Corporate company
-
దివాలా తీసిన టప్పర్‌వేర్.. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలుసా?
న్యూయార్క్: నాణ్యమైన ప్లాస్టిక్వేర్కి పర్యాయపదంగా, ఫుడ్ స్టోరేజీలో కొత్త మార్పులు తెచ్చిన అమెరికన్ దిగ్గజం టప్పర్‌వేర్ బ్రాండ్స్ తాజాగా రుణభారంతో దివాలా ప్రకటించింది. కార్యకలాపాలను యథాప్రకారం కొనసాగిస్తూ, విక్రయానికి వెసులుబాటునిచ్చేలా చాప్టర్ 11 కింద రక్షణ కల్పించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.1946లో ఎర్ల్ టప్పర్ అనే కెమిస్ట్ ప్రారంభించిన టప్పర్‌వేర్ భారత్‌లో కూడా గణనీయంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. పోటీ తీవ్రమవుతుండటంతో 2018 నుంచి కంపెనీ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్–19 తొలినాళ్లలో విక్రయాలు కాస్త మెరుగుపడినప్పటికీ ఆర్థిక కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొత్తం రుణాల భారం 1.2 బిలియన్ డాలర్లుగా, అసెట్స్ 679.5 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు దివాలా పిటీషన్లో టప్పర్‌వేర్ పేర్కొంది. సంస్థ షేరు ఈ ఏడాది 75 శాతం మేర పతనమైంది.Also Read: హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్ని మంచి రోజులేనా?టప్పర్వేర్కి 41 దేశాల్లో 5,450 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. అలాగే సుమారు 70 దేశాల్లో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఉత్పత్తులను విక్రయించే కన్సల్టెంట్లు దాదాపు 4,65,000 మంది ఉన్నారు. -
ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ నిర్ణయాలు, కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు మార్కెట్ పనితీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, మూడో దశ కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో గతవారంలో సెన్సెక్స్ 1445 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 17,450 వద్ద మద్దతు స్థాయి, ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని కలిగి ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ శెట్టి తెలిపారు. రేపటి నుంచి ‘పాలసీ’ సమావేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమై గురువారం ముగిస్తుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు మొగ్గుచూపుతున్న వేళ ఆర్బీఐ ద్రవ్యవిధాన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లపైకి చేరడం ఆర్బీఐకి మరో సమస్యగా మారింది. కీలక దశలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, ఏసీసీ, భాష్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా బీఎస్ఈలో నమోదైన 1600కు పైగా కంపెలు ఇదే వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ రాబడులు భారత ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడి గతవారం రెండేళ్ల గరిష్టం 6.9 స్థాయికి చేరింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 1.9 శాతంపైన ముగిసింది. క్రూడాయిల్ ధరల మంటలు రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ మంచు తుఫాన్లతో సప్లై అంతరాయాలు నెలకొని ముడిచమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గడిచిన ఏడు వారాల్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్న వేళ క్రూడ్ ధరలు పెరగడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు ఈ ఫిబ్రవరి తొలి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.3,173 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.3,173 కోట్లను, హైబ్రిడ్ సెగ్మెంట్ నుంచి రూ.34 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. రేపు అదానీ విల్మర్ లిస్టింగ్ ఇటీవల ఐపీఓ పూర్తి చేసుకున్న అదానీ విల్మర్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర (రూ.230) కంటే అధికంగా రూ.25–30 పలుకుతున్నాయి. ఇక ఫిబ్రవరి 4న ప్రారంభమైన మాన్యవర్ మేకర్ ‘వేదాంత ఫ్యాషన్స్’ ఐపీఓ మంగళవారం ముగియనుంది. పాలసీ సమావేశం వాయిదా ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల జరగాల్సిన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. -
3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్’పై ఒప్పందాలు
సాక్షి, అమరావతి: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నిపుణులైన మానవ వనరులను సమకూర్చడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో భాగస్వామ్యం కోసం కార్పొరేట్ సంస్థలు ముందుకు రావటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి సమక్షంలో మూడు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, టెక్ మహీంద్ర ఫౌండేషన్ సీఈవో రాకేష్ సోని, బయోకాన్ అకాడమీ ప్రోగ్రామ్ డీన్ బిందు అజిత్, స్నైడర్ ఎలక్ట్రిక్ ఎడ్యుకేషన్ హెడ్ సాయికృష్ణరావు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. నైపుణ్యాల పెంపుపై సీఎం ప్రత్యేక దృష్టి – ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైతం సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోవటాన్ని గుర్తించి నైపుణ్యాలను పెంపొందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి మేకపాటి తెలిపారు. – యువతకు స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి లక్ష్య సాధనలో టెక్ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్ అకాడమీ, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలు పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. – ఇటీవల ‘ఇకిగయ్’ అనే ఓ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందనేది అందులోని అంతరార్థం. సీఎం జగన్ నిర్దేశించిన 30 స్కిల్ కాలేజీల ఏర్పాటు కూడా అలాంటిదే. ఇవీ ఒప్పందాలు... – తాజా ఒప్పందాల ప్రకారం టెక్ మహీంద్రా ఫౌండేషన్ విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పనుంది. పరిశ్రమల్లో పనిచేసేందుకు అనువైన కోర్సులు, సిలబస్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, స్కిల్ కాలేజీల్లో డిజిటల్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ విభాగాల్లో సర్టిఫికేషన్ కోర్సులను అందించనుంది. – ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్‌కు చెందిన బయోకాన్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో లైఫ్ సైన్సెస్ విభాగంలో నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ, పాఠ్యాంశాలను రూపొందించడంలో బయోకాన్ భాగస్వామ్యం కానుంది. – బహుళజాతి సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్, ఎనర్జీ, ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్ విభాగాల్లో కలసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ నెల్లూరు స్కిల్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇతర జిల్లాల్లోని 12 స్కిల్ సెంటర్లలోనూ ఆటోమేషన్, ఎనర్జీ, మేనేజ్మెంట్ రంగాల్లో భాగస్వామి కానుంది. -
కార్పొరేట్ గుప్పెట్లో ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీల గుప్పెట్లో చిక్కి ఇంటర్మీడియట్ బోర్డు విలవిల్లాడుతోంది. బోర్డు అడ్డాగా కార్పొరేట్ అవినీతి, అక్రమాల దందా దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయింది. బోర్డులోని కొంతమంది కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై ఆ సంస్థల అక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ వస్తు న్నారు. దీంతో ఆ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. బోర్డు లోని తమ అనుకూల వ్యక్తులతో అడ్డగోలు వ్యవ హారాలు నడుపుతూ చివరకు బోర్డు ప్రతిష్టనే అభాసుపాలు చేసే ప్రయత్నాలకు ఒడిగడుతున్నా రని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్మీ డియట్ బోర్డులో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్ పాత్ర పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే వ్యవహారం రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల దందా ఎప్పటినుంచో కొనసాగుతోంది. బోర్డు అధికారుల అలసత్వం, ఆమ్యామ్యాలకు అలవాటు పడడం కారణంగా ఈ సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండడంలేదు. పేరుకే నిబంధనలు జారీచేసే అధి కారులు వాటిపై పకడ్బందీ చర్యలు చేపట్టిన దాఖ లాలు పెద్దగా లేవు. అకడమిక్ అంశాల నుంచి మొదలుకొని కాలేజీల అనుమతులు, నిర్వహణ అంశాల వరకు అదే పరిస్థితి. అంతేకాదు రిటైరైన అధికారులను కన్సల్టెంట్లు, ఓఎస్డీ పేరుతో కొన సాగించేలా పావులు కదిపి తమ పనులను చేయిం చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఈ కార్పొ రేట్ సంస్థల కాలేజీల్లో అనేక తప్పిదాలు, అక్ర మాలు జరుగుతున్నా బోర్డు అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి. ఆశాస్త్రీయ విధానానికి కార్పొరేట్ ఊతం రాష్ట్రంలో అశాస్త్రీయ విద్యావిధానానికి కార్పొరేట్ విద్యాసంస్థలే తెరలేపాయి. అడ్డగోలు విధానాలతో జూనియర్ కాలేజీ విద్యావిధానాన్ని భ్రష్టు పట్టిం చాయి. కొద్దిమంది విద్యార్థుల ర్యాంకులను ఎరచూపి లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఒత్తిడితోనే ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల అమలు జరగడంలేదు. ప్రస్తుతం సీబీఎస్ఈలో 11, 12 తరగతుల విధానం ఉంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో ఇదే విధానం ఉంది. వాటిల్లో జూనియర్ లెక్చరర్ కేడర్‌తో సమానమైన పీజీటీకి బీఎడ్ తప్పనిసరి. కానీ జూనియర్ కాలేజీల్లో కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితోనే ఈ నిబంధన అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కార్పొరేట్ కాలేజీల్లో బోధన నిర్వహించిన 220 రోజులను కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. ఎంసెట్, నీట్, జేఈఈ శిక్షణలతోనే సరిపెడుతున్న యాజమాన్యాలు బోర్డు అధికారులను, జిల్లా ఇంటర్ విద్యా అధికారులను మేనేజ్ చేస్తూ విద్యార్థులపై తీవ్రఒత్తిడి పెంచి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అయినా వీరిపై బోర్డు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పక్కా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల కమిటీ పలుమార్లు సిఫారసు చేసినా, బోర్డు అధికారులు వీటి అమలును గాలికి వదిలేశారు. లోపాలు అనేకం.. అయినా చర్యల్లేవ్! ఒక చోట కాలేజీ అడ్రస్.. మరో చోట విద్యా సంస్థ.. పేరుకే ఆన్లైన్ ప్రవేశాలు.. అంతా ఇష్టారాజ్యమే. ఒక సొసైటీ పేరుతో కాలేజీలు, మరో పేరుతో నిర్వహణ విద్యార్థులకు రక్షణ ఉండదు. వేసవి సెలవుల్లో తరగతుల నిర్వహణ ఇలాంటి అనేక లోపాలపై బోర్డుకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాలేజీల హాస్టళ్లలో ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కి, కనీస వసతులు కల్పించకపోయినా, వాటిపై అనేక ఫిర్యాదులు వచ్చినా బోర్డు అధికారుల్లో కనీస స్పందన లేదు. గతేడాది 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారుల కమిటీలు తనిఖీలు చేశాయి. బోర్డు.. నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులు చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లకు అనుమతులు తప్పనిసరి అని, వాటిల్లో ఉండాల్సిన ప్రమాణాలు, వసతులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా బోర్డు వాటిని పక్కాగా అమలు చేసినా దాఖలాలు లేవు. విద్యార్థుల భవిష్యత్తు పేరుతో కార్పొరేట్ సంస్థలు బోర్డుపై ఒత్తిళ్లు తెచ్చి సడలింపులు పొందుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 500కు పైగా జూనియర్ కాలేజీలు హాస్టళ్లతో నడుస్తుంటే.. అందులో సగం యాజమన్యాలు కూడా బోర్డుకు దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. విద్యార్థుల జీవితాలతో ఆటలు రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయాలు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. పీఆర్వోల వ్యవస్థను పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాటిల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమని వాటిల్లో చేర్చుతూ పిల్లలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు.. అనుమతులు తీసుకోకుండానే బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ, ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. అయినా ర్యాంకుల ప్రచారహోరులో తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తుండటంతో కార్పొరేట్ యాజమాన్యాలు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాయి. కార్పొరేట్ వ్యాపారానికే బోర్డు జై ఇంటర్‌బోర్డు కార్పొరేట్ విద్యావ్యాపారానికి అనుకూల సంస్థగా మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రైవేటు కార్పొరేట్ విద్యావ్యాపారం తెలంగాణలోనే జరుగుతోంది. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల్లో 80 శాతానికిపైగా కార్పొరేట్ కాలేజీల్లోనే ఉన్నారు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వ లెక్చరర్లతోపాటు కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లకు కూడా ఇచ్చారు. ఆయా కాలేజీల నుంచి వచ్చే లెక్చరర్లు నిజంగా వారి కాలేజీల్లో పాఠాలు చెప్పిన వారు కాదు. కాబట్టి వ్యాల్యుయేషన్ పెద్ద ఫార్సుగా మారిపోయింది. కార్పొరేట్ సంస్థలకు బోర్డు సర్వెంట్‌గా మారిపోయింది. కాబట్టి బోర్డును ప్రక్షాళన చేయాలి. లేదా బోర్డు ఎత్తేసి సీబీఎస్ఈ తరహాలో పాఠశాల విద్యలో కలపాలి. – నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘం కమిటీ పరిశీలన పూర్తి! ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన దాదాపుగా పూర్తయింది. టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ వాసన్, ప్రొఫెసన్ నిషాంత్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ.. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం, ఫలితాలకు సంబంధమున్న అధికారులు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా ప్రతినిధులతో వేరువేరుగా విచారించింది. మూడురోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వేగవంతంగా పరిశీలన చేసి గురువారం నాటికి పూర్తిచేసినట్లు తెలిసింది. వాస్తవానికి గురువారం రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కమిటీ నివేదిక సమర్పించలేదని సమాచారం. శుక్రవారం ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సాంకేతిక బాధ్యత మరో సంస్థకు ఇంటర్మీడియట్ రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ రంగసంస్థ సీజీజీ లేదా మరో ఇతర సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకునే అవకాశం ఉంది. గ్లోబరీనాపై పలు తప్పిదాలు చేయడం, తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఇకపై ఆ సంస్థ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 16 నుంచి జరగాల్సిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష (ఏఎస్ఈ) తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం.. వాటికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండడంతో ఏఎస్ఈ తేదీలను ముందుకు జరిపే అవకాశముంది. -
ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలే కీలకం..!
ముంబై: కొనసాగుతున్న కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు, వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ నిధుల ప్రవాహ దిశలే ఈ వారంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇదే సమయంలో ముడిచమురు ధరలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశ పరిణామాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వాణిజ్య యుద్ధ ఆందోళనలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మార్కెట్ స్వల్పకాలం నుంచి మధ్యకాలం వరకు ఒడిదుడుకుల మధ్యనే కొనసాగుతుందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అంచనావేశారు. రూపాయి మారకం విలువ, ముడిచమురు ధరలు, వర్షాకాల సమావేశం నుంచి అందే సంకేతాలు మార్కెట్‌ను నడిపించనున్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలో ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, సిప్లా, లుపిన్, భారత్ ఫోర్జ్, కమిన్స్, జెట్ ఎయిర్వేస్ ఫలితాలను వెల్లడించనుండగా.. ఇవి మార్కెట్ దిశకు కీలకమని అన్నారు. ‘ వాల్యూయేషన్స్ అధికంగా ఉన్నప్పటికీ.. ఆశాజనక రుతుపవనాల సూచనలు, ఫలితాలు గ్రామీణ ప్రాంత వినిమయ రంగ షేర్ల ర్యాలీకి ఆస్కారం ఇవ్వనున్నాయి.’ అని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి విశ్లేషించారు. ‘నాణ్యమైన మిడ్‌క్యాప్ షేర్లలోనికి నిధుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే.. లార్జ్‌క్యాప్ షేర్ల వాల్యూయేషన్స్ ప్రీమియం కంటే ఈ రంగ షేర్ల ప్రీమియం తగ్గుతున్న క్రమంలో పెట్టుబడులు కొనసాగుతాయి.’ అని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆర్బీఐ చర్యలు ఆహ్వానించదగినవే.. అధిక సప్లై కారణంగా ముడిచమురు ధరలు తగ్గనున్నాయని, ఆశాజనక క్యూ1 ఫలితాలు మార్కెట్ ర్యాలీకి సహకరిస్తాయని భావిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనినిద్య బెనర్జీ వెల్లడించారు. ద్రవ్యోల్బణ, వృద్ధిరేటు మధ్య సమతుల్యం సాధించడం కోసం ఆర్బీఐ నెమ్మదిగా వడ్డీరేట్లను పెంచడం మార్కెట్‌కు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సురక్షిత లార్జ్‌క్యాప్, వినిమయ రంగాలకు చెందిన షేర్లు మంచి పనితీరును ప్రదర్శించనున్నాయని అన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ 68.25 నుంచి 69 మధ్యలో ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. గత శుక్రవారం రూపాయి విలువ 68.66 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐల నికర విక్రయాలు... ఆగస్టు 3తో ముగిసిన వారానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) 140 మిలియన్ డాలర్లు (రూ.962) కోట్ల విలువైన పెట్టుబడిని స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే జూలై నెల మొత్తంమీద నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.2,312 కోట్ల పెట్టుబడులను పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్లో రూ.2,264 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.48 కోట్లు పెట్టుబడి చేశారు. ఏప్రిల్–జూన్ కాలంలో ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.61,000 కోట్లను వీరు ఇన్వెస్ట్ చేశారు. మార్చిలో రూ.2,662 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 11,407 పాయింట్ల వద్ద తక్షణ నిరోధం..! ‘నిఫ్టీ తక్షణ నిరోధ స్థాయి 11,407 పాయింట్ల వద్ద ఉండగా.. మద్దతు స్థాయి 11,235 పాయింట్ల వద్ద ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నేడే హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ లిస్టింగ్ రూ.2,800 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ నెల 25న ప్రైమరీ మార్కెట్‌కు వచ్చి 27 నాటి ముగింపు సమయానికి 83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబైన హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ ఇవాళ (సోమవారం) స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు రానుంది. -
బీజేపీకి 705 కోట్లు.. కాంగ్రెస్‌కు 198 కోట్లు
గత నాలుగేళ్లలో కార్పొరేట్ కంపెనీల విరాళాలు న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో బీజేపీ పార్టీకే అత్యధికంగా కార్పొరేట్ కంపెనీల విరాళాలు అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. దేశంలోని జాతీయ పార్టీలకు నాలుగేళ్లలో రూ. 956.77 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు విరాళాలుగా ఇవ్వగా.. ఇందులో అత్యధికంగా 73 శాతం (రూ. 705.81 కోట్లు) నిధులు బీజేపీకే అందాయని పేర్కొంది. 2012–13 నుంచి 2015–16 వరకు ఈ మొత్తం ఆయా పార్టీలకు చేరినట్లు తెలిపిన ఏడీఆర్.. బీజేపీకి 2,987 కార్పొరేట్ సంస్థల నుంచి ఈ మొత్తం అందిందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 167 సంస్థల నుంచి రూ. 198.16 కోట్లు అందినట్లు.. ఎన్నికల సంఘం అందించిన వివరాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఎన్సీపీకి రూ. 50.73 కోట్లు, సీపీఎంకు రూ.1.89కోట్లు, సీపీఐకి రూ. 18 లక్షలు విరాళాలుగా అందాయి. 1,546 మంది దాతల నుంచి జాతీయ పార్టీలకు వచ్చిన 355.08 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరు విరాళాలు ఇచ్చారనే వివరాల్లేవు. ఇలాంటి వాటిలో బీజేపీకి వచ్చిన వాటిలో రూ. 159.59 కోట్ల విరాళాల్లో 99 శాతం నిధులకు పాన్ నంబర్లు, చిరునామాలు వెల్లడించలేదని ఏడీఆర్ తెలిపింది. ఏ ఒక్కరి నుంచి కూడా రూ. 20వేల కన్నా ఎక్కువ మొత్తం స్వచ్ఛంద విరాళంగా అందనందున బీఎస్పీని ఈ జాబితాలో చేర్చలేదని ఏడీఆర్ తెలిపింది. ‘గత నాలుగేళ్లలో ఐదు జాతీయ పార్టీలకు రూ.1,070.68 కోట్ల విరాళం అందింది. ఇందులో రూ. 956.77 కోట్లు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిందే’ అని సంస్థ పేర్కొంది. 2004–05 నుంచి 2011–12 వరకు (ఎనిమిదేళ్లలో) జాతీయ పార్టీలకు రూ. 378.89 కోట్ల విరాళం అందిందని ఏడీఆర్ గుర్తుచేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి రూ.20వేల కన్నా ఎక్కువగా చేసే విరాళాల వివరాలు ప్రకటించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ దాతల వివరాలను, అందిన మొత్తాన్ని ఈసీకి అందజేశాయి. 2014–15 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీలకు కార్పొరేట్ ఫండింగ్ పెద్దమొత్తంలో జరిగిందని కూడా ఏడీఆర్ వెల్లడించింది. ఆ సమయంలోనే బీజేపీకి ఎక్కువ విరాళాలు అందాయని పేర్కొంది. -
వేధింపులకు కళ్లెమేదీ?
పని ప్రదేశాల్లో మహిళలపై పెరుగుతున్న వేధింపులు రమ.. ఓ కార్పొరేట్ ఆఫీస్‌లో మానవ వనరుల విభాగంలో పనిచేస్తోంది. ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు చలాకీగా కనిపించే ఆమె.. ఇంటికి రాగానే దిగాలుగా కన్పిస్తోంది! తనలో తానే కుమిలిపోతోంది. ఓరోజు భర్తకు అసలు విషయం చెప్పి గొల్లున ఏడ్చింది. తన పైఅధికారి అనుచిత ప్రవర్తనను భరించలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. పోలీస్ కేసు నమోదు చేద్దామన్న భర్త సలహాను సున్నితంగా తిరస్కరిస్తూ.. విషయం పెద్దదైతే పరువు పోతుందని వాపోయింది. సునీత.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏడాదికి రూ. 5.5 లక్షల ప్యాకేజీతో ఉద్యో గంలో చేరింది. రెండేళ్లలో రెట్టింపు జీతంతో పదో న్నతి పొందింది. కానీ ఈ మధ్య ఉద్యోగం మానేస్తానని, లేదంటే వేరే కంపెనీలో చేరతానని భర్తతో అంటోంది. కారణం తెలుసుకు నే ప్రయత్నం చేశాడు సునీత భర్త. టీమ్ లీడర్ వేధింపులే కారణమని తెలియ డంతో కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన యాజమాన్యం.. సునీతను మరో టీమ్‌కు బదిలీ చేసిం ది. ఆ టీమ్‌లోనూ సర్దుకోలేక సునీత ఉద్యోగానికి రాజీనామా చేసింది. సాక్షి, హైదరాబాద్ : చట్టాలున్నా.. ఎన్నో నియంత్రణలు ఉన్నా పనిచేసే చోట మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో కార్పొరేట్ కంపెనీల్లో స్వేచ్ఛగా పనిచేయాలంటే మహిళలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హైదరాబాద్‌లోనూ కార్పొరేట్ కంపెనీలతో పాటు సాధారణ, మధ్య తరహా సంస్థల్లో వేధింపులు తీవ్రంగా ఉన్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సగటున 58 శాతం మహిళలు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నట్లు ఆ శాఖ ఇటీవల నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. మహిళలు ఉద్యోగం చేసే చోట వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు 2013లోనే కేంద్రం ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్’ను తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సంస్థ, కార్యాలయంలో కచ్చితంగా ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో మహిళా ఉద్యోగులనే ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేయాలి. లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, పరుష పదజాలంతో దూషణ తదితర పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు నేరుగా ఈ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదుపై వెంటనే కమిటీ సమావేశమై విచారణ చేసి, తక్షణ చర్యలకు యాజమాన్యానికి సిఫార్సు చేయాలి. యాజమాన్యం ఆ సిఫార్సును అమలు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ కమిటీలను తప్పకుండా ఏర్పాటు చేయాలి. కానీ వీటి ఏర్పాటు, నిర్వహణ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీ చట్టం ప్రకారం ప్రతి ఆఫీసులో అంతర్గత కమిటీ ఉన్నట్టే.. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. కార్యాలయాలు, సంస్థల్లోని కమిటీలో స్పందన లేకుంటే జిల్లా స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. జిల్లాస్థాయికి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవే ఉంటున్నాయి. గతనెలలో రాష్ట్రవ్యాప్తంగా 19 కేసులు జిల్లాస్థాయి కమిటీ దృష్టికి రాగా.. వాటిలో 17 కేసులను పరిష్కరించారు. వీటిలో అధికంగా నల్లగొండ జిల్లాలో 5, వరంగల్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 3 కేసులున్నాయి. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. పేరుకే.. కమిటీలు! వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తెచ్చిన చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేట్ కంపెనీలు మినహాయిస్తే మధ్య తరహా, చిన్న కంపెనీల్లో అంతర్గత కమిటీలే ఏర్పాటు కాలేదు. కొన్నిచోట్ల కమిటీలు ఏర్పాటు చేసినా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడం, సమస్యలపై చర్చించడం లాంటివి జరగడం లేదు. ఈ కమిటీలపై పర్యవేక్షణ కూడా పెద్దగా లేకపోవడంతో చట్టం పకడ్బందీగా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్తగా ఉమెన్ హెల్ప్‌లైన్ (181)ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఫిర్యాదుకు వెనుకాడుతున్న బాధితులు పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్న మహిళల్లో చాలామంది ఫిర్యాదుకు దూరంగా ఉంటు న్నారు. ఫిర్యాదు చేస్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయంతో కొందరు, ఇంక్రిమెంట్లు, పదోన్నతిలో ఇబ్బందులు వస్తాయేమోనన్న భావనతో మరికొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. -
ప్రైవేట్ సాగు
-
ప్రైవేట్ సాగు
చిన్న, సన్నకారు రైతుల భూములు కార్పొరేట్ కంపెనీలకు లీజుకు - భూమి లీజు చట్టం తెచ్చేందుకు రాష్ట్రం కసరత్తు - కార్పొరేట్ కంపెనీ దయాదాక్షిణ్యాలపై అన్నదాత జీవితం? సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం ఇక ప్రైవేట్ పరం కానుంది. సన్న, చిన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా భూమి లీజు చట్టాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టామని నీతి ఆయోగ్‌కు ఇప్పటికే నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కాంట్రాక్టు వ్యవసాయం తరహాలో ఉండే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అంటే ఒక గ్రామంలో గల చిన్న, సన్నకారు వ్యవసాయదారుల భూమి అంతటినీ కార్పొరేట్ కంపెనీకి లీజుకు ఇస్తారు. ఆ కంపెనీ ఆ మొత్తం భూమిలో ఆధునిక పరిజ్ఞానంతో, మెలకువలతో వ్యవసాయం చేస్తుంది. తద్వారా వచ్చే ఆదాయంలో సాగుకయ్యే వ్యయాన్ని మినహాయించుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా లేదా తొలుత ఆయా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు రైతులకు డబ్బులను చెల్లిస్తుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక సారాంశాన్ని నీతి ఆయోగ్ ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఏపీని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ వ్యవసాయం ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే ఇందుకు మెజారిటీ రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైతులను వ్యవlసాయానికి దూరం చేస్తారా? దేశంలో అత్యధిక శాతం చిన్న కమతాల రైతులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని నీతి ఆయోగ్ పేర్కొంది. అలాంటి సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే, వ్యవసాయంలో యంత్రీకరణ పెరుగుతుం దని, రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్ కంపెనీలకు లాభాపేక్ష తప్ప రైతుల జీవనోపాధి మెరుగుపరచడానికి ఎందుకు చర్యలు తీసుకుంటాయని రైతు ఉద్యమ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే భూములను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే 2013 భూసేకరణచట్టం నిబంధనలను పాటించకుండా, సామాజిక ప్రభావ అంచనా లేకుండా రైతులనుంచి బలవంతంగా సేకరించడాన్ని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. మరోవైపు తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌పార్కు, భోగాపురం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు పేరుతో వేలాది ఎకరాల పంట భూములను బలవంతంగా సేకరిస్తూ... కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రతిజిల్లాలోనూ లక్ష ఎకరాల ల్యాండ్ బ్యాంకు పేరుతో భూసేకరణ జరుపుతున్న ప్రభుత్వం ఇప్పుడు చిన్న, సన్నకారు రైతుల భూములపై కన్నేయడం దారుణమని రైతు ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజెంటేషన్‌లో ముఖ్యాంశాలు ► ఆంధ్రప్రదేశ్‌లో 12.13 % వ్యవసాయ కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువనున్నాయి. ►2004–05 నుంచి ఇప్పటివరకు దేశంలో 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారింది, ఈ నేపథ్యంలో ఉత్పాదకతను పెంచాల్సి ఉంది. ► పంటలను నిల్వ చేసుకోవడం, ధర వచ్చినప్పుడే విక్రయించుకునే వెసులుబాటు లేకపోవడంతో రైతులు 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,07,994 కోట్లు నష్టపోయారు. ► 2004–05 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే దేశవ్యాప్తంగా వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్నారు. 2004–05లో 16.61 కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తుండగా 2011–12 నాటికి 14.62 కోట్లకు, 2015–16 నాటికి 13.60 కోట్లకు తగ్గిపోయారు. -
లడ్డూ చుట్టూ అవినీతి చీమలు
- దళారులకు ఇంటి దొంగల సహకారం - పెరిగిన ఔట్సోర్సింగ్ సిబ్బంది చేతివాటం - చర్యలు శూన్యంతో చేతులు మారుతున్న రూ.లక్షలు సాక్షి, తిరుమల: భక్తి శ్రద్ధలతో భక్తులు స్వీకరించే తిరుమల శ్రీవారి లడ్డూ చుట్టూ అవినీతి చీమలు చుట్టుకున్నాయి. ఇంటి దొంగలు, దళారులు కలసిపోవడంతో లడ్డూ అక్రమ దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. ప్రసాదాలు విభాగాన్ని పర్యవేక్షించాల్సిన ఉద్యోగే ఏకంగా కార్పొరేట్ కంపెనీతో బేరసారాలు సాగించి గురువారం విజిలెన్స్ విభాగానికి పట్టుబడిన సంఘటనే ఇందుకు నిదర్శనం. భక్తుల రద్దీతో సంబంధం లేకుండా కొందరు ఉద్యోగులు, సిబ్బంది లడ్డూలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుచేసుకోవటంలో ఆరితేరిపోయారు. పై అధికారులను కాకా పట్టుకుని మారు పేర్లతో ఇబ్బడిముబ్బడిగా లడ్డూలు దక్కించుకుంటారు. రూ.25 చిన్న లడ్డూను కనీసం రూ.50కి, రూ.100 కల్యాణోత్సవం లడ్డూ డిమాండ్‌ను ఆధారంగా రూ.200 పైబడి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రద్దీ పెరిగిందంటే వీరికి పంట పండినట్టే. ఆలయ కేంద్రంగా పనిచేసే కొందరు ఉద్యోగులు, ఇతర విభాగాల సిబ్బంది ఈ దందాలో ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అక్రమ దందాలో ఔట్‌సోర్స్ సిబ్బంది హవా లడ్డూ దందాలో కొందరు ఔట్‌సోర్స్ సిబ్బంది చేతివాటం పెరిగిపోయింది. బ్యాంకుల నేతృత్వంలో కొందరు నిజాయితిగా జీతాన్ని నమ్ముకుని పనిచేస్తుంటే మరికొందరు మాత్రం అక్రమంగా కాసులు సంపాదించాలనే ఇక్కడ కొలువులో చేరుతున్నారు. అది కూడా రూ.వేల నుంచి రూ.లక్షల్లో అడ్వాన్సులు చెల్లించి విధుల్లోకి చేరుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసే సుమారు వంద మందిలో 20 శాతం మంది వరకు లడ్డూ అక్రమ తరలింపు పాత కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అయినా అలాంటివారు దొరల్లా కౌంటర్లో లడ్డూ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. లడ్డూతో ముడిపడిన కొన్ని విభాగాలు సిబ్బందికి కాసులు ముట్ట చెప్పి తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తుంటం గమనార్హం. కాసులు కురిపిస్తున్న సబ్సిడీ లడ్డూ టోకెన్లు ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.24 దాకా ఖర్చు అవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. అయితే, టీటీడీ నిర్ణయం దళారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సర్వదర్శనం కోసం రోజూ సుమారు 45 వేల టోకెన్లు అంటే 90 వేల లడ్డూలు ఇస్తున్నారు. అయితే, అక్కడి కొందరి సిబ్బంది చేతి వాటంతో నల్లబజారుల్లోకి తరలిస్తున్నారు. మొన్న లడ్డూ టికె ట్ల ముద్రణలో అక్రమాలు చోటు చేసుకుని కొంత తగ్గినట్టు కనిపించినా మళ్లీ ఆ వ్యాపారం పుంజుకుంది. -
సరళ పన్ను వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దు..
కార్పొరేట్లకు ఆర్థిక మంత్రి జైట్లీ హెచ్చరిక... న్యూఢిల్లీ: సరళీకృత పన్నుల వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దంటూ కార్పొరేట్ కంపెనీలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ప్రపంచమంతా మరింత పారదర్శక పన్నుల వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో చట్టవిరుద్ధమైన లావాదేవీలన్నీ బయటపడకతప్పదని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సరళమైన, తక్కువ పన్ను రేట్ల జమానాలో ప్రతి వ్యక్తీ, అదేవిధంగా కంపెనీలైనా చట్టప్రకారం నడుచుకోవాల్సిందే. అదే వారికి సురక్షితం కూడా. అలాకాకుండా తమ మోసాలను ఎవరూ కనిపెట్టలేరన్న భ్రమల్లో ఉంటే ఇబ్బందుల్లో పడటం ఖాయం. అలాంటి మోసపూరిత చర్యలకు కాలం చెల్లింది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. పన్నులకు సంబంధించి ఆటోమేటిక్ సమాచార మార్పిడి కోసం జీ20 దేశాలు ఆమోదించిన పారదర్శక వ్యవస్థ 2017 కల్లా ఆచరణలోకి రానుందని కూడా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో 9-10 శాతానికి వృద్ధి... పెట్టుబడుల పెంపు.. అదేవిధంగా పన్ను సంస్కరణల కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వచ్చే కొన్నేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 9-10 శాతాన్ని అందుకునే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో కీలకమైన చర్యలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ప్రధానంగా సాగునీటిపై దృష్టిసారించాం’ అని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతికి చోటు లేదన్నారు. స్పెక్ట్రం, బొగ్గు గనులు ఇలా విలువైన సహజ వనరులేవైనాసరే వేలం ద్వారా పారదర్శకమైన విధానంలో కేటాయిస్తున్నామని చెప్పారు. బొగ్గు ఇతరత్రా గనుల వేలంతో వచ్చే ఆదాయాన్ని సంబంధిత రాష్ట్రాలకు చెందేలా కూడా తమ సర్కారు చర్యలు చేపడుతోందని వెల్లడించారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతానికి చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుకు శాయశక్తులా కృషిచేస్తున్నామన్నారు. మనవద్ద తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్న నేపథ్యంలో గత కొద్ది నెలలుగా డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరంగా(ప్రస్తుతం 63 స్థాయిలో ఉంది) కొనసాగుతోందని జైట్లీ చెప్పారు. -
కార్పోరేట్ ఉద్యోగింట.. కానుకల పంట!!
-
కొత్త సంవత్సరం..కొలువుల వసంతం..
కొత్త సంవత్సరం.. దేశంలో లక్షలాది యువతపై కొలువుల వర్షం కురిపించనుంది. కార్పొరేట్ సంస్థల్లో కాలు మోపాలనే ఉద్యోగార్థుల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఎనీ డిగ్రీ.. డోంట్ వర్రీ..! అనే రీతిలో అన్ని కోర్సుల అభ్యర్థులకు వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆకర్షణీయ వేతనాలు సొంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేల్లో తమ నియామకాల తీరుతెన్నులపై ఆయా సంస్థలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం! కొత్త సంవత్సరం.. కొలువుల సంవత్సరం కానుందని, అభ్యర్థులు వాటిని అందుకునే విధంగా ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆయా రంగాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో వినూత్న అవకాశాలు, అందుకునేందుకు మార్గాలపై విశ్లేషణ.. దేశీయ ఉత్పత్తులను పెంచే దిశగా ప్రకటించిన పథకం.. మేక్ ఇన్ ఇండియా: ఈ-గవర్నెన్స్.. డిజిటైజేషన్.. పాలన, కార్యాచరణల్లో సాంకేతికతకు పెద్దపీట వేసే యోచన.. స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్.. దేశం నలుమూలలా అన్ని నగరాలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం.. అన్నిటికీ మించి.. జీడీపీ వృద్ధి రేటు అంచనా 5.6 శాతం..మరోవైపు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్‌లో భాగంగా వేగంగా కదులుతున్న సంస్థలు, ప్రభుత్వాలు.. కొత్త సంవత్సరంలో లక్షల సంఖ్యలో కొలువులు షురూ అనడానికి నిదర్శనాలివే! ఇప్పటివరకు ఆయా సంస్థలు నిర్వహించిన సర్వేలు, గణాంకాల ప్రకారం- 2015లో పది లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. టాప్ సెక్టార్లివే: పది లక్షల ఉద్యోగాలు లభించనున్నాయనే అంచనాల నేపథ్యంలో రిక్రూట్మెంట్ పరంగా టాప్ సెక్టార్స్‌ను పరిశీలిస్తే.. ఐటీ, ఐటీఈఎస్, టెలికం, హాస్పిటాలిటీ, ఫార్మా అండ్ హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, అవుట్ సోర్సింగ్, రిటైల్ రంగాలు ముందంజలో నిలవనున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఉత్పత్తి రంగంలోనూ నియామకాల పరంగా భారీగా వృద్ధి నమోదు కానుండటం గమనార్హం. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐలకు పచ్చజెండా, బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ బ్యాంకులకు అనుమతులు వంటివి బీఎఫ్ఎస్ఐ రంగంలో భారీ నియామకాలకు ఊతమిచ్చే అవకాశముంది. ఈ-కామర్స్ ఈ-కామర్స్.. కొత్త సంవత్సరంలో రిక్రూట్మెంట్స్ కోణంలో ఔత్సాహికులకు సరికొత్త వేదికగా, ఆకర్షణీయమైన రంగంగా నిలవనుంది. ఈ రంగంలో పేరొందిన అమెజాన్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలకు పెద్దఎత్తున పెట్టుబడులు రావడం, భారీ ఆఫర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటుండటంతో ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ ఫుల్ జోష్‌లో ఉంది. అరచేతిలోని మొబైల్ ఫోన్‌తో ఒక్క క్లిక్‌తో అద్భుత ఆఫర్లతో అసంఖ్యాక వస్తువులను ఇంటికే తెచ్చి అందిస్తున్న ఈ-కామర్స్ రంగం మార్కెట్ వాటా మూడు బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు అంచనా. దీంతో ఆయా సంస్థలు సమర్థవంతంగా, వేగంగా సేవలందించేందుకు అవసరమైన మానవ వనరుల నియామకాలను కూడా భారీగా చేపట్టనున్నాయి. ఈ సంవత్సరం ఈ రంగంలో యాభైవేల మందికి పైగా రిక్రూట్ చేసుకునే అవకాశముంది. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో అవసరాల కోసం ఐఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా భారీ సంఖ్యలో ఆఫర్లు అందించాయి. కొత్త సంవత్సరం అటు ఇండస్ట్రీ పరంగా, ఇటు ఔత్సాహికుల కోణంలో ఇయర్ ఆఫ్ ఈ-కామర్స్‌గా నిలవనుంది. రిటైల్, ఎఫ్ఎంసీజీ రిక్రూట్మెంట్స్ జీడీపీలో 15 శాతం వాటా నమోదు చేసుకుంటున్న సంప్రదాయ రిటైల్ రంగంలో కూడా ఈ ఏడాది భారీ సంఖ్యలో నియామకాలు జరగనున్నాయి. ఈ రంగంలో ప్రముఖ సంస్థలన్నీ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతోపాటు ద్వితీయ/తృతీయ శ్రేణి నగరాల్లోనూ స్టోర్స్‌ను నెలకొల్పుతున్నాయి. దాంతో ప్యాకింగ్ బాయ్స్ మొదలు సీఈఓ స్థాయి వరకూ.. రిటైల్, ఎఫ్ఎంసీజీ విభాగాల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ.. మేటి ఐటీ రంగం.. నియామకాల పరంగా మరోసారి మేటిగా నిలవనుంది. ఇప్పటికే టీసీఎస్ 55 వేల మందిని, ఇన్ఫోసిస్ 30 వేలకుపైగా, హెచ్‌సీఎల్, కాగ్నిజంట్ సొల్యూషన్స్ వంటి సంస్థలు 2015-16లో వేల సంఖ్యలో నియామకాలు చేపడతామని ప్రకటించాయి. దీంతో ఈ రంగంలో ఎంఎన్సీ నుంచి చిన్న తరహా సంస్థ వరకూ.. దాదాపు రెండు నుంచి మూడు లక్షల మేర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. అంతేకాకుండా ఐటీ రంగంలోనూ ఈ ఏడాది క్లౌడ్ కంప్యూటింగ్, అనలిటిక్స్ విభాగాలకు ప్రాధాన్యం పెరగనుంది. ఇటీవల ముగిసిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ఎంపికైన అభ్యర్థుల వర్క్ ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. టెలికం.. టాప్ రిక్రూటర్ ఎన్ఎస్డీసీ, ఇతర సంస్థల అంచనా ప్రకారం- 2015లో టెలికం రంగం టాప్ రిక్రూటర్‌గా నిలవనుంది. మొబైల్ ఫోన్స్ వినియోగం ఆరు శాతం పెరగడం, మారుమూల పల్లెలకు సైతం బ్రాడ్ బ్యాండ్ విస్తరణ, వంటి కారణాలతో టెలికాం రంగం 4.5 శాతం రెవెన్యూ వృద్ధి నమోదు చేసుకుంటోంది. దాంతో టెలికం రంగంలో రిక్రూట్మెంట్స్ భారీ స్థాయిలో జరగనున్నాయి. అవకాశాల వేదికగా బీఎఫ్ఎస్ఐ కొత్త సంవత్సరంలో భారీ అవకాశాలకు వేదికగా నిలవనున్న రంగం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. అవి.. ప్రైవేటు బ్యాంకులకు అనుమతులు, ఇన్సూరెన్స్ విభాగంలో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు. దీంతో ఈ రంగంలో కొత్త కంపెనీలు రావడం ఖాయమైంది. ఆ మేరకు నియామకాలు కూడా పెరగనున్నాయి. సాధారణ గ్రాడ్యుయేట్ల నుంచి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వరకూ.. అన్ని అర్హతల అభ్యర్థులకు అవకాశాలు కల్పించే రంగంగానూ నిలవనుంది. కొత్త సంవత్సరంలో ఈ రంగంలో కనీసం 40 వేల నుంచి 50 వేల ఉద్యోగాలు (సేల్స్ నుంచి సెక్రటేరియల్ స్థాయి వరకు) ఉంటాయని అంచనా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. ఎమర్జింగ్ సెక్టార్ ఇటీవల కాలంలో అభివృద్ధి బాటలో పయనిస్తున్న మరో రంగం.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలు భారీ సంఖ్యలో విస్తరించనున్నాయి. ఆర్థిక సంక్షోభం పరిస్థితుల్లోనూ జీడీపీలో పది శాతం వృద్ధి నమోదు చేసుకున్న రంగం ఎంఎస్ఎంఈ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఫలితంగా మరింతగా వృద్ధి బాటలో పయనించనుంది. ఇదే కారణంగా నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. ముఖ్యంగా స్వల్పకాలిక ఒకేషనల్ కోర్సులు, ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల అభ్యర్థులకు చక్కటి వేదికగా నిలవనుంది. 2015లో రెండు లక్షల మేర అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎవర్గ్రీన్.. ఎనర్జీ దేశంలో ఇంధన రంగం కూడా కార్యకలాపాలు, నియామకాల పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి పలు పథకాల అమలు దిశగా చర్యలు వేగవంతమవుతున్నాయి. దాంతో ఈ రంగం కూడా 2015లో టాప్ రిక్రూటర్స్ జాబితాలో నిలవనుంది. అదే విధంగా పెట్రోలియం, పెట్రోలియం అనుబంధ ఉత్పత్తి సంస్థల కార్యకలాపాలు కూడా పెరగనున్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ సబ్జెక్ట్ ఉత్తీర్ణులకు ఈ ఏడాది వేల సంఖ్యలో అవకాశాలు లభించనున్నాయి. ఆతిథ్యానికి ఊతం అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార, వ్యక్తిగత కోణాల్లో భారత్ ప్రస్తుతం బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో దేశంలో హాస్పిటాలిటీ అండ్ టూరిజం(ఆతిథ్యం, పర్యాటకం) రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం కంపెనీలు తమ శాఖలను భారత్‌లో నెలకొల్పడం, వాటి పర్యవేక్షణ కోసం రాకపోకలు సాగిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. భారత్‌లోని పర్యాటక ప్రదేశాలు ఆకర్షణీయంగా నిలుస్తుండటంతో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేకాకుండా స్థానికంగానూ ప్రజలు ఇప్పుడు విహార యాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆతిథ్యం, పర్యాటకం, వీటికి అనుబంధంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ రంగాలు సుస్థిర వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. సగటున 20 శాతం వృద్ధి నమోదు చేసుకుంటున్నాయి. ఈ రంగంలోని సంస్థలు గత మూడేళ్లుగా ఏటా సగటున 50 వేల మందిని నియమించుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. ఇలా మొత్తం మీద కొత్త సంవత్సరం కొలువుల సంవత్సరంగా నిలవనుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచి ఆయా రంగాలు, లభించే ఉద్యోగాలు, సంబంధిత అర్హతలపై కసరత్తు ప్రారంభించి ఆ మేరకు సన్నద్ధం కావాలి. తాము ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టి అవసరమైతే శిక్షణ తీసుకోవాలి. ఫ్రెషర్స్‌కు పెద్ద పీట కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో నియామకాలకు సిద్ధమవుతున్న సంస్థలు తాజా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేయనున్నాయి. సీఐఐ నిర్వహించిన సర్వే ప్రకారం- మొత్తం నియామకాల్లో 80 శాతం ఫ్రెషర్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. అదే విధంగా ఎంట్రీ లెవల్లో అందించే వేతనాల మొత్తాన్ని కూడా గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 10 నుంచి 12 శాతం మేర పెంచనున్నాయి. నాన్-ఫ్రెషర్స్ విషయంలో అనుభవమే కాకుండా వయసుకు కూడా ప్రాధాన్యమిస్తున్నాయి. 30 ఏళ్లలోపు వారిని నియమించుకునేందుకే ఎక్కువ శాతం కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. బీపీఓ/కేపీఓ, ఐటీఈఎస్ రంగాల్లో కంపెనీలు 25 ఏళ్లలోపు వారికే ప్రాధాన్యమిస్తున్నాయి. అంటే.. మొత్తం మీద కంపెనీలు యువశక్తిని కోరుకుంటున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ వరకు ఈ ఏడాది ఉద్యోగార్థుల పరంగా మరో ఆకర్షణీయమైన అంశం.. ఐటీఐ సర్టిఫికెట్ నుంచి ఐఐటీ/ఐఐఎంలలో ఇంజనీరింగ్ /మేనేజ్మెంట్లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు పొందిన అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులోకి రానుండటం. ఎంఎస్ఎంఈ రంగం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ-కామర్స్ వంటి రంగాల్లో పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ వరకు అన్ని కోర్సుల విద్యార్థులకు తమ అర్హతలకు సరితూగే అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా జనరల్ గ్రాడ్యుయేట్స్‌కు కూడా జాయ్‌ఫుల్ ఇయర్‌గా 2015 నిలవనుంది. ముఖ్యంగా బీపీఓ, కేపీఓ, ఐటీ అనుబంధ సర్వీసుల విభాగాల్లో జనరల్ గ్రాడ్యుయేట్స్‌ను పెద్ద సంఖ్యలో నియమించుకునేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మారుతున్న అన్వేషణ మార్గాలు ఇటీవల కాలంలో కంపెనీలు టాలెంట్ సెర్చ్ మార్గాల విషయంలో విభిన్నంగా వ్యవహరిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్, వాక్-ఇన్-ఇంటర్వ్యూస్ వంటి పద్ధతులతోపాటు కొత్తగా సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను మెరుగైన మార్గంగా భావిస్తున్నాయి. వాటిలోని వ్యక్తుల ప్రొఫైల్స్ ఆధారంగా నేరుగా ఇంటర్వ్యూ లెటర్స్ పంపుతున్నాయి. సోషల్ మీడియా మాధ్యమాన్ని ఈ ఏడాది మరింత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక విద్యార్థులు తమ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్‌ను అప్లోడ్ చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన. వృత్తి నైపుణ్యాలతో ఉజ్వల కెరీర్ ఖాయం ఈ సంవత్సరం అన్ని రంగాలు, అన్ని స్థాయిల్లో భారీ సంఖ్యలో నియామకాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే కంపెనీలు అభ్యర్థుల నుంచి తాము కోరుకుంటున్న నైపుణ్యాల విషయంలో స్పష్టంగా, పటిష్ట నిబంధనలతో ముందుకు వెళుతున్నాయి. కాబట్టి ఒకేషనల్ కోర్సులు, ఐటీఐ, డిప్లొమా వంటి ఇతర కోర్సుల అభ్యర్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఇప్పటి నుంచే కృషి చేయాలి. అవసరమైతే ఎన్ఎస్డీసీ, ఎన్‌సీటీవీ వంటి సంస్థలు అందించే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. - సి.ప్రేమ్ ఆనంద్, సీఓఓ, ఎవరాన్ స్కిల్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండగా, బీమా రంగంలో కొత్త కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశముంది. కలిసొచ్చే అంశం పదో తరగతి చదివిన వారి నుంచి ఇన్సూరెన్స్ స్పెషలైజ్డ్ కోర్సులు (యాక్చుయేరియల్ సెన్సైస్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ తదితర) చదివిన వారి వరకూ.. ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత నైపుణ్యాలు, అకడమిక్ అర్హతల ఆధారంగా అవకాశాలు లభించడం. నలుగురిలో కలిసిపోయే చొరవ, వాక్చాతుర్యం వంటివి ఉంటే సాధారణ ఏజెంట్‌గా అడుగుపెట్టి మార్కెటింగ్ హెడ్ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఈ రంగంలో లభిస్తుంది. - కె.సురేశ్, ఫౌండర్ టీం మెంబర్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బిల్డ్ యువర్ నెట్వర్క్ కంపెనీలు ప్రకటనలు ఇచ్చే వరకు ఉద్యోగార్థులు వేచి చూడకుండా ముందస్తుగానే సంబంధిత ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీనికోసం ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను డెవలప్ చేసుకోవాలి. ఇందుకు సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకోవాలి. దీంతోపాటు జాబ్ సెర్చ్ ఇంజన్స్లోనూ ప్రొఫైల్ అప్లోడ్ చేసుకోవడం కూడా లాభిస్తుంది. కంపెనీలు రిక్రూట్మెంట్ ప్రక్రియకయ్యే వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో డెరైక్ట్ రిక్రూట్మెంట్స్కు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. సంబంధిత రంగంలో తాజా పరిణామాలపై అవగాహన ఉందనే విషయం స్పష్టం చేసేలా ప్రొఫైల్‌ను రూపొందించుకుంటే మరింత మేలు. - ఉత్పల్ శ్రీవాస్తవ్, సెంటర్ హెడ్, రాండ్‌స్టాండ్ ఇండియా, హైదరాబాద్ టెలికం రంగంలో టెక్నికల్ స్కిల్స్ టెలికం రంగంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు చక్కటి అవకాశాలు లభించడం ఖాయం. అభ్యర్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా ఈ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీలు (ఉదా: 3జీ, 4జీ తదితర) వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకుంటే మంచి అవకాశాలు ఖాయం. - సుబీర్ శర్మ, డీజీఎం, టాటా కమ్యూనికేషన్స్ నైపుణ్యాలకు ప్రాధాన్యం మారుతున్న ప్రాథమ్యాలు, అవసరాల నేపథ్యంలో కంపెనీలు అభ్యర్థుల నుంచి అకడమిక్‌తోపాటు ఇతర నైపుణ్యాలను కూడా కోరుకుంటున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేయాలి. సమకాలీన అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల ఐఐటీల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్‌లో అభ్యర్థులను కోర్ అంశాలతోపాటు.. పలు కాంటెంపరరీ అంశాలపైనా స్పందించాలని కోరారు. కారణం.. ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవల లక్ష్యం.. సామాజిక అవసరాలు, సామాన్య ప్రజలే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఔత్సాహిక విద్యార్థులు సంబంధిత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. సాధారణంగా కంపెనీలు ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మూడో త్రైమాసికంలో.. 2015-16కు సంబంధించి సెప్టెంబర్ నుంచి నియామకాల దిశగా చర్యలు వేగవంతం చేస్తాయి. అంటే.. ఔత్సాహిక అభ్యర్థులకు ఇంకా ఆరు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో ఆ నైపుణ్యాల సాధనకు కృషి చే యడం మంచిది. స్వయం ఉపాధిలో సుస్థిరతకు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రోత్సహించే దిశగా, స్వయం ఉపాధికి ఊతమిచ్చే విధంగా ఉంది. ఔత్సాహిక అభ్యర్థులు ఎంఎస్ఎంఈ, నిమ్స్‌మే, సెట్విన్ తదితర సంస్థలు అందించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని నైపుణ్యాలు సాధిస్తే సంబంధిత రంగంలో సొంత సంస్థలు స్థాపించుకుని సుస్థిర భవితకు మార్గం వేసుకోవచ్చు. వీటిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు స్వయం ఉపాధి దిశగా సొంత సంస్థలు నెలకొల్పేందుకు అవసరమైన ఆర్థిక చేయూత కూడా లభిస్తుంది. - జి. శ్రీనివాసరావు, డిప్యూటీ డెరైక్టర్, ఎంఎస్ఎంఈ -
జాయ్ ఆఫ్ డాన్స్
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. ఐదంకెల జీతం.. లగ్జరీ లైఫ్. ఇదంతా పైకే. మరోవైపు భరించలేని ఒత్తిడి.. ప్రశాంతత దూరం. ఈ మానసిక వేదనకు చెక్ పెట్టాలనుకున్నారు సరస్వతి. తనలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారినీ గట్టెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘డ్యాన్స్’తో ఒత్తిడిని చిత్తు చేయవచ్చని నిరూపించారు. డ్యాన్స్ కాంపిటీషన్స పెట్టి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బొల్ల సరస్వతి రావు సీఏ పూర్తి చేసి కొన్నాళ్లు ఓ కార్పొరేట్ కంపెనీలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇంకొంత కాలం ఇతర కంపెనీల్లో విధులు నిర్వహించారు. ఏ కంపెనీలో చూసినా ఒత్తిడి తప్పలేదు. అందరి పరిస్థితీ ఇదేనని ఆమె గమనించారు. విధులకు కాసింత ఉత్సాహం తోడైతే ఉరిమే ఉల్లాసాన్ని పొందవచ్చని గ్రహించారు. ఇందుకోసం ఆమె డ్యాన్స్‌ను ఎంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు డ్యాన్స్‌ని వంటబట్టిస్తే చాలు.. కచ్చితంగా మనసు కుదుట పడుతుందని నమ్మారు. ఈ సూత్రాన్ని లయబద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ‘చాస్ డ్యాన్స్ స్టూడియో’కి ప్రాణం పోశారు. సదరు కంపెనీల అనుమతి తీసుకుని ఉద్యోగులు పనిచేస్తున్న చోటే నృత్యాక్షరాలు నేర్పిస్తున్నారామె. కేవలం డ్యాన్స్ నేర్పడంతో ఊరుకోకుండా ‘లైమ్లైట్ ఇంటర్-కార్పొరేట్ డ్యాన్స్ కాంపిటీషన్’ను తెరమీదకు తీసుకొచ్చారు. ‘జాయ్ ఆఫ్ డ్యాన్స్’... లాస్ట్ ఇయర్ బెంగళూరులో నిర్వహించిన ఈ కాంపిటీషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫోసిస్ టీమ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. తొలిసారి నగరంలో... మొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. నవంబర్ రెండో వారంలో హైటెక్ సిటీ ఇందుకు వేదిక కానుంది. ఒక్కో కార్పొరేట్ కంపెనీ నుంచి 15 మంది సభ్యులకు మించకుండా ఎన్ని గ్రూపులైనా పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులుంటాయి. కాంపిటీషన్ నిర్వహణకు పోను మిగిలిన డబ్బును అనాథ పిల్లలకు డొనేట్ చేస్తున్నామని గురువారం సోవూజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సవూవేశంలో సరస్వతి చెప్పారు. వివరాలకు 080-41620127లో సంప్రదించవచ్చన్నారు. - మహి -
విగ్‌ల తయారీలో మహిళా దీప్తి
పరిచయం ఎన్టీయార్, ఏయన్నార్, ఎంజీయార్ల కాలంలో విగ్ అంటే వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఉంగరాల, నొక్కుల జుత్తు హీరోలు, నడుం కింద కి పారాడే పొడవాటి జడలున్న కథానాయికలను తెరకెక్కించడానికి, ప్రేక్షకుల కలలరూపాలను హీరో హీరోయిన్ల రూపంలో దర్శింపజేయడానికి సినిమా రూపకర్తలు విగ్లను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. సాధారణ జనం సైతం విగ్‌ల వినియోగంపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యువతి విగ్ తయారీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం విశేషం. 29 ఏళ్ళ దీప్తి పంచుకున్న సంగతులు ఆమె మాటల్లోనే... నాన్నే తొలి గురువు... మేం తెలుగువాళ్లమైనా, చెన్నైలో స్థిరపడ్డాం. నాన్న (అప్పారావు) సినిమా రంగంలో విగ్ మేకర్. రజనీకాంత్, బాలకృష్ణ వంటి ఎందరో పెద్ద తారలతో వర్క్ చేశారు. చిన్నప్పటి నుంచి నాన్న పని చూస్తూ పెరిగా. అప్పుడప్పుడు ఆయన పనిలో సాయపడేదాన్ని కూడా. అయితే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని నాన్న అనుకోలేదు. బహుశా నా సోదరుణ్ణి తీసుకువద్దామని అనుకున్నారేమో... బిఎస్సీ, ఎంబిఎ పూర్తి చేశా. కార్పొరేట్ కంపెనీలో పెద్ద జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు... జుట్టు లేకపోవడం అనేది యువతను కూడా తీవ్రంగా బాధిస్తున్న సమస్యగా అర్థమైంది. నిజానికి సినిమాల కంటే బయటే దీని అవసరం చాలా ఉందనిపించింది. దీంతో 8 నెలల్లోనే ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి రావాలని నిశ్చయించుకున్నా.. అధ్యయనం చేసి... అడుగేశా... విగ్ తయారీలోకి వస్తానన్నప్పుడు నాన్నతో సహా అందరూ కొంత సందేహించినా... తర్వాత నా ఆలోచన పూర్తిగా వివరించాక ఓకె అన్నారు. మన దగ్గర విగ్ తయారీకి సంబంధించి ప్రత్యేకంగా కోర్సు ఏమీ లేదు కాబట్టి...సింగపూర్, కొరియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ అత్యాధునిక మెలకువలు నేర్చుకున్నా. చైనాలో, కొరియాలో అయితే విగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలే ఉంటాయి. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విగ్ తయారీలో వస్తున్న మార్పులు అందుబాటులో ఉన్న కేశాలంకరణ శైలులు... వీటిన్నింటి మీదా అవగాహన ఏర్పరచుకున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘లా మార్స్’ హెయిర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ ప్రారంభిస్తున్నా. కేశ ‘సంపదే’... మనవాళ్లు కేశసంపద అంటుంటారు నిజంగా కేశాలు సంపదే. జుట్టు విలువ, అది లేకపోతే ఎదురయ్యే సమస్యలు, వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖవర్ఛస్సుకు అత్యంత అవసరమైనది జుట్టే. అలాంటి పరిస్థితుల్లో... కారణాలేవైతేనేం... ప్రస్తుతం జుట్టు లేకపోవడం అనేది యువతను బాధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. మిగతా అన్ని రకాలుగా బాగున్నా... కేవలం కేశాలు నిర్ణీత పరిమాణంలో లేకపోవడం చాలా మందిని వేధిస్తోంది. అయితే మన దగ్గర చాలా మందికి విగ్ వాడకంపై పూర్తి అవగాహన లేదు. విదేశాలలో విగ్‌లు సర్వసాధారణంగా వినియోగిస్తారు. మన దగ్గర మాత్రం రకరకాల నూనెలు, వైద్యప్రక్రియలతో జుట్టు మొలిపించేందుకు అష్టకష్టాలు పడతారే గాని విగ్‌ల జోలికి వెళ్లడం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది. అందరికీ అందుబాటులో... వంశపారంపర్యంగా బట్టతల వచ్చేవాళ్లే కాకుండా విభిన్న కారణాల వల్ల కేశాలను కోల్పోతున్నవాళ్లు, కేన్సర్, అలోపేసియా వంటి రోగాల బాధితులు... ఇలా విగ్‌ల అవసరం ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా వినియోగించేందుకు వీలుగా విగ్లను అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఒక విషయం...తక్కువ ఖరీదు కదా అని సింథటిక్ హెయిర్స్‌తో రూపొందిన విగ్లను వాడితే అవి ఇతరత్రా సమస్యలు సృష్టిస్తాయి. ఈ విషయంలో విగ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. -ఎస్.సత్యబాబు -
