జాయ్ ఆఫ్ డాన్స్
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. ఐదంకెల జీతం.. లగ్జరీ లైఫ్. ఇదంతా పైకే. మరోవైపు భరించలేని ఒత్తిడి.. ప్రశాంతత దూరం. ఈ మానసిక వేదనకు చెక్ పెట్టాలనుకున్నారు సరస్వతి. తనలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారినీ గట్టెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘డ్యాన్స్’తో ఒత్తిడిని చిత్తు చేయవచ్చని నిరూపించారు. డ్యాన్స్ కాంపిటీషన్‌స పెట్టి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన బొల్ల సరస్వతి రావు సీఏ పూర్తి చేసి కొన్నాళ్లు ఓ కార్పొరేట్ కంపెనీలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇంకొంత కాలం ఇతర కంపెనీల్లో విధులు నిర్వహించారు. ఏ కంపెనీలో చూసినా ఒత్తిడి తప్పలేదు. అందరి పరిస్థితీ ఇదేనని ఆమె గమనించారు.
విధులకు కాసింత ఉత్సాహం తోడైతే ఉరిమే ఉల్లాసాన్ని పొందవచ్చని గ్రహించారు. ఇందుకోసం ఆమె డ్యాన్స్‌ను ఎంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు డ్యాన్స్‌ని వంటబట్టిస్తే చాలు.. కచ్చితంగా మనసు కుదుట పడుతుందని నమ్మారు. ఈ సూత్రాన్ని లయబద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ‘చాస్ డ్యాన్స్ స్టూడియో’కి ప్రాణం పోశారు. సదరు కంపెనీల అనుమతి తీసుకుని ఉద్యోగులు పనిచేస్తున్న చోటే నృత్యాక్షరాలు నేర్పిస్తున్నారామె. కేవలం డ్యాన్స్ నేర్పడంతో ఊరుకోకుండా ‘లైమ్‌లైట్ ఇంటర్-కార్పొరేట్ డ్యాన్స్ కాంపిటీషన్’ను తెరమీదకు తీసుకొచ్చారు. ‘జాయ్ ఆఫ్ డ్యాన్స్’... లాస్ట్ ఇయర్ బెంగళూరులో నిర్వహించిన ఈ కాంపిటీషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫోసిస్ టీమ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది.
తొలిసారి నగరంలో...
మొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. నవంబర్ రెండో వారంలో హైటెక్ సిటీ ఇందుకు వేదిక కానుంది. ఒక్కో కార్పొరేట్ కంపెనీ నుంచి 15 మంది సభ్యులకు మించకుండా ఎన్ని గ్రూపులైనా పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులుంటాయి. కాంపిటీషన్ నిర్వహణకు పోను మిగిలిన డబ్బును అనాథ పిల్లలకు డొనేట్ చేస్తున్నామని గురువారం సోవూజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సవూవేశంలో సరస్వతి చెప్పారు. వివరాలకు 080-41620127లో సంప్రదించవచ్చన్నారు.
- మహి