![Why the tiffin box and bottle maker Tupperware lost and files for bankruptcy](/styles/webp/s3/article_images/2024/09/19/Tupperware1.jpg.webp?itok=b9V-xAaF)
న్యూయార్క్: నాణ్యమైన ప్లాస్టిక్‌వేర్‌కి పర్యాయపదంగా, ఫుడ్ స్టోరేజీలో కొత్త మార్పులు తెచ్చిన అమెరికన్ దిగ్గజం టప్పర్‌వేర్ బ్రాండ్స్ తాజాగా రుణభారంతో దివాలా ప్రకటించింది. కార్యకలాపాలను యథాప్రకారం కొనసాగిస్తూ, విక్రయానికి వెసులుబాటునిచ్చేలా చాప్టర్ 11 కింద రక్షణ కల్పించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
1946లో ఎర్ల్ టప్పర్ అనే కెమిస్ట్ ప్రారంభించిన టప్పర్‌వేర్ భారత్‌లో కూడా గణనీయంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. పోటీ తీవ్రమవుతుండటంతో 2018 నుంచి కంపెనీ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్–19 తొలినాళ్లలో విక్రయాలు కాస్త మెరుగుపడినప్పటికీ ఆర్థిక కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొత్తం రుణాల భారం 1.2 బిలియన్ డాలర్లుగా, అసెట్స్ 679.5 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు దివాలా పిటీషన్‌లో టప్పర్‌వేర్ పేర్కొంది. సంస్థ షేరు ఈ ఏడాది 75 శాతం మేర పతనమైంది.
Also Read: హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్ని మంచి రోజులేనా?
టప్పర్‌వేర్‌కి 41 దేశాల్లో 5,450 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. అలాగే సుమారు 70 దేశాల్లో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఉత్పత్తులను విక్రయించే కన్సల్టెంట్లు దాదాపు 4,65,000 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment