుంది. మధ్యలో ఉన్న సెంటర్స్‌కు అనుసంధానం అవుతూ సాగుతుంది. 35 కిలోమీటర్ల వంతెన ఇది. ఉప్పల్ నుంచి గండిపేటకు ప్రయాణ సమయాన్ని అరగంటకు కుదించే ఫ్లై ఓవర్ ఇది. ప్రభుత్వానికి అప్పీల్.. ప్లాన్ అయితే స్కెచ్ వేశాడు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇదే విషయం షెఫ్ శ్యాంప్రసాద్‌తో చెప్పాడు. ‘ఇటీవల వరంగల్‌లో ఘంటా చక్రపాణి అధ్యక్షతన తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవచ్చని ఆహ్వానించారు. దాన్ని అవకాశంగా మలచుకుందామ’ని ఆయన సలహా ఇచ్చాడు. వెంటనే తన దగ్గరున్న ప్లాన్ తీసుకెళ్లి ఘంటా చక్రపాణికి ఇచ్చి విషయాన్ని వివరించారు. పరిశీలనకు పెడతామని ఆయన రాందాస్‌కు మాటిచ్చారు. ఆ నిరీక్షణలో ఉన్న ఈ యువకుడు ‘నా ఈ ఫోర్వే ఎక్స్‌ప్రెస్ ప్లాన్ ప్రయాణ భారాన్నే కాదు ట్రాఫిక్‌ను, పొల్యూషన్‌ను తగ్గిస్తుంది. మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమి గురించి, అందులో కబ్జాకు గురైన భూమి గురించి కొంత తెలుసుకున్నాను. వాటిని యుటిలైజ్ చేసుకుంటూ మూసీని ఆనుకుని ఉద్యానవనాలు పెంచొచ్చు. దీనివల్ల అభివృద్ధే కాదు మన సిటీ క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుతుంది. నా ప్లాన్‌లో సాధ్యాసాధ్యాలను గవర్నమెంట్ త్వరగానే స్టడీ చేసి ఓ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. అది అమలైతే గనుక హైదరాబాద్ టూరిజానికీ ఎంతో ఉపయోగం ఉంటుంది. ముక్తాయింపు ఇంజనీరింగ్ డిగ్రీలు, మాస్టర్‌ప్లాన్స్ ఎక్స్పీరియన్స్ లేని సాదాసీదా యువకుడు కేవలం తన అనుభవంలో నుంచి వచ్చిన ఓ ఆలోచనతో ఇచ్చిన ఫ్లై ఓవర్ ఆన్ మూసీ. గండిపేట్ టు ఉప్పల్ అనే ప్రణాళిక గురించి చాలామంది చాలారకాల అభిప్రాయాలు వెలిబుచ్చార ని చెబుతున్నారు జీహెచ్ఎంసీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధ్యాన్ సింగ్. ‘మూసీ నది, హుస్సేన్ సాగర్ నాలాలపైనా ఇలాంటి వంతెనలను నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఐడియా బాగుంది. మంచి సజెషనే. అయితే పర్యవసానాలేంటో ఆలోచించాలి. హైదరాబాద్ ట్రాఫిక్ మీద కెనడాకు చెందిన లీ అసోసియేట్స్ మూడేళ్లు కాంప్రెహెన్సివ్ స్టడీ చేసింది. వాళ్లు ఇలాంటి ప్లాన్ అయితే సజెస్ట్ చేయలేదు. 20 ఏళ్లుగా ఇలాంటి ప్లాన్ పెండింగ్ పెట్టడానికి కారణాలెన్నో. ముంబైలో ట్రాఫిక్‌లా మన దగ్గరా ఎగ్జాస్ట్ అయినప్పుడు మాత్రమే దీన్ని లాస్ట్ చాన్స్‌గా పెట్టుకుంటారు. అయితే ఈ ప్లాన్ వల్ల అటు నాగోల్ నుంచి అత్తాపూర్ వెళ్లే వరకూ చాలా అడ్వంటేజ్ ఉంటుంది. సాధ్యాసాధ్యాలు స్టడీ చాయాల్సిన అవసరం ఉంది’ అంటూ ధ్యాన్ సింగ్ అభిప్రాయపడ్డారు. - సరస్వతి రమ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
ఏనుగు దాడిలో మహిళ మృతి
క్రిష్ణగిరి: ఏనుగు దాడిలో జీనూరుకు చెందిన సరస్వతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన సూళగిరి వద్ద చోటు చేసుకొంది. వడ్డేనూరు అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారి మేలుమలై వద్ద క్రాస్ చేసి సూళగిరి సమీపంలోని జీనూరు వద్దకు చేరుకున్నాయి. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం వద్దకు వచ్చిన సరస్వతి (45)పై మందలోని ఓ ఏనుగు దాడి చేసి తొండంతో బలంగా విసిరేసి ఘీంకారం చేసింది. ఏదో జరిగిందని స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే సరస్వతి తీవ్ర గాయాలతో సృ్పహ తప్పింది. ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేంద్రన్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అటవీశాఖ అధికార్లు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. వేపనపల్లి వైపు బయల్దేరిన ఏనుగుల మంద జీనూరు వద్ద మహిళపై దాడి జరిగిన తర్వాత ఏనుగుల మంద వేపనపల్లి వైపు తరలిపోయాయని, మందలో ఐదు పెద్ద ఏనుగులు, రెండు గున్న ఏనుగులు ఉన్నట్లు స్థానికులు చూశారని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
నువ్వు-నేను.. గౌరీ.. గోపాలం
గౌరి, మధుగోపాల్ దాంపత్యం అనే ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిన రెండు చిత్రాలు వేముల గౌరి, మధుగోపాల్! గౌరి.. రేఖాచిత్రమైతే మధుగోపాల్.. ఛాయాచిత్రం! నిజంగానే ఆమెకు ఆయన నీడ. అలాగని ఆయనేమీ ఆమె చేత్తో కుంచె పట్టించి బొమ్మలు వేయడం నేర్పించలేదు. అసలామాటకొస్తే వాళ్ల పెళ్లయ్యే నాటికే ఆమె కాస్త పేరున్న ఆర్టిస్ట్. ఢిల్లీలాంటి పెద్దపెద్ద నగరాల్లో చాలా షోస్ చేసి ఉంది. మధుగోపాల్ ఇంకా స్ట్రగ్లింగ్లోనే ఉన్నాడు. గౌరికి తన సలహాలు, సూచనలు అవసరం లేదనీ ఆయనకు తెలుసు. అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండరు కదా.. ఈ పాయింటే మధుని గౌరీకి ఛాయగా నిలిపింది. ఒక ఆలోచనొచ్చిందే తడవుగా గౌరి బ్రష్ పట్టుకొని పని మొదలుపెట్టేస్తుంది. తను అనుకున్నది అనుకున్నట్టు కాన్వాస్ మీద కనిపించే దాకా కన్నెత్తి చూడదు. ఆరుగంటలైనా.. పన్నెండు గంటలైనా! తర్వాత.. పూర్తయిన ఆ బొమ్మకు ఫ్రేమ్‌వర్క్ చేసుకోవడంలో పడిపోతుంది. ఇలాంటి టైమ్‌లోనే మధు ఛాయలా అమెనంటిపెట్టుకుంటాడు. గౌరీకి కలర్స్ మీద పట్టుంది కానీ కంప్యూటర్ మీద లేదు. అది మధుకి ఉంది. అందుకే ఆమె మెయిల్ ఐడీ క్రియేట్ చేయడం దగ్గర్నుంచి మెయిల్స్ చెక్ చేయడం, రిప్లయ్ పెట్టడం, ప్రోగ్రామింగ్ షెడ్యూల్ సెట్ చేయడం.. వంటివన్నీ చేస్తాడు ఇష్టంగా! ‘తన పని తప్ప ఇంకేదీ పట్టించుకోదు. వర్క్‌ని రికార్డ్ చేసుకోవాలన్న ధ్యాసా ఉండదు. అవన్నీ నేను చేస్తుంటా’ అంటాడు ప్రేమగా. ‘అందుకే పెళ్లికి ముందు నేను చేసిన వర్క్స్ ఏవీ లేవు నా దగ్గర. ఏమున్నా పెళ్లి తర్వాత వర్క్ రికార్డే.. బికాజ్ ఆఫ్ మధు!’ అని చెప్తుంది గౌరి ఆరాధనగా! మరి మధుకి గౌరి? తోడు. మధుగోపాల్ ఫొటోగ్రాఫ్స్కి తగిన ఫ్రేమ్స్‌ని ఆమే సెలక్ట్ చేస్తుంది. ఫొటోగ్రఫీకి టెక్నికల్ వ్యవహారాలెక్కువ. ఆదాయం కన్నా ఖర్చూ ఎక్కువ. టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడల్లా మధూ అప్డేట్ కావాలి. మార్కెట్లోకొచ్చిన కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి. అలాంటప్పుడే గౌరీ.. మధుకి తోడుగా ఉంటుంది అప్పు ఇచ్చి. ‘ఫలానా టైమ్‌కల్లా తిరిగి డబ్బు తిరిగిచ్చేయాలంటాను’ అని గౌరి అంటుంటే ‘ఆ బాండ్లో ఎప్పుడూ లేను. ఆమె చెప్పిన టైమ్‌లో తిరిగిచ్చింది ఎప్పుడూ లేదు’ అంటాడు మధు నవ్వుతూ. ‘ఏం చేస్తాం.. నేను సంవత్సరమంతా పనిచేసినా సంపాదించలేనంత ఎమౌంట్‌ని ఆమె ఒక్క వర్క్‌తో గెయిన్ చేస్తుంది. ఆర్ట్ వాల్యూ అది.. ఫొటోగ్రఫి రెస్పెక్ట్ ఇలాంటిది’ కన్‌క్లూజన్ ఇస్తున్నట్టుగా మధు. ‘మా ఇద్దరి సంపాదనా ఇంటికోసమే. ఆయనకు నేనిచ్చినా.. నాకు ఆయనిచ్చినా.. ఒకటే కదా. ఫలానా టైమ్‌కల్లా ఇచ్చేయాలనే ప్రెషర్ నా డబ్బుని నేను తీసేసుకోవాలని కాదు.. ఆ వంకతో ఆయనను తన వర్క్ మీద మరింత కాన్సన్ట్రేట్ అయ్యేట్టు చేయడానికే’ అంటుంది గౌరి. ‘తను చెప్పింది నిజమే. గౌరీ ఫైనాన్షియల్లీ సౌండ్ కావడం వల్ల నాకింకో వెసులుబాటూ ఉంది. నేను బయటెక్కడో అప్పు తీసుకొని దానికి ఇంట్రెస్ట్ పే చేసే బాధా తప్పుతోంది కదా’ అంటాడు మళ్లీ నవ్వుతూ. తోడునీడలా మెలిగే ఈ అలుమగలకు ఇంకొకరి స్పేస్‌ని గౌరవించడమూ తెలుసు. సహాయం తప్ప ఇన్వాల్వ్ ఉండదు. సమాచారం ఇవ్వడం తప్ప ఇన్సిస్ట్లుండవ్. ‘ఏ ఆర్ట్‌గ్యాలరీ వాళ్లు వచ్చి మీ షో పెడతామన్నా ఠక్కున ఒప్పేసుకుంటుంది. అది ఎలాంటి గ్యాలరీ.. దాని రెప్యూటేషన్ ఏంటీ అని ఆలోచించదు. ‘తొందరపడకు. ఆ గ్యాలరీ గురించి తెలుసుకొని ఓకే చెప్పు’ అని సలహా మాత్రం చెప్తాను. డెసిషన్ తనదే’ గౌరీ కెరీర్లో తన పరిధి గురించి వివరిస్తూ మధు. ‘తను తీసిన ఫొటోగ్రఫీలో డీటేల్స్.. బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పడం తప్ప ఇంకేం ఇన్వాల్వ్కాను’ కరాఖండిగా గౌరి. అసూయలు.. అలగటాలు? ‘అస్సలుండవ్’ అంటారు ముక్త కంఠంతో. ‘ఫొటోగ్రఫి కన్నా ఆర్ట్ రిచ్. దానికున్న డిమాండ్ ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. కాబట్టి నాకు గౌరీ పనిపట్ల .. ఆమె పేరుప్రఖ్యాతుల పట్ల జెలస్లాంటిదెప్పుడూ లేదు, ఉండదు.’ అంటాడు గౌరీ పట్ల ఎంతో గౌరవంతో. ‘ఫొటోగ్రఫికి ఉన్న హద్దులు.. పరిధి నాకు ముందే తెలుసు. అయితే పెళ్లప్పటికే మధుకి ఓ స్టూడియో ఉండటం.. ఆయన పట్ల నాకు ఓ నమ్మకాన్ని కుదిర్చింది. అది వమ్ముకాలేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అండర్ ఎస్టిమేషన్స్ లేవు కాబట్టి ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనే అలకలకు చాన్స్ లేదు, ఉండదు’ అని చెప్తుంది గౌరి బల్లగుద్దినట్టు. ప్రతి ట్రిప్ హానీమూనే.. అండర్స్టాండిగ్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా ఉండే ఈ జంట పెళ్లి వయసు పదేళ్లు. వీళ్లకు తొమ్మిదేళ్ల బాబు. పెళ్లయిన కొత్తలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే తాజాదనం వీళ్ల దాంపత్యంలో. మధు ఫొటోషూట్ కోసం ఏ టూర్‌కి వెళ్లినా వెళ్తుంది గౌరి. అక్కడ మధు కెమెరా లెన్స్‌లు అడ్జస్ట్ చేసుకుంటే గౌరి కాన్వాస్ బిగిస్తుంది. ఇది మధు.. గౌరీకిచ్చే కానుక. గౌరి.. మధుకిచ్చే బహుమతీ ఉంటుంది. తన ఆర్ట్‌ని ఇన్వైట్ చేసిన గ్యాలరీస్కి మధుని పరిచయం చేస్తుంది. ఆయన పనితనం చూసిన గ్యాలరీలు అతనికీ ఆఫర్ ఇస్తాయి. మధు ఛాయాచిత్రాలకు ఎంతలా ఇంప్రెస్ అవుతాయంటే.. తర్వాత గౌరీని కూడా మరిచిపోయేంతలా. ఇంతటి అవగాహన ఉంది కాబట్టే సక్సెస్‌గ్రాఫ్ అటూఇటైనా బ్యాలెన్స్డ్గా సాగిపోతోందీ జంట! - సరస్వతి రమ -
జాయ్ ఆఫ్ డాన్స్
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. ఐదంకెల జీతం.. లగ్జరీ లైఫ్. ఇదంతా పైకే. మరోవైపు భరించలేని ఒత్తిడి.. ప్రశాంతత దూరం. ఈ మానసిక వేదనకు చెక్ పెట్టాలనుకున్నారు సరస్వతి. తనలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారినీ గట్టెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘డ్యాన్స్’తో ఒత్తిడిని చిత్తు చేయవచ్చని నిరూపించారు. డ్యాన్స్ కాంపిటీషన్స పెట్టి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బొల్ల సరస్వతి రావు సీఏ పూర్తి చేసి కొన్నాళ్లు ఓ కార్పొరేట్ కంపెనీలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇంకొంత కాలం ఇతర కంపెనీల్లో విధులు నిర్వహించారు. ఏ కంపెనీలో చూసినా ఒత్తిడి తప్పలేదు. అందరి పరిస్థితీ ఇదేనని ఆమె గమనించారు. విధులకు కాసింత ఉత్సాహం తోడైతే ఉరిమే ఉల్లాసాన్ని పొందవచ్చని గ్రహించారు. ఇందుకోసం ఆమె డ్యాన్స్‌ను ఎంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు డ్యాన్స్‌ని వంటబట్టిస్తే చాలు.. కచ్చితంగా మనసు కుదుట పడుతుందని నమ్మారు. ఈ సూత్రాన్ని లయబద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ‘చాస్ డ్యాన్స్ స్టూడియో’కి ప్రాణం పోశారు. సదరు కంపెనీల అనుమతి తీసుకుని ఉద్యోగులు పనిచేస్తున్న చోటే నృత్యాక్షరాలు నేర్పిస్తున్నారామె. కేవలం డ్యాన్స్ నేర్పడంతో ఊరుకోకుండా ‘లైమ్లైట్ ఇంటర్-కార్పొరేట్ డ్యాన్స్ కాంపిటీషన్’ను తెరమీదకు తీసుకొచ్చారు. ‘జాయ్ ఆఫ్ డ్యాన్స్’... లాస్ట్ ఇయర్ బెంగళూరులో నిర్వహించిన ఈ కాంపిటీషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫోసిస్ టీమ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. తొలిసారి నగరంలో... మొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. నవంబర్ రెండో వారంలో హైటెక్ సిటీ ఇందుకు వేదిక కానుంది. ఒక్కో కార్పొరేట్ కంపెనీ నుంచి 15 మంది సభ్యులకు మించకుండా ఎన్ని గ్రూపులైనా పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులుంటాయి. కాంపిటీషన్ నిర్వహణకు పోను మిగిలిన డబ్బును అనాథ పిల్లలకు డొనేట్ చేస్తున్నామని గురువారం సోవూజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సవూవేశంలో సరస్వతి చెప్పారు. వివరాలకు 080-41620127లో సంప్రదించవచ్చన్నారు. - మహి -
పాపం చిన్నారులు
చిలకపాలెంలో దంపతుల ఆత్మహత్య అనాధలైన కుమారులు ఎచ్చెర్ల క్యాంపస్: జెండా పండుగను అందరితో కలిసి ఘనంగా జరుపుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన బహుమతులు అమ్మానాన్నలకు చూపించాలని భావించి తమ్ముడితో కలిసి గురువారం రాత్రి 9 గంటలలోపే నిద్రకు ఉపక్రమించాడు ఆ కుర్రాడు. కానీ విధి వారి జీవితంతో ఆడుకుంది. ఉదయానే స్కూలుకు వేగిరంగా వెళ్లాలని నిద్ర లేచిన పిల్లలకు ఇంట్లో అమ్మా నాన్న కనిపించలేదు. ఏమయ్యారో ఇరుగుపొరుగు వారిని అడిగితే సరైన సమాధానం రాలేదు. చుట్టుపక్కల వెతికితే ఓ పాడుపడిన బావి దగ్గర తండ్రి సెల్ ఫోన్, కాళ్ల చెప్పులు కనిపించడంతో ఆందోళన చెందారు. బావిలో చూసేసరికి వారి నెత్తిన పిడుగుపడినట్లయింది. తల్లిదండ్రులిద్దనూ విగతజీవులుగా బావిలో కనిపించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. వివరాలు ఇవీ... లావేరుకు చెందిన వాలపల్లి సత్యనారాయణ (45), సరస్వతి (40)కి 20 ఏళ్ల కిందట వివాహం అయింది. 15 ఏళ్ల కిందట వాళ్లు చిలకపాలెం జంక్షన్‌ను వలస వచ్చారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కల్యాణ్ ఎచ్చెర్లలోని వెంకటసాయి ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి, చిన్నకుమారుడు ప్రసాద్ అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇటుకల పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు గానీ, అప్పులు గానీ లేవని బంధువులు చెబుతున్నారు. అయితే మద్యం వ్యసనం ఉన్న సత్యనారాయణ తరచూ భార్య సరస్వతితో గొడవపడుతుండేవాడు. గురువారం రాత్రి 9 గంటలకు పిల్లలిద్దరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఏంజరిగిందో తెలియదుగానీ క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ పిల్లలను విచారణ చేశారు. వారు కూడా దాదాపుగా స్థానికులు, బంధువులు చెప్పిన విషయాలే చెప్పడంతో భార్యాభర్తలది ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు. సత్యనారాయణ దంపతుల ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. సత్యనారాయణ అన్నయ్య లావేరులోను, తమ్ముడు వీరభద్రరావు చిలకపాలెంలోనూ ఉంటున్నారు .విషయం తెలిసి లావేరు మండలం నుంచి బంధువులు తరలివచ్చారు. కాగా పోలీసులు మృతదేహాలను బావిలోకి బయటకు తీయించి శవ పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపం కల్యాణ్ కల్యాణ్‌కు చురుకైన విద్యార్థిగా పేరుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల స్కూల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా గెలిచాడు. అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందుకోవాలని ఎంతో ఆశించాడు. కానీ ఊహించని రీతిలో ఇంట్లో విషాదం నెలకొనడంతో తల్లిదండ్రుల అంత్యక్రియల్లో పాల్గోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల మృతదేహాల ఎదుట కల్యాణ్, ప్రసాద్ గుండలవిసేలా విలపిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. -
బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం
నమ్మించి మోసం చేసిన సీఎం నాగయ్యగారిపల్లె మహిళల ఆవేదన చంద్రగిరి: ఎన్నికలకు ముందు మహిళల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుం టాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రగిరి సభలో చంద్రబాబు గుప్పించిన హామీలపై పొదుపు సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి కేవలం లక్ష రూపాయలు మాఫీ చేస్తానని, అది కూడా ఇప్పట్లో చెయ్యలేనని అనడంతో మహిళలు నివ్వెరపోయారు. ఇంత మోసం చేస్తాడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలంలోని నాగయ్యగారిపల్లె దళితవాడలోని సరోజిని మహిళ సంఘం, ఇందిరా మహిళా సంఘం, నల్ల గంగమ్మ, ప్రగతి, సరస్వతి మహిళా సంఘాల సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఒక్కొక్క మహిళకు కేవలం 10 వేల రూపాయలు రుణం మాఫీ చేస్తాననడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నించారు. రుణాలు తాము ఎవ్వరూ కట్టమన్నారు. చంద్రబాబునాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తే తప్ప డ్వాక్రా రుణాలు చెల్లించలేమన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మహిళల రుణాలన్నీ మాఫీ చేయాలన్నారు. రుణాలు మాఫీ చేయకుంటే మహిళా సభ్యులు అంతా కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. చేయలేనప్పుడు హామీలు ఎందుకివ్వాలి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని గొప్పలు పలికి, ప్రస్తుతం మాఫీ చేయలేనప్పుడు హామీ లు ఎందుకిచ్చారు. డ్వాక్రా మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకుంటామని చంద్రగిరిలో జరిగిన సభలో చెప్పారు. ప్రస్తుతం 10 వేలు మాత్రమే మాఫీ చేస్తానంటే ఎలా? మిగిలిన రుణం ఎవరు చెల్లిస్తారు? ఇది మోసం కాదా! -దాక్షాయణి, లీడర్ నల్లగంగమ్మ మహిళా సంఘం, నాగయ్యగారిపల్లె బాబుని ఇక నమ్మే ప్రసక్తే లేదు చంద్రబాబునాయుడును ఇక జన్మలో నమ్మే ప్రసక్తేలేదు. మహిళలను నమ్మించి నట్టేట ముంచారు. గతంలో ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు వడ్డీల పేరుతో మోసం చేశారు. ప్రస్తుతం రుణ మాఫీల పేరుతో మోసం చేశారు. ఇక చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేదు. -డి.భారతి, ఇందిరా మహిళా సంఘం లీడర్, నాగయ్యగారిపల్లె నమ్మక ద్రోహం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా పక్క గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రతి ఒక్కరూ ఆయన్ను నమ్మి ఓట్లు వేశాం. ఎన్నికల ముందు గొప్పలు పలికారు. మహిళల పక్కన నిబడతానన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత మహిళలను పూర్తిగా మరిచారు. ఆడవారి ఉసురు ఆయనకు తప్పకుండా తగులుతుంది. -సరస్వతి, లీడర్, సరోజిని మహిళా సంఘం, నాగయ్యగారిపల్లె -
కడుపు ‘కోత’