ఫిక్సింగ్ టు కుకింగ్
ఒకప్పుడు అష్రాఫుల్ బంగ్లాదేశ్‌లో పెద్ద క్రికెట్ స్టార్. తన ముద్దుపేరు ‘బంగ్లా సచిన్’. ఒకప్పుడు ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలన్నీ తన వెనక పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 29 ఏళ్ల వయసులో తన సహచరులు ఇంకా ఆడుతుంటే తాను మాత్రం క్యాటరింగ్ ఆర్డర్స్ కోసం అదే కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నాడు. అవును... అష్రాఫుల్ ఇప్పుడు ఢాకాలో ఓ చైనీస్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. బత్తినేని జయప్రకాష్ ఓల్డ్ ఢాకా... సాయంత్రం 7 గంటలు... వెళ్లాల్సిన ప్రదేశం షెజ్వాన్ గార్డెన్స్... విపరీతమైన రద్దీ.. చుట్టూ బోర్డులన్నీ బెంగాలీలో... ఒక్కళ్లకీ హిందీ, ఇంగ్లీష్ రావడం లేదు... ఎలా..? ‘మీరు అడ్రస్ అడిగితే ఎవరూ చెప్పరు. అష్రాఫుల్ రెస్టారెంట్ ఎక్కడ?’ అని అడగండి (ఫోన్లో అష్రాఫుల్). ఫర్వాలేదు... అష్రాఫుల్కు ఇంకా గిరాకీ బాగానే ఉంది. పది నిమిషాల్లోనే రెస్టారెంట్‌కు వెళ్లగలిగిన పరిస్థితి. మ్యాచ్ ఫిక్సర్‌గా ముద్రపడ్డా తన రెస్టారెంట్‌కు డిమాండ్ కూడా బాగానే ఉంది. ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడం సహజం. పరిస్థితి బాగోక మారిపోయేవాళ్లు కొంతమందైతే... చేజేతులా కెరీర్‌ను నాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. ఇందులో రెండో కోవలోకి వచ్చే క్రికెటర్ అష్రాఫుల్. 2013 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా గ్లాడియేటర్స్‌కు కెప్టెన్‌గా ఆ జట్టు ఆడిన మ్యాచ్‌ను ఫిక్స్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనివల్ల ఎదురైన పరిణామాలకు ఎలా స్పందించాడు? భవిష్యత్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలకు అష్రాఫుల్ చెప్పిన సమాధానాలు అతడి మాటల్లోనే... కోపంతో చేశా బంగ్లాదేశ్ లీగ్ తొలి సీజన్లో ఢాకా గ్లాడియేటర్స్ నన్ను 1.60 కోట్ల టాకా(బంగ్లాదేశ్ కరెన్సీ)లకు కొనుక్కుంది. రెండో సీజన్ సమయానికి నా ఫామ్ పోయింది. కేవలం 48 లక్షల టాకాలకే అదే జట్టు కొనుక్కుంది. అయితే తొలి సీజన్‌కు సంబంధించి వాళ్లు నాకు కేవలం 86 లక్షల టాకాలు మాత్రమే ఇచ్చారు. మిగతావి ఇవ్వలేదు. దీంతో ఢాకా జట్టు ఓనర్‌కి, నాకు చాలాసార్లు వాగ్వాదాలు జరిగాయి. ఒక రోజు ఒక బుకీ నా దగ్గరకు వచ్చి 10 లక్షల టాకాలు ఇస్తా, మ్యాచ్ ఫిక్స్ చేయమని అడిగాడు. కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు ఢాకా ఓనర్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత... నేను ఆ కోపంలో ఉండగానే బుకీ వచ్చాడు. 10 లక్షల టాకాలు ఇస్తా మ్యాచ్ ఓడిపోమని అడిగాడు. ఆ సమయంలో ఏం ఆలోచించానో తెలియదు. నా డబ్బులు నాకు రాలేదని కోపం బహుశా నన్ను అలా ఆలోచించేలా చేసిందేమో. నేను ఒప్పుకున్నాను. నా జీవితంలో నేను చేసిన తప్పు అదొక్కటే. డబ్బు మనిషిని కాను నిజానికి నేను డబ్బు మనిషినే అయితే గనక ఎప్పుడో ఐసీఎల్లోనే నాకు 15 కోట్ల టాకాలకు కాంట్రాక్ట్ ఇస్తామని వచ్చారు. కానీ ఆ లీగ్‌లో నేను ఆడితే బంగ్లాదేశ్ అభిమానులు నన్ను డబ్బు మనిషిగా భావిస్తారని వెళ్లలేదు. దేశం, అభిమానులు ముఖ్యమని అనుకున్నా కాబట్టే అప్పట్లో అంత భారీ మొత్తం ఇస్తామన్నా వెళ్లలేదు. ఐసీసీ విచారణ ఐసీసీ విచారణలో మొదట గంట పాటు నేనేం చెప్పలేదు. కానీ అప్పటికే నా మీద నిషేధం ఖాయమని తెలుసు. ఓ గంట తర్వాత ఎందుకో నా మనసుకు అనిపించింది. ఎందుకు అబద్దం చెప్పడం.? అదేదో నిజం చెప్పే నిషేధాన్ని ఎదుర్కొందాం అనుకున్నాను. బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అభిమానులు నన్ను ఎంతో ఆరాధించారు. కానీ తిరిగి వాళ్లకు నేనేం ఇచ్చాను. ఎలాగూ నా కెరీర్ ముగిసిపోతోంది. ఇక ఎందుకు అబద్దం ఆడటం? స్నేహితులతో కలిసి రెస్టారెంట్ నిషేధం తర్వాత స్నేహితులు నాలో ధైర్యం పెంచారు. వాళ్లలో ఎక్కువమంది చిన్నప్పుడు నాతో కలిసి క్రికెట్ ఆడినవాళ్లే. నేనేంటో వాళ్లకు తెలుసు. అందుకే అందరం కలిసి ఈ రెస్టారెంట్ (షెజ్వాన్ గార్డెన్) పెట్టుకున్నాం. మా వాళ్లు సంబంధాలు చూస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటివరకూ గర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవడానికి సమయం సరిపోలేదు. క్రికెట్‌తో బిజీగా గడిపాను. ఇప్పుడు సమయం దొరికింది. కాస్త దైవం మీద కూడా శ్రద్ధ పెరిగింది. హజ్ వెళ్లి రావాలని అనుకుంటున్నాను. ఆ రోజులు మరవలేను 2001లో 17 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ క్రికెట్ రాతను మార్చాను నేను. ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించే దేశంలో అభిమానులను క్రికెట్ వైపు మళ్లించింది నేనే. 17 ఏళ్ల వయసులో తొలి టెస్టు సెంచరీ చేయడంతో నాకు క్రేజ్‌వచ్చింది. ఓ దశలో జట్టు ఎలా ఆడినా, గెలిచినా ఓడిపోయినా వేరే వాళ్లు పరుగులు చేసినా... ఏం జరిగినా అన్ని పేపర్లలో మొదటి పేజీలో నా ఫొటోనే వచ్చేది. ఒకప్పుడు ‘అష్రాఫుల్’ అనేది బంగ్లాదేశ్ క్రికెట్‌కు మారుపేరు. క్షమించండి: ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నన్ను ఆదరించారు. కానీ నేను తిరిగి వాళ్లకు ఏమీ ఇవ్వలేకపోయాను. కేవలం ఒక్క బీపీఎల్ మ్యాచ్‌లో మాత్రమే నేను తప్పు చేశాను. నన్ను క్షమించి మరొక్క అవకాశం ఇస్తే అందరి రుణం తీర్చుకుంటాను. -
ఐక్య ఉద్యమాలతోనే తెలంగాణ
పోరులో మాదిగల పాత్ర ప్రశంసనీయం కార్పొరేట్ కంపెనీలతో చేతివృత్తులు కనుమరుగు టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఖమ్మం, న్యూస్‌లైన్ తెలంగాణ ప్రాంత ప్రజలు న్యాయపరమైన హక్కుల కోసం పోరాడారని, దోపిడీ, అణచివేతకు గురైన అన్ని వర్గాల వారి ఐక్య ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన అమరుల ఆత్మఘోష మహాసభ ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. మాదిగలు లేనిదే కాలుకు చెప్పులు లేవని, అసలు నడకే లేదని అన్నారు. పురాతన కాలం నుంచి అనేక అవసరాలకు పనిముట్లు సరఫరా చేసిన మాదిగలు.. కార్పొరేట్ కంపెనీలతో ప్రమాదంలోకి నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల వారు తెలంగాణ ఉద్యమంలో ఒకే వేదికపైకి వచ్చారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మరెంతో దూరంలో లేదని అన్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచేలా ఉందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేవారు. జయశంకర్ సారు చెప్పినట్లు ఉద్యమానికి భావ వ్యక్తీకరణ, ఆందోళన, రాజకీయ చైతన్యం అవసరం అని అన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బిక్షపతి మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కుల సాధన తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, అణచివేతకు గురైనవారికి సమాన న్యాయం చేయాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. కృపాకర్ మాదిగ మాట్లాడుతూ సీమాంధ్రలో కొంతమంది పెత్తందారులు మాత్రమే రాష్ట్రం విడిపోవద్దని కోరుకుంటున్నారని అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇరు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయాలని అన్నారు. జనరల్ డయ్యర్‌ను పోలిన విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు బండి వీరయ్య మాదిగ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటపతిరాజు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ తిరుమలరావు, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలికూర వెంకటేశ్వర్లు మాదిగ, బాబూజాన్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.