►అవసరం లేకున్నా సిజేరియన్లు ►ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్వాకం ►అనారోగ్యం బారిన మహిళలు ►హెచ్చరికలు చేశాం: డీఎంహెచ్ఓ పాలమూరు: కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే చేసే ఆపరేషన్.. అవసరం ఉన్నా లేకున్నా చేస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, మెటర్నిటీ నర్సింగ్‌హోమ్‌ల కాసులకక్కుర్తి కొంతమంది తల్లులకు కడుపుకోతను మిగిల్చుతోంది. ఏడాదికాలంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న శస్త్రచికిత్స(సిజేరియన్లు)లను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. పురిటినొప్పులతో బాధపడుతూ ఆస్పత్రులను ఆశ్ర యించే వారి అమాయకత్వాన్ని కొందరు వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో మెటర్నిటీ ఆస్పత్రులు 100కు పైగా ఉన్నాయి. రోజుకు ఐదు నుంచి ఏడు వరకు కే సులు వస్తే వారంలో రెండు లేదా మూడు కేసులకు మాత్రమే సహజ ప్రసవాలు జరుగుతున్నాయి. మూడేళ్లుగా ప్రసవాలరికార్డులను పరిశీలిస్తే సహజ ప్రసవాలు తగ్గాయి. జిల్లాలో ఏటా దాదాపు 50వేల కాన్పులు జరుగుతుండగా.. అందులో 30వేల వరకు ప్రైవేట్ దవాఖానాల్లోనే జరుగుతున్నాయి. జిల్లాలోని చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, సకాలంలో వైద్యం అందదన్న కారణంతో చాలామంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా స్త్రీ వైద్య నిపుణులు, ఎనస్తీషియా వైద్యుల కొరత తదితర కారణాలతో సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండా పోయింది. సిజేరియన్ ఎప్పుడు అవసరం శిశువు మెడకు రెండు వరసలు పేగుచుట్టుకున్న సందర్భంలో సిజేరియన్ అవసరమని స్త్రీవైద్య నిపుణులు సూచిస్తున్నారు. బిడ్డ అడ్డంగా తిరిగి ఉండటం, సాధారణంగా శిశువు తలకిందకు.. కాళ్లు పైకి ఉండాలి. అలా కాకుండా శిశువు తలపైకి, కాళ్లు కిందకి ఉన్నప్పుడు తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుంది.. ఈ సందర్భంలో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుంది. ప్రసవాల కోసం జరిపే శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మత్తుమందు ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వెన్నుపూసకు ఇచ్చే మత్తు ప్రభావం కొందరు మహిళలపై భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే.. వైద్యులు రోగి పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుని అందుకనుగుణంగా కొన్ని పద్ధతుల ద్వారా నార్మల్ డెలివరీనే చేయాలి. ఇటీవల చాలామంది తమకు సిజేరియన్ చేయమని వైద్యులను కోరుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అటువంటి వారికి వైద్యులు తగిన విధంగా అవగాహన కల్పించి నార్మల్ డెలివరీకి ఒప్పించాలి. సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫొటోగ్రామ్ పరీక్ష ఆధారంగా కూడా సాధారణ డెలివరీకి అవకాశం లేని సందర్భంలో సిజేరియన్ చేయాలి. వయసు పెరిగిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి కారణాలవల్ల కూడా నార్మల్ డెలివరీ అయ్యేపరిస్థితులు ఉండటంలేదు. గర్భందాల్చిన మహిళకు హైబీపీ ఉండటం, ఇతర ఇబ్బందికర పరిస్థితుల్లో సిజేరియన్ జరుగుతుంది. - లక్ష్మి పద్మప్రియ, స్త్రీవైద్య నిపుణురాలు, మహబూబ్‌నగర్ శస్త్రచికిత్సలపై హెచ్చరించాం అవసరమైతేనే శస్త్రచికిత్సలు చేయాలి. పురిటి నొప్పులు ఎక్కువయ్యాయని శస్త్ర చికిత్సల ద్వారా కాన్పుచేయాలని వైద్యులపై ఒత్తిడి పెంచడం సరికాదు. గర్భిణుల బంధువులు కూడా వైద్యులకు సహకరించాలి. ముందుగా పట్టించుకోరు.. ఇబ్బందిగా ఉన్నప్పుడే ఆస్పత్రులకు వస్తుంటారు. దీంతో వైద్యులకు ఇబ్బంది కలుగుతోంది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలపై వివరణ కావాలని హెచ్చరికలు జారీచేశాం. ఇతర జిల్లాలతో పోల్చితే మనజిల్లాలో శస్త్రచికిత్సల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో 30 శాతం మాత్రమే సిజేరియన్లు ఉన్నాయి. ఈ సంఖ్యను కూడా తగ్గించేందుకు కృషిచేస్తున్నాం. - సరస్వతి, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
శంకరరావు, సరస్వతి కుటుంబంతో...
చెన్నై ఘటనలో మృతి చెందిన మక్కువ మండలం గైశీల గ్రామానికి చెందిన వెంపటాపు శంకరరావు, మజ్జి సరస్వతి(అక్కా,తమ్ముళ్లు) కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జగన్: ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబంలో ఇద్దరు చనిపోయారా? తల్లి నారాయణమ్మ(భోరున విలపిస్తూ): ఔను బాబూ. మూడు సంవత్సరాల క్రితం అదే చెన్నైలో మరో కుమారుడు శ్రీను కూడా ఇలాగే చనిపోయాడు. జగన్: అయ్యో ఏడవకమ్మా... ఏం చేస్తాం. సహాయం అందిందా? కుటుంబ సభ్యులు: ప్రభుత్వం నుంచి అందింది. కానీ గతంలో చనిపోయిన శ్రీనుకు ఒక్కరూపాయి రాలేదు. జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి సాయం అందలేదు కదా. బిల్డర్‌పై కేసు వేసి నష్ట పరిహారం రాబడదాం. జయలలిత ప్రభుత్వంలో తెలుగాయన ఒకరు ఉన్నారు. మాట్లాడదాం. నారాయణమ్మ: మా శంకరరావుకు మీరంటే ఎంతో ఇష్టం బాబూ. ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం రాలేదని బాధపడ్డాడు. తర్వాత చెన్నై వెళ్లి ఇలా అక్కా, తమ్ముడు చనిపోయారు మీరే ఆదుకోవాలి. జగన్: మీకు వ్యవసాయం ఉందా? పనులు చేస్తారా? శంకరరావు భార్య దుర్గమ్మ: కొంచెం ఉందండీ. ఏవో పనులు చేసుకుంటాం. నారాయణమ్మ : కూతురుకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు కుమారులకు ఇద్దరేసి పిల్లలు. అందరినీ నా దగ్గర వదిలేసి అందరూ చనిపోయారు బాబూ. ఈ వయసులో నన్ను పెంచాల్సింది పోయి వారి పిల్లల్ని పెంచే బాధ్యతలు అప్పగించారు. జగన్: ఆదుకుంటామమ్మా... బాధ పడకండి. మా ఎమ్మెల్యేలు రాజన్నదొర, సుజయ్కృష్ణరంగారావులు అందుబాటులో ఉంటారు. కుటుంబసభ్యులు: సరస్వతి కొడుకు ఐటీఐ చదువుతున్నాడు బాబూ ఉద్యోగం చూడండి. జగన్: నేను చేయనిది చెప్పనమ్మా. నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఉద్యోగాలు వేయలేను కదా. ప్రభుత్వంతో పోరాడి పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూళ్లలో వేసే ఏర్పాటు చేద్దాం. చెన్నై బిల్డర్‌తో మాట్లాడి పరిహారం అందేలా చేద్దాం. -
మహిళను నరికి చంపిన వృద్ధుడు
జంగారెడ్డిగూడెం రూరల్ : క్షణికావేశంలో ఓ వృద్ధుడు మహిళను కత్తితో నరికి చంపిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బేతాళ సరస్వతి(45) స్థానిక ప్రధాన రోడ్డు పక్కన కిళ్లీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటి పక్కనే అదే గ్రామానికి చెందిన వీరెంకి గంగరాజు(72) భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ తరచూ ఒకరినొకరు దూషించుకుంటూ గొడవలు పడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. సరస్వతి ఇంటికి.. గంగరాజు ఇంటి ముందు మరుగ్గా ఉండే స్థలం నుంచి నడిచే దారి ఉంది. బుధవారం సరస్వతి మనవరాలు ఈ దారి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా గంగరాజు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన గంగరాజు కత్తితో సరస్వతి తల, మెడపై నరికాడు. అనంతరం కత్తితో నడుచుకుంటూ వెళ్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయూడు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుకుంటున్న సరస్వతిని బంధువులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ అంబికా ప్రసాద్, ఎస్సై శ్రీహరి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
చైర్మన్ పదవి ఇవ్వలేదని కౌన్సిలర్ రాజీనామా
అనంతపురం:జిల్లాలోని తాడిపత్రి టీడీపీలో ముసలం రాజుకుంది. చైర్ పర్సన్ అభ్యర్థి పదవి ఆశించి భంగపడిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి సరస్వతి తన పదవికి రాజీనామా చేశారు. చైర్ పర్సన్ గా ఆమె ఎన్నిక దాదాపు పూర్తయినా.. చివర్లో పార్టీ నేతలే ఆమెకు షాక్ ఇచ్చారు. అకస్మాత్తుగా వేరే వ్యక్తిని చైర్ పర్సన్ గా తెరపైకి తీసుకురావడంతో మనస్తాపానికి గురై ఆమె తన పదవికి రాజీనామా చేశారు. చివరి నిమిషంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చక్రం తిప్పడంతోనే సరస్వతికి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవి తన దక్కుతుందని సరస్వతికి పార్టీ పెద్దల నుంచి భరోసా లభించినా.. జేసీ రంగప్రవేశంతో అది ఆమెకు దక్కకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈరోజు సాయంత్రానికి సరస్వతి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
వడదెబ్బ మరణాలు @102
శ్రీకాకుళం: వడగాడ్పుల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో జిల్లాలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు శతాధిక వృద్ధుడితో సహా 21 మంది మృతి చెందారు. దీంతో జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య 102కు పెరిగింది. బైరిలో ఒకరు... శ్రీకాకుళం రూరల్: మండలంలోని బైరి గ్రామానికి చెందిన చాట్ల సరస్వతి (35) శనివారం వడ దెబ్బతో చనిపోయిందని స్థానికులు తెలిపారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఖండ్యాంలో మహిళ మృతి రేగిడి: ఖండ్యాం గ్రామానికి చెందిన సవర నర్సమ్మ (65) ఎండవేడిని తట్టుకోలే వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిందని ఎంపీటీసీ సభ్యులు గొలివి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. ఇంట్లోనే ఉన్న నర్సమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయిందని, దీంతో వైద్యసేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కాగా మండలంలో ఇంతవరకు వడదెబ్బతో మృతి ఐదుగురు చనిపోయారు. పాలకొండలో ఇద్దరు.. పాలకొండ రూరల్: మంగళాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు బచ్చల సత్తెమ్మ(75) తన ఇంటి వద్ద ఎండను తట్టుకోలేక ఆదివారం మృతి చెందింది. సత్తెమ్మ మృతి విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేస్తామని సర్పంచ్ కరణం విశాలాక్షి, వైఎస్సార్సీపీ నేత కరణం నానిబాబు తెలిపారు. అలాగే అంపిలి గ్రామానికి చెందిన జడ్డు సూరమ్మ(65) మధ్యాహ్నం 12 గంటల సమయంలో బహిర్భూమికి నాగావళి నదీ తీరానికి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో వడదెబ్బకు గురై మృతి చెందింది. ధర్మవరంలో వృద్ధుడు మృతి ఎచ్చెర్ల క్యాంపస్: ధర్మవరం గ్రామానికి చెందిన వృద్ధుడు కునుకు తవుడు (70) వడదెబ్బతో మృతి చెందాడు. శుక్రవారం పశువులను మెతకు తీసుకెళ్లి ఆయన ఎండ తీవ్రతకు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. సంతకవిటిలో ముగ్గురు.. సంతకవిటి :మండలంలో ముగ్గురు ప్రాణాలను వడగాల్పులు హరించాయి. సంతకవిటికి చెందిన 65 ఏళ్ల ఇజ్జని పార్వతమ్మ ఆదివారం మధ్యాహ్నం తిరుగాడుతుండగానే సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందింది. సిరిపురం గ్రామానికి చెందిన అదపాక సత్యం (70) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, వేడు గాలులు తట్టుకోలే చనిపోయినట్టు అతని భార్య నర్సులమ్మ తెలిపారు. అలాగే చిన్నయ్యపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు మామిడి రాములమ్మ (72)ఆదివారం సాయంత్రం జ్వరం, వడదెబ్బతో చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. వృద్ధుడు మృతి మెళియాపుట్టి: వసుంధర గ్రామానికి చెందిన వృద్ధుడు సింహాద్రి పాత్రో (67) వడ దెబ్బకు మృతి చెందాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి అక్కడే ఎండ వేడిమికి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబీకులు చూసి వైద్యం నిమిత్తం పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని డీటీ రాజేశ్వరరావు, ఎమ్మారై వైకుంఠరావు, వీఆర్వో బాలరాజు, ఎస్సై సంధీప్కుమార్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. కైజోలో ఒకరు..పలాస రూరల్: కైజోల గ్రామానికి చెందిన రాణా రవణమ్మ(65) వడదెబ్బతో మృతి చెందింది. శనివారం రాత్రి నిద్రపోతుండగా ఉక్కపోత, వేడి గాల్పులకు తట్టుకోలేక చనిపోయారు. నరసన్నపేటలో ఇద్దరు.. నరసన్నపేట: నరసన్నపేట హడ్కోకాలనీకి చెందిన ఆశెపు శంకరరావు (35) వడదెబ్బతో మృతి చెందారు. రోజు కూలీగా పనిచేసే శంకరరావు రెండు రోజులుగా వేడిగాలులు తట్టుకోలేక జ్వరం వచ్చి అనారోగ్యానికి గురయ్యారని, ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అతని భార్య తవిటమ్మ తెలియజేశారు. కాగా స్థానికులు విరాళాలు సేకరించి శంకరరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి.. నరసన్నపేట గొండువీధికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెహర గోవిందరావు (70) ఆదివారం వడదెబ్బతో మృతి చెందారు. రెండు రోజులుగా వీస్తున్న వేడి గాలులు, ఎండను తట్టుకోలేని ఆయన మృత్యువత పడినట్టు కుటుంబీకులు తెలిపారు